ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు

ఏపీ ప్రజలకు శుభవార్త.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో ఏపీసీపీడీసీఎల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చని ప్రకటించింది. ఇటీవల ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి డిజిటల్‌ చెల్లింపులకు డిస్కంలు గుడ్ బై చెప్పాయి. అయితే ఒక్క నెలలోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యిందట.. కరెంట్ బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోవటంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ కారణంగా ఉన్నతాధికారులు ఫోన్‌ పే చెల్లింపులు తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపారు.

ఏపీలో ఇకపై విద్యుత్‌పంపిణీ సంస్థ ఏపీసీపీడీసీఎల్‌ యాప్‌, వెబ్‌సైట్‌తో పాటు ఫోన్‌ పేతో కూడా కరెంట్ చెల్లింపులు చేయొచ్చని అధికారులు తెలిపారు. గతంలో వినియోగదారులు ప్రతి నెలా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి క్యూలలో నిలబడి బిల్లులు చెల్లించేవారు. ఆ తర్వాత డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించారు. వినియోగదారులు కూడా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బుల్ని చెల్లించేవారు. అంతా సాఫీగా సాగిపోతున్నసమయంలో.. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి నెల క్రితం ఫోన్‌పే, గూగుల్‌పే చెల్లింపులు కుదరవని డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి

మొన్నటి వరకు ఫోన్‌ పే, గూగుల్‌ పేల సాయంతో వినియోగదారులు సులభంగా విద్యుత్‌ బిల్లుల చెల్లించారు. కొత్తగా వచ్చిన ఏపీసీపీడీసీఎల్‌ యాప్‌, వెబ్‌ సైట్‌ ద్వారా చెల్లింపుల విషయంలో కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాలు, కరెంట్ బిల్లుల చెల్లింపు కేంద్రాల దగ్గర క్యూ లైన్లు కనిపించాయి. ఫోన్‌ పే, గూగుల్‌ పే చెల్లింపుల నిలిచిపోవడంతో సీపీడీసీఎల్‌ పరిధిలో రూ.కోట్లలోనే చెల్లింపుల బకాయిలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. భారీగా బకాయిలు ఉండటంతో..
ఉన్నతాధికారులు ఫోన్‌ పేతో కూడా చెల్లింపులు పునరుద్ధరించినట్ తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో గూగుల్‌పేతో కూడా విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు అందుబాటులో తీసుకొస్తామని చెబుతున్నారు.

కరెంట్ బిల్లుల డిజిటిల్ పేమెంట్స్ ద్వారా చెల్లింపులు ఆగిపోయాయి. ప్రతినెలా బిల్లు చెల్లింపు కోసం విద్యుత్‌ వినియోగదారులు ఆయా డిస్కంల వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ ద్వారా చెల్లించాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులు డిస్కంల యాప్‌/వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెల్లింపులు చేయాలి.. అయితే వినియోగదారుల నుంచి బకాయిలు పెరగడంతో డిస్కం మళ్లీ మనసు మార్చుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *