Recent Posts

అచ్యుతాపురం బాధితులకు చంద్రబాబు పరామర్శ.. వారికి రూ.50లక్షలు, రూ.25 లక్షలు ప్రకటన

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌‌లోని ఫార్మా కంపెనీ ప్రమాదంలో బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేశారు.. భయపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు.మెడికవర్ ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధితుల కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు.. వారికి ధైర్యం …

Read More »

ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనలో సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చిన రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Kolkata Case: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్‌ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేసు విచారణకు సంబంధించిన పురోగతిపై సుప్రీంకోర్టుకు సీబీఐ రిపోర్ట్ సమర్పించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జేడీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఈ కేసును ఆగస్టు 20 వ తేదీన ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అనంతరం ఈ కేసుకు సంబందించి వాదనలు వింటుండగా.. దీనిపై స్టేటస్‌ రిపోర్టు అందించాలని …

Read More »

ల్యాండింగ్ వేళ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ

Air India: ల్యాండింగ్ సమయంలో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. 135 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా.. బాంబు బెదిరింపు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు పైలట్‌ను అలర్ట్ చేశారు. అయితే ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన బయటికి రప్పించారు. అనంతరం ఆ విమానంలో గాలింపు చేపట్టారు. మరోవైపు.. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు మొత్తం పూర్తిస్థాయి ఎమర్జెన్సీ విధించారు. కేరళ …

Read More »