Recent Posts

జమ్మూ కశ్మీర్‌‌ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడే షెడ్యూల్

మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు మీడియాను సమావేశానికి ఆహ్వానించింది. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 30లోగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో మిగతా మూడు రాష్ట్రాలతో పాటు కశ్మీర్‌లోనూ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక, హరియాణా అసెంబ్లీకి నవంబరు 3తోనూ.. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు …

Read More »

సత్తెనపల్లి: ఏడేళ్ల చిన్నారి వరల్డ్ రికార్డులు.. అనారోగ్యం వెంటాడుతున్నా సరే, హ్యాట్సాఫ్

ఏడేళ్ల బాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా స్కూల్‌కు వెళుతూ అరుదైన ఘనతను దక్కించుకుంది.. సరికొత్త రికార్డుల్ని అందుకుంది. ఐదున్నర నెలలకే పుట్టి.. మూడున్నరేళ్ల వయసు వరకు ఒక గదిలోనే చికిత్స తీసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తాన్‌వలి కారు డ్రైవర్‌ కాగా.. కేరళకు చెందిన షీబాను వివాహం చేసుకున్నారు. షీబా 2017లో గర్భం దాల్చిన ఐదో నెలలోనే అయత్‌ ఇశ్రాయెల్ జిబ్రిల్‌ అనే పాపకు జన్మనిచ్చారు. పుట్టినప్పుడు బిడ్డ బరువు 500 గ్రాములే ఉండటం, అవయవాలు పూర్తిగా రూపుదాల్చలేదు. …

Read More »

విజయవంతంగా నింగిలోకి చేరిన ఈవోఎస్-8.. ఇస్రో ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌ మొదటి లాంచింగ్ ప్యాడ్ నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-8 (EOS-08)ను చిన్నపాటి ఉపగ్రహ వాహన నౌక ఎఎస్ఎస్ఎల్వీ-డీ3 శుక్రవారం ఉదయం ప్రయోగించారు. ఆరున్నర గంటల కౌంట్ డౌన్ అనంతరం ఉదయం 9.17 గంటలకు బయలుదేరిన రాకెట్.. 17 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న …

Read More »