Recent Posts

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా విలయం.. నగరం అతలాకుతలం..!

హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వాన కురుస్తుండటంతో.. నగరంలోని రహదారులన్ని ఒక్కసారిగా జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్లపైనే వర్షంలో తడిసి ముద్దయిపోయారు. చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో… లోతట్టు …

Read More »

పవన్ కళ్యాణ్ -ఆద్యల క్యూట్ ఫొటో.. రేణూ దేశాయ్ రియాక్షన్ వైరల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే ఈ వేడుకలకి పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ కుమార్తె ఆద్య కూడా హాజరైంది. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్‌ తన కూతురితో సెల్ఫీ దిగుతున్నప్పుడు తీసిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోపైనే రేణూ దేశాయ్ రియాక్ట్ అయ్యారు. ఆద్య అర్థం చేసుకుంటుంది “స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకి నాన్నతో …

Read More »

సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలో ఇక్కడ కూడా, ఇకపై ఈజీగా

సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో దిగ్విజయంగా కొనసాగుతున్న నిత్య అన్నప్రసాద పథకానికి విరాళాలు సమర్పించాలనుకునే భక్తులకు డిజిటల్‌ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. సింహాద్రి అప్పన్న స్వామి నిత్యాన్నప్రసాద పథకం 35వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అన్నప్రసాద పథకానికి సాధారణ భక్తులు సైతం విరాళాలు సమర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. సింహాచలం ఆలయం అన్నదానం భవనం దగ్గర కార్డు స్వైపింగ్‌ పరికరాలు, డిజిటల్‌ చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈవో. …

Read More »