Recent Posts

విజయవాడ దుర్గమ్మ హుండీకి భారీగా ఆదాయం.. 15 రోజుల్లో ఎన్ని కోట్లంటే

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న కనకదుర్గమ్మకు భారీగా ఆదాయం సమకూరింది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకలను ఆలయ మహా మండపంలో లెక్కించారు. దుర్గమ్మకు 15 రోజులకుగాను రూ. 2,68,18,540 ఆదాయం నగదు రూపంలో వచ్చింది. అంటే రోజుకు సగటున రూ.17,54,569 మేరకు కానుకలు వచ్చినట్లు లెక్క. నగదులతో పాటుగా 380 గ్రాముల బంగారం, 5కిలోల 540 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చాయి. 401 ఓమన్ రియాల్స్, 281 అమెరికా డాలర్లు, 110 యూరోలు, 70 అస్ట్రేలియా డాలర్లు, 20 ఇంగ్లండ్‌ …

Read More »

నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్‌.. చరిత్రలో నిలిచిపోనున్న ప్రారంభ వేడుకలు..!

ప్రపంచ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ దేశాల్ని ఒక్కచోటకు చేర్చి ఆటలాడించే అద్భుత ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. నేడు పారిస్‌ వేదికగా ఒలింపింక్స్‌ 2024కు తెరలేవనుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడల్లో నేటి నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. చివరగా పారిస్‌లో 1924లో ఒలింపిక్స్‌ జరిగాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అక్కడ పోటీలు జరగనున్నాయి. ఒలింపిక్స్‌ చరిత్రలో నిలిచిపోనున్న వేడుకలు.. సాధారణంగా ఎప్పుడైనా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు ఆతిథ్య నగరంలోని ప్రధాన స్టేడియంలో జరుగుతాయి. …

Read More »

ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త సినిమా.. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన రీసెంట్ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ఓటీటీలోకి అడుగుపెట్టింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్‌కి జోడీగా నటించింది జాన్వీ కపూర్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే హిందీలో మాత్రమే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా ఇతర డబ్బింగ్ వెర్షన్‌ల గురించి నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. థియేటర్లో రూ.50 కోట్లకి పైగా వసూళ్లు సాధించి ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది.

Read More »