అనుకున్నదే జరిగింది. ఊహించినట్లుగానే.. బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని అనుకున్నట్లుగానే చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్క ప్రకటనతోనే గోల్డ్ రేట్లు ఎగబాకుతున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు.. కిందటి రోజు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ద్రవ్యోల్బణం అదుపలోకి వస్తున్న క్రమంలో.. కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో త్వరలోనే చైనా కేంద్ర బ్యాంకు కూడా ఇదే బాటలో వడ్డీ రేట్లను తగ్గించనుంది. ఇక ఇప్పటికే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను సెప్టెంబర్ సమీక్షలోనే తగ్గించనున్నట్లు ఇప్పటికే ప్రకటన చేసింది. ఇది కీలకంగా మారనుంది. తర్వాత రిజర్వ్ బ్యాంక్ కూడా ఇదే అనుసరించనుంది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే.. ఇదే సమయంలో డాలర్ డిమాండ్ పెరిగి బంగారం ధర తగ్గుతుంటుంది. ఇదే సమయంలో వడ్డీ రేట్లను తగ్గిస్తే.. బంగారం ధర అమాంతం పెరుగుతుంటుంది.
Check Also
Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …