హమ్మయ్యా.. తగ్గిన బంగారం ధర.. వెండి రూ.1000 డౌన్.. 

బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. నాలుగు రోజుల పాటు వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన పసిడి ధరలు ఇవాళ దిగివచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు రికార్డ్ గరిష్ఠాల నుంచి తగ్గుముఖం పడుతున్న క్రమంలో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతోనూ కొనుగోళ్లు కాస్త స్తబ్దుగా కొనసాగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పండగల సీజన్ మొదలైన క్రమంలో దేశీయంగా బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఆగస్టు నెలలో ఏకంగా 10.6 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం గణాంకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు సెప్టెంబర్ 18వ తేదీన ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు

అంతర్జాతీయ మార్కెట్లలో చూస్తే బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. అయినా గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2574 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 30.76 డాలర్ల వద్ద ఉంది. ఇక రూపాయి విలువ కాస్త తేరుకుని రూ.83.800 స్థాయిలో అమ్ముడవుతోంది.

హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా దిగివచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర తులంపై రూ.150 తగ్గడంతో రూ.68 వేల 800 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ఢిల్లీలో రూ.110 తగ్గి రూ. 75040 వద్ద ఉంది

రూ.1000 మేర తగ్గిన వెండి ధర

బంగారంతో పాటు వెండి ధరలు సైతం భారీగానే తగ్గాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1000 మేర పడిపోయి రూ. 97 వేల వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో చూస్తే కిలో వెండి రేటు రూ. 1000 మేర తగ్గడంతో ప్రస్తుతం కిలో రూ.92 వేలు పలుకుతోంది. అయితే, పైన పేర్కొన్న బంగారం, వెండి ధరల్లో పన్నులు కలపలేదు. ప్రాంతాలను బట్టి పన్నులు మారుతుంటాయి. దీంతో ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *