సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో ప్రతిష్టాత్మక కార్యక్రమంవైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపికబురు వినిపించారు. తెలంగాణలో విద్యార్థులకు మెరుగైన విద్యా అందించటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే.. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పైలెట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిరలో క్యాంపస్‌లు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత.. అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే.. ఆదివారం …
Read More »అమాంతంగా పెరిగిపోయిన టమాటా ధరలు.. 15 రోజుల్లోనే ట్రిపుల్.. అసలు కారణాలివే..!
కూరగాయలు కొందామంటేనే సామాన్యులు వణికిపోతున్నారు. కూరగాయల ధరలు వింటేనే గుండెల్లో దడ పుడుతుందంటున్నారు జనాలు. ఆ రేంజ్‌లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. అందులోనూ.. టమాట ధరలు మండిపోతున్నాయి. నెల కిందటి వరకు టమాటా ధరలు 30 నుంచి 40 రూపాయలు (కిలోకు) ఉండగా.. ఈ 15 రోజుల గ్యాప్‌లోనే కొండెక్కి కూర్చున్నాయి. ఈ రెండు వారాల్లోనే ఉన్నట్టుండి టమాట రేట్లు ఏకంగా ట్రిపుల్ అయ్యాయి. ప్రస్తుతం టమాటా ధర.. 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాటా ధర …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎవరూ డబ్బులు ఇవ్వొద్దన్న టీటీడీ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు అక్టోబరు 7న తిరుమలకు చేరుకుంటాయి.
Read More »రేపే అకౌంట్లలోకి డబ్బులు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. వారందరికీ బిగ్ రిలీఫ్
ఏపీలో వరద పరిహారం ఇంకా అందనివారికి బిగ్ రిలీఫ్.. వివిధ కారణాల వలన వరద పరిహారం అందని వారికి సోమవారం పరిహారం పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వరదల కారణంగా సుమారు నాలుగు లక్షల మంది ప్రభావితులయ్యారనే అంచనాతో ప్రభుత్వం వరద పరిహారం విడుదల చేసింది. మొత్తం రూ.602 కోట్లు విడుదల చేయగా.. ఇప్పటికే చాలా మందికి వారి బ్యాంకు ఖాతాల్లో పరిహారం మొత్తం జమైంది. అర్హులైన వారిలో ఇప్పటి వరకూ 98 శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. …
Read More »బతుకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు.. ‘తెలంగాణ హెరిటేజ్ వీక్’ పేరుతో సంబురాలు
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సూచిక.. తెలంగాణకు మాత్రమే సొంతమైన పూల కేళిక.. బతుకమ్మ పండుగ. పూలను పూజించే అత్యంత అరుదైన సంబురం బతుకమ్మ. ప్రకృతిలోనే పరమాత్మున్ని చూసుకుని.. పూలనే గౌరమ్మగా భావించి.. చేసుకునే తొమ్మిదిరోజుల మహా ఉత్సవం బతుకమ్మ. అలాంటి బతుకమ్మ పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు.. బతుకమ్మ పండుగకు అధికారికంగా గుర్తించాయి. అంతేకాదు.. బతుకమ్మ సంబరాల వారాన్ని.. బతుకమ్మ …
Read More »బెజవాడ దుర్గమ్మకు మంగళసూత్రం చేయించిన సామాన్య భక్తుడు.. రూపాయి, రూపాయి కూడబెట్టి
విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఓ సామాన్య భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. కొబ్బరి బోండాల వ్యాపారం చేసే అతడు కొన్నేళ్లుగా రూపాయి రూపాయి కూడబెడుతూ.. పోగు చేసిన సొమ్ముతో 203 గ్రాముల బంగారం కొని అమ్మవారికి మంగళసూత్రం తయారుచేయించి తీసుకొచ్చాడు. ఆ హారం విలువ రూ. 16.50 లక్షల విలువ ఉంటుందని ఆలయ సిబ్బంది తెలిపారు. అమ్మవారి భక్తుడైన అంకులయ్యా.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేల తన కానుకను సమర్పించి మురిసిపోయాడు. తన కుటుంబంతో కలిసి శనివారం (అక్టోబర్ 5) దుర్గగుడికి వచ్చి మంగళసూత్రాలను …
Read More »సీఎం రేవంత్ రెడ్డి, కొండా సురేఖపై పరువు నష్టం దావా.. కేటీఆర్ సంచలన నిర్ణయం
KTR on Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు రసవత్తవరంగా మారాయి. హైడ్రా కూల్చివేతలతో పాటు ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అయితే.. ఈ గొడలన్నింటి మధ్య రైతుల రుణమాఫీ అంశం మరుగున పడిపోతుండటంతో.. ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపడుతోంది. ఇటు మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉండటంతో పాటుగానే.. అటు రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఈరోజు (అక్టోబర్ 05న) రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రైతు ధర్నా …
Read More »జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు రద్దు.. బిగ్ షాక్
Jani Master Case: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించిన షాక్ తగిలింది. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. 2022 సంవత్సరానికి గానూ తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు (తిరుచిట్రంబలం) సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌ను నేషనల్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కాగా.. అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ జరగనుంది. అయితే.. రిమాండ్ ఖైదీగా చంచల్ గూడా …
Read More »తిరుమల శ్రీవారి భక్తులకు చంద్రబాబు శుభవార్త.. టీటీడీకి కీలక ఆదేశాలు
తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని టీటీడీ అధికారుల్ని ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆయన టీటీడీ అధికారులతో సమావేశమై సమీక్ష చేశారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని.. కొండపై ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు అన్నారు. ఈ విషయంలోనూ రాజీ పడొద్దని.. ప్రసాదాల నాణ్యత మరింత మెరుగపడాలని సూచించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు చంద్రబాబు. టీటీడీ సేవలపై …
Read More »ఏపీకి, విజయవాడవాసులకు కేంద్రం శుభవార్త.. చంద్రబాబు రిక్వెస్ట్‌తో వాటన్నిటికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడకు కేంద్రం తీపికబురు చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్‌తో విజయవాడతో పాటుగా అమరావతికి కీలకమైన పలు జాతీయరహదారుల ప్రాజెక్టులు దక్కాయి. తాజాగా విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కి.మీ. మేర సూపర్‌స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుల్ని ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చింది. వీటితో పాటుగా రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చారు. ఈ మేరకు ఆ ప్రాజెక్టులకు రూ.12,029 …
Read More »సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం.. కుమార్తె గాయత్రి కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం.. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రస్తావించారు. ఓ …
Read More »సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్.. ఆప్ ఎంపీ ఇంట్లో మకాం
Arvind Kejriwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ముఖ్యమంత్రి అధికారిక నివాసం నుంచి ఖాళీ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి కొన్ని నెలల పాటు తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. కొన్ని రోజుల క్రితమే బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ క్రమంలోనే తాను ప్రజాకోర్టులో గెలిచి.. మళ్లీ సీఎం పదవిలో కూర్చుంటానని.. అప్పటివరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ఇటీవలె ఎన్నిక కాగా.. …
Read More »నాగార్జున హీరో కాదు విలన్.. ఆ ఒక్క కారణంతోనే మంత్రిని ఇబ్బంది పెడుతున్నారు: తీన్మార్ మల్లన్న
తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చిత్ర సీమలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో.. నాగచైతన్య, సమంత విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను అటు రాజకీయ నాయకులతో పాటు తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి చాలా మంది ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాకుండా.. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే.. ఈ …
Read More »తిరుపతి లడ్డూ అంశంపై సుప్రీంకోర్టు సంచలనం.. విచారణకు సీబీఐ సిట్
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. ఐదుగురు సభ్యులతో.. వీరిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది. తిరుమల లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే తిరుమల లడ్డూ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. అంతకుముందు …
Read More »కోర్టులు, చట్టాలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. వారాహి డిక్లరేషన్ విడుదల, ముఖ్యాంశాలివే!
Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించారు. దేశంలో సనాతన ధర్మాన్ని కించపరిచే చర్యలను అడ్డుకునేందుకు బలమైన, కఠినమైన చట్టాన్ని వెంటనే తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. ఆ చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఈ వారాహి …
Read More »