ఆ 185 మంది దగ్గరే రూ. 100 లక్షల కోట్లు.. ఈ డేటా చూస్తే మైండ్ బ్లాంక్.. టాప్-10 లో ఒకే మహిళ!

Ambani Adani Wealth: ప్రపంచ దేశాల్లో.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి రేటు ఇతర చాలా దేశాలతో పోలిస్తే ఘనంగా ఉందని చెప్పొచ్చు. ఇదే సమయంలో.. భారత్‌లో సంపన్నుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో నికర సంపద ఒక బిలియన్ డాలర్లకు (రూ. 8400 కోట్లు) పైగా సంపద ఉన్న వారి సంఖ్య 185 ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ మొత్తం 185 మంది నికర సంపద ఒక ట్రిలియన్ డాలర్ …

Read More »

తోడేళ్లు కనిపిస్తే కాల్చిపారేయండి.. యోగి సర్కార్ సంచలన ఆదేశాలు

UP Govt: గత కొన్ని రోజులుగా ఉత్తర్‌ప్రదేశ్‌లో తోడేళ్ల దాడులు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. కనిపించిన వారిపై కనిపించినట్లే దాడులు చేయడంతో ఇప్పటివరకు 10 మంది మృత్యువాతపడ్డారు. మరో 30 మందికిపైగా తోడేళ్ల దాడుల్లో గాయపడ్డారు. ఇక చనిపోయిన 10 మందిలో 9 మంది చిన్న పిల్లలే కావడం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా తోడేళ్లు చేస్తున్న దాడులను నివారించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని తోడేళ్లను అధికారులు పట్టుకోగా.. మరికొన్ని మాత్రం …

Read More »

సొంతగడ్డపై పాకిస్థాన్‌కు ఘోర పరాభవం.. రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్ విజయం..

సొంతగడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఆ జట్టు టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. పూర్తిస్థాయి జట్టులో బరిలోకి దిగినప్పటికీ.. బంగ్లాదేశ్‌ను కట్టడి చేయలేక చిత్తుగా ఓడిపోయింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓడి.. ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. రెండో టెస్టులో పట్టు చిక్కే అవకాశం లభించినప్పటికీ.. 6 వికెట్ల తేడాతో పరాజయం పాలై పరువు పోగొట్టుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో 185 …

Read More »

వరద బాధితులకు తీన్మార్ మల్లన్న ఆర్థిక సాయం.. ఎంత ప్రకటించారంటే..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తాయి. దీంతో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల ప్రజలు ముంపు బాధితులుగా మిగిలారు. భారీ వరదలకు ఇల్లు వాకిలి కొట్టుకుపోయి నిరాశ్రయులుగా మారారు. దీంతో వారిని అదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. తాజాగా.. వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సాయం ప్రకటించారు. వరద బాధితుల కోసం ఎమ్మెల్సీగా తనకు వచ్చే ఒక నెల జీతాన్ని సీఎం సహాయ నిధికి …

Read More »

ఆ 2000 నోట్లన్నీ ఇక చిత్తు కాగితాలేనా? RBI మరో కీలక ప్రకటన.. 

Rs 2000 Notes: రూ.2 వేల కరెన్సీ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి కీలక ప్రకటన చేసింది. చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.96 శాతం రూ.2000 కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపింది. ఇంకా ప్రజల వద్ద రూ.7261 కోట్లు విలువైన పెద్ద నోట్లు ఉన్నాయని తెలిపింది. మే 19, 2023 రోజున చలామణి నుంచి 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాటిని మార్చుకునేందుకు …

Read More »

ఎట్టకేలకు దిగొచ్చిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. వారందరికీ ఉద్యోగాలు.. ఇప్పటికే ఆఫర్ లెటర్స్!

ఐటీ ఉద్యోగుల్లో కొంత కాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. చాలా వరకు.. లేఆఫ్స్ ప్రభావం తమపై ఉంటుందని కంగారుగా ఉన్నారు. కారణం.. ఏడాది వ్యవధిలో దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వరుసగా తగ్గుతుండటమే. అతిపెద్ద భారత ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా అన్ని కంపెనీల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులు తగ్గిపోయారు. ఇదే సమయంలోనే అసలు నియామకాల ఊసే లేదు. దీంతో ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందారు. ఇప్పటి సంగతి పక్కనబెడితే.. దిగ్గజ …

Read More »

ఖమ్మంలో భారీ వరదలకు కారణమదే.. ఆ విషయంపై చర్చిస్తాం: సీఎం రేవంత్‌

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయింది. ఖమ్మం జిల్లాలో అయితే వేల మంది నిరాశ్రయులుగా మారారు. మున్నేరు వరదు ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన రేవంత్.. ఆక్రమణల వల్లే ఖమ్మం పట్టణాన్ని వరదలు ముంచెత్తాయన్నారు. గతంలో గొలుసు కట్టు చెరువులు ఉండేవని ప్రస్తుతం చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. పట్టణంలో వరదలకు కారణమైన మున్నేరు రిటైర్నింగ్ వాల్ ఎత్తు …

Read More »

ఏపీ మంత్రులకు ఎస్కార్ట్ వాహనాలు రద్దు.. కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు, లోకేష్ ఐడియా అదుర్స్

ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విజయవాడలో వరద విలయం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు వరద సహాయక కార్యక్రమాలను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారుల పర్యటన, వరద సహాయక చర్యలను మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల, ప్రజలకు ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశమయ్యారు. వరద సహాయకచర్యలు, బాధితులకు భోజనం అందించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ మేరకు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు ఎస్కార్ట్ వాహనాలు …

Read More »

విశాఖ: కడుపునొప్పితో వచ్చిన మహిళకు స్కానింగ్.. రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్, వామ్మో ఎలా సాధ్యం

విశాఖపట్నంలో విచిత్రమైన ఘటన జరిగింది. తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన కేజీహెచ్‌ డాక్టర్లు రిపోర్టులు చూసి అవాక్కయ్యారు. ఆమె కడుపులో ఏకంగా శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించారు అవాక్కయ్యారు.. వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. మూడేళ్ల క్రితం మరోసారి గర్భం దాల్చడంతో అబార్షన్‌ కోసం ఆమె మందులు వాడారు. ఆ తర్వాత కొంత కాలం నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు మూడో వారంలో …

Read More »

రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ కోటి.. ఏపీకి అశ్వనీదత్, ఆయ్ టీం విరాళం

రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం వరుణుడి దెబ్బకు అతలాకుతలం అవుతోన్నాయి. వరదల ధాటికి ఊర్లన్నీ నీటమునిగాయి. ఇంట్లోకి నీరు వచ్చి చేరింది. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎంతో మందికి నిద్ర, ఆహారం కరవయ్యాయి. ప్రభుత్వం నిరవధికంగా సహాయక చర్యలు అందిస్తూనే ఉంది. ఈ వరదల వల్ల ఏపీలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి. ఇక ఈ వరదల ప్రభావం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది. అందుకోసం టాలీవుడ్ నుంచి సెలెబ్రిటీలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. రెండు తెలుగు …

Read More »

ఏపీ ప్రభుత్వానికి వరద సాయం కింద NRI భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు

ఏపీలో వరద విపత్తు వేళ ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు.. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటున్నారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు.. కొందరు విరాళాలు, మరికొందరు ఆహారం తెచ్చి వరద బాధితులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ విరాళాలను ప్రకటించగా.. తాజాగా మరో ఎన్ఆర్ఐ, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఏపీకి భారీగా విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి విరాళాన్ని ప్రకటించారు. ఏపీలో పరిస్థితులతో ప్రముఖ ఎన్ఆర్ఐ, పారిశ్రామిక వేత్త గుత్తికొండ శ్రీనివాస్ …

Read More »

ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.. తుఫాన్ తప్పదా?.. ఈ జిల్లాలపై ప్రభావం!

ఆంధ్రప్రదేశ్‌కు వాయుగండం ముప్పు తొలగిపోయిందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇంతలో మరో ముప్పు ఏపీని వెంటాడుతోంది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మెల్లిగా బలపడి తుఫాన్‌గా మారి విశాఖపట్నం, ఒడిశా దిశగా …

Read More »

తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు సాయం.. అశ్వినీదత్ భారీగా, ఎంత ప్రకటించారంటే!

తెలుగు రాష్ట్రాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అండగా నిలిచారు. రెండు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి వివరించారు.. వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కూడా తన వంతు సాయంగా వ్యక్తిగత పింఛన్‌ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షల చొప్పున పంపించారు. అలాగే వెంకయ్య కుమారుడు హర్షవర్దన్‌ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్‌ తరఫున రెండు రాష్ట్రాలకు రూ.2.5 లక్షల చొప్పున, కుమార్తె …

Read More »

గుడివాడలో జనసేన నేతలపై జీరో ఎఫ్‌ఐఆర్.. వైసీపీ మాజీ మంత్రి ఎఫెక్ట్

గుడివాడ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం రోజు గుడివాడ వెళ్లిన పేర్ని నానిని జనసేన నేతలు అడ్డుకున్న సంగతి తెలిసందే. గతంలో పేర్ని నాని పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.. పోలీసులు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల్ని అడ్డుకున్నారు. అయితే తాజాగా పేర్ని నాని మచిలీపట్నం పోలీస్టేషన్‌లో తన డ్రైవర్‌తో ఫిర్యాదు చేయించారు. పేర్ని …

Read More »

కేంద్రం నుంచి రూ.250 కోట్ల ఆర్డర్.. దూసుకెళ్లిన స్టాక్.. లక్ష పెడితే రూ.6 లక్షలు!

Oriana Power: స్మాల్ క్యాప్ కేటగిరి పవర్ సెక్టార్ స్టాక్ ఒరియానా పవర్ లిమిటెడ్ షేరు ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో 5 శాతం మేర లాభపడి అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి భారీ ఆర్డర్ దక్కించుకున్నట్లు ప్రకటించిన క్రమంలో ఈ కంపెనీ షేర్ పరుగులు పెట్టింది. కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. అలాగే ఈ కంపెనీ షేరు గత ఆరు నెలల కాలంలోనే ఏకంగా 171 …

Read More »