ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదలతో.. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. ఎలాంటి ప్రయాణాలైనా …

Read More »

ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు.. ఘాట్ రోడ్డు మూసివేత, ఏడుగురు మృతి

Vijayawada Rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం అతలాకుతలం అవుతోంది. రెండు రోజులుగా ముసురు వానలు కురుస్తుండగా.. శనివారం ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం వరదతో నిండిపోయింది. ప్రధాన రహదారులు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇక ప్రముఖ ఇంద్రకీలాద్రి గుట్టపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై ఉన్న ప్రోటోకాల్ రూమ్‌పై భారీ బండరాళ్లు విరిగిపడటంతో అది …

Read More »

గుంటూరులో కారు కొట్టుకుపోయి టీచర్, విద్యార్థులు మృతి; 

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలు చోట్ల తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో విషాదం చోటు చేసుకుంది. వరద ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయి, స్కూల్ టీచర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మానిక్‌గా గుర్తించారు. మంగళగిరి మండలం, ఉప్పలపాడుకు చెందిన నడుంపల్లి రాఘవేంద్ర (38).. నంబూరులోని వివా స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తరగతులు ముగిసిన అనంతరం.. ఇంటికి బయల్దేరే …

Read More »

ఆగకుండా కురుస్తోన్న వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, వాతావరణశాఖ హెచ్చరికలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా వైపుగా కదులుతున్న వాయుగుండం తీవ్రంగా బలపడింది. కళింగపట్నానికి దక్షిణంగా 30కి.మీ, విశాఖకు ఈశాన్యంగా 90 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, …

Read More »

నేడు కళింగపట్నం వద్ద తీరం దాటనున్న అల్పపీడనం.. కోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడి వాయుగుండంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఈశాన్యంగా 80 కిలోమీటర్లు, కళింగపట్నానికి నైరుతిగా 40 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి నైరుతిగా 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వాయుగుండం గంటకు 6 కి.మీ. వేగంతో కదులుతోందని, ఆదివారం కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని …

Read More »

ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటికి ‘హైడ్రా’ నోటీసులు..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎవ్వరినీ లెక్క చేయకుండా బుల్డోజర్లు పంపిస్తున్నారు. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక ఇప్పటికే కొందరు అక్రమ నిర్మాణదారులకు హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. మాదాపూర్‌ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు నిర్మించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. ఇక …

Read More »

అంబానీనా మజాకా.. గూగుల్, యాపిల్‌కు గట్టి షాక్ ఇచ్చిన జియో.. దెబ్బకు దిగిరానున్న ధరలు!

Cloud Storage Pricing: ఇటీవల జరిగిన రిలయన్స్ ఏజీఎం (యాన్యువల్ జనరల్ మీట్) లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. దీపావళి నుంచి 100 GB వరకు క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందించనున్నట్లు.. ఇది వెల్‌కం ఆఫర్ కింద వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ విభాగంలో ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి గూగుల్, యాపిల్ సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని పేర్కొన్నారు విశ్లేషకులు. జియో ఎంట్రీతో.. ఇక క్లౌడ్ స్టోరేజీ …

Read More »

నారా లోకేష్ ‘రెడ్ బుక్‌’కు N-కన్వెన్షన్‌ కూల్చివేతకు లింక్.. గాదె ఇన్నయ్య సంచలన కామెంట్స్

ప్రస్తుతం హైడ్రా (HYDRA) అనేది.. టాక్ ఆఫ్ ది సిటీగానే కాకుండా.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేవలం తెలంగాణ వరకే కాకుండా.. పక్క రాష్ట్రాల్లోనూ హైడ్రా గురించి చర్చ నడుస్తోందంటే.. బుల్డోజర్ల ప్రభావం గట్టిగానే పడిందని అర్థమవుతోంది. అందుకు కారణం.. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ భూములు కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా.. సామాన్యులా, సెలెబ్రిటీలా, రాజకీయ ప్రముఖులా అనేది చూడకుండా.. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా.. అక్రమకట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తుండటమే. ముఖ్యంగా.. టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ …

Read More »

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఎండీ అధికారులు హైదరాబాద్‌కు భారీ వర్షం హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్‌‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావారణ కేంద్రం అధికారులు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం …

Read More »

పాకిస్థాన్‌కు టీమిండియా రావొద్దు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆతిథ్య పాకిస్థాన్ ఏర్పాట్లు చకచకా చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన స్టేడియాల్లో మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించింది. అయితే భారత్ మాత్రం పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనే విషయంపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. కొందరేమో.. ఇరు దేశాల మధ్య ఘర్షణలను పక్కకు పెట్టి ఆటకోసమైనా భారత్.. పాక్‌కు వెళ్లాల్సిందే అని పట్టుబడుతున్నారు. పలువురు పాకిస్థాన్ మాజీలు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ల కోసం పాకిస్థాన్ అభిమానులు ఎదురుచూస్తున్నారని.. చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ …

Read More »

గుజరాత్‌‌కు ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.. అస్నాగా నామకరణం

గుజరాత్‌కు తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌గా మారింది. కచ్‌ తీరం, పాకిస్థాన్‌ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఈ తుఫాన్‌కు అస్నాగా పేరు పెట్టగా.. ఈ పేరును పాకిస్థాన్‌ సూచించింది. అరేబియా సముద్రంలో 1976 తర్వాత ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుఫాన్‌ అని చెబుతున్నారు. కచ్‌ తీరం మీదుగా ఆవరించిన అస్నా తుఫాన్ అరేబియా సముద్రంలోకి ఒమన్‌ దిశగా కదిలింది. ఆగస్టులో తుఫాన్‌లు రావడం చాలా అరుదు అని చెబుతున్నారు.. అయితే సముద్రాలు వేడెక్కడంతో తుఫాన్‌ ఏర్పడింది …

Read More »

ఆర్మీ చాపర్ నుంచి జారిపడిన హెలికాప్టర్.. లైవ్ వీడియో వైరల్

ఆర్మీ చాపర్ నుంచి హెలికాప్టర్ జారి పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో దెబ్బతిన్న హెలికాప్టర్‌ను అక్కడి నుంచి మరో చోటుకు తరలించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఆ దెబ్బతిన్న హెలికాప్టర్‌ను ఆర్మీ చాపర్‌కు తీగల సహాయంతో కట్టి తీసుకువస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ చాపర్‌కు కట్టిన తీగలు ఒక్కసారిగా తెగిపోవడంతో కింద ఉన్న హెలికాప్టర్ పట్టుకోల్పోయి.. పడిపోయింది. ఆ హెలికాప్టర్ కొండల్లో పడిపోతున్న దృశ్యాలను దూరంగా …

Read More »

రాజీనామాకు రెడీ.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 నెలల్లో ఏకంగా 60 లక్షల మొక్కలు నాటామంటూ చెబుతున్న అటవీశాఖ సిబ్బందికి సవాల్ చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్‌లో నిర్వహించిన వనమహోత్సవ సభలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. గత 5 నెలల్లో ఇంత భారీ మొత్తంలో మొక్కలు నాటారని నిరూపిస్తూ రాజీనామా చేస్తాను అన్నారు. సోషల్ ఆడిట్లో 60 లక్షల మొక్కలు నాటినట్లు నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. అలాగే అయ్యన్నపాత్రుడు అటవీ …

Read More »

రాశిఫలాలు 31 ఆగస్టు 2024:

దిన ఫలాలు (ఆగస్టు 31, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులకు ఆస్కారముంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగి పోతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా, సంతృప్తికరంగా ఉంటుంది. మిథున రాశి వారికి అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కొందరు బంధువులతో రాజీమార్గంలో వివాదాలను పరిష్కరించుకుంటారు. పెళ్లి ప్రయత్నాల …

Read More »

ఏపీకి పొంచి ఉన్న వాయుగుండం ముప్పు.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఊపందుకున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపిస్తోంది. రెండు రోజులుగా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది.. ఆదివారం తెల్లవారుజాముకు వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. …

Read More »