గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నగరంలోని వందల కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి సర్కారుకు అప్పగించారు. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో.. పక్కా ఆధారాలతో కూల్చేవేతలు చేపట్టాలని హైడ్రా భావిస్తోంది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలకు చెందిన ‘లేక్ వ్యూ’ ప్రాజెక్టులపై ప్రస్తుతం హైడ్రా ఫోకస్ …
Read More »Blog Layout
గాంజా శంకర్ అటకెక్కిందా?.. శర్వాతో సంపత్ నంది కొత్త చిత్రం
సంపత్ నంది హిట్టు కొన్ని ఎన్నేళ్లు అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బెంగాల్ టైగర్ అంతో ఇంతో బాక్సాఫీస్ వద్ద ఆడేసింది. ఇక సీటీమార్, గౌతమ్ నందా అంటూ ఓ మోసర్తుగా మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అవేవీ కూడా హిట్లు అని చెప్పలేం. ఇక కెరీర్ ప్రారంభంలో వచ్చిన పేరు, సక్సెస్ ఇప్పుడు కనిపించడం లేదు. సంపత్ నంది ప్రస్తుతం నిర్మాతగా, దర్శకుడిగా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఓ వైపు నిర్మాతగా చిత్రాలు చేస్తూ, కథలను అందిస్తూనే ఉన్నాడు. మరో వైపు …
Read More »విమానాశ్రయాల్లో సరికొత్త విధానం.. ఇకపై సెకెన్లలోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి!
విమానాశ్రయాల్లో మరింత వేగంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ప్రయోగాత్మకం చేపట్టిన ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌ను దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అమలుచేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలోని ప్రధాన 20 ఎయిర్‌పోర్టులకు దీనిని విస్తరిస్తున్నట్టు పేర్కొంది. ఈ విధానం వల్ల ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సెకెన్ల నుంచి గరిష్టంగా 30 నిమిషాల్లోనే పూర్తవుతుందని తెలిపింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జూన్ 22న ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP)ను కేంద్ర …
Read More »విశాఖవాసులకు టీటీడీ అద్భుత అవకాశం.. ప్రతిరోజూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, ఎక్కడంటే!
విశాఖపట్నంవాసులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నగరంలో కూడా అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి ప్రసాదానికి విశేష ఆదరణ వస్తోందని.. అందుకే ఎండాడ శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (టీటీడీ)లో ఇకపై ప్రతి రోజు లడ్డూలు విక్రయించనున్నారు. గతంలో గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిగేవని.. భక్తుల కోరిక మేరకు గురువారం నుంచి ఇవి ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి …
Read More »‘ఫౌజీ’ కోసం మృణాల్ ఠాకూర్… ఇద్దరితో ప్రభాస్ రొమాన్స్?
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో రాబోయే రెండేళ్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన పోస్టర్ గ్లిమ్స్ తో అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుందనే నమ్మకం కలుగుతుంది. ఒకవైపు రాజాసాబ్ సినిమా చేస్తూనే మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో …
Read More »కదిరి: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్.. ఏమైందంటే
శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ బాలుడి దవడలో బ్రష్ గుచ్చుకుంది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో 11 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే బాలుడు ఉదయాన్నే లేచి పళ్ళు తోముతున్నాడు.. ఆ సమయంలో బాలుడు కిందపడటంతో బ్రష్‌లోని పదునైన భాగం దవడలోకి చొచ్చుకుపోయింది. బ్రష్ దవడలో అలాగే ఇరుక్కుపోగా.. వెంటనే తల్లిదండ్రుల్ని బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాలుడికి ఆపరేషన్ చేసి బ్రష్‌ను తొలగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.. బాలుడికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
Read More »డీఎస్పీగా మహిళా బాక్సర్ నిఖత్ జరీన్.. వెల్‌కమ్ చెప్పిన తెలంగాణ డీజీపీ
భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం తెలంగాణ డీజీపీ జితేందర్‌ను కలిసిన జరీన్.. తన జాయినింగ్ రిపోర్టును సమర్పించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ డిపార్ట్‌మెంట్‌లోకి ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్ నిఖత్ జరీన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ పోలీస్)గా కొత్త పాత్రను స్వీకరించినందున శుభాకాంక్షలు తెలిపుతూ.. ఆమెను …
Read More »సాయి పల్లవి అందరినీ మోసం చేసిందా!.. అసలు ఇది నిజమేనా?
సాయి పల్లవి అంటే.. కొన్ని డైలాగ్స్ అలా అందరికీ గుర్తుకు వచ్చేస్తాయి. మరీ ముఖ్యంగా ఫిదా సినిమాలో ఆమె చెప్పిన డబ్బింగ్, యాసను పలికించిన తీరుకు నిజంగానే అంతా ఫిదా అయ్యారు. ఆ మూవీతోనే సాయి పల్లవి తెలుగు ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు. అయితే సాయి పల్లవి ఫిదా సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుందని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కూడా చెప్పారు. పైగా డబ్బింగ్ చెప్పిన నాటి విజువల్స్‌ను కూడా యూట్యూబ్‌లో పెట్టారు. కానీ ఇప్పుడు ఓ …
Read More »ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఫిక్స్..! ఫ్రాంఛైజీల రిటెన్షన్ డెడ్‌లైన్ అదే.. రూల్స్‌పై ఉత్కంఠ!
భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి కూడా క్రికెట్ అభిమానులకు.. ఐపీఎల్‌పై అత్యంత ఆసక్తి ఉంటుంది. దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఇటు బీసీసీఐకి.. అటు ఆటగాళ్లపై కాసులు కురిపిస్తుందని చెప్పొచ్చు. రాత్రికి రాత్రే ఆటగాళ్ల దశ మార్చగల సత్తా ఐపీఎల్‌కు ఉంది. ఫ్రాంఛైజీలు ఆయా ఆటగాళ్లను దక్కించుకునేందుకు నిర్వహించే వేలం ఇంకా ఉత్కంఠకరంగా సాగుతుంది. గత సీజన్‌కు ముందు నిర్వహించిన మినీ వేలంలోనే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ అత్యధికంగా వరుసగా …
Read More »వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. పిన్నెల్లికి మరోసారి ఆ బాధ్యతలు, వరుసగా రెండోసారి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు అధినేత వైఎస్ జగన్. ఈ మేరకు జిల్లాల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు.. జిల్లాలవారీగా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో జైలుకు వెళ్లి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి అధినేత జగన్ కీలక బాధత్యలు అప్పగించారు. పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమించారు. అంతకముందు కూడా పిన్నెల్లి ఆ బాధ్యతల్లో ఉన్నారు.. ఆయన్ను పార్టీ అధ్యక్షుడు జగన్ మళ్లీ నియమించారు. వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలో పల్నాడు, …
Read More »