Chandrababu on Free Gas scheme in Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. దీపావళి నుంచి మరో హామీని అమలుచేయనున్నట్లు ప్రకటించారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యా్స్ సిలిండర్ పథకం దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్న చంద్రబాబు.. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులను కూడా చేపడతామని …
Read More »Blog Layout
ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్లు.. ఈసారి ముందుగానే, కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శాఖలవారీగా ప్రక్షాళన మొదలుపెట్టింది. ఈ మేరకు విద్యాశాఖపై మంత్రి లోకేష్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అవసరమైన చోట్ల మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ ఇవ్వాలని భావిస్తున్నారట.. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌ను వచ్చే ఏడాది నుంచి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. యూనిఫామ్ మాత్రమే కాదు.. బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత …
Read More »బీఆర్ఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని ఆదేశం
బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో షాక్ తగిలింది. నల్గొండ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పార్టీ నాయకులే కార్యాలయానికి కూల్చివేయాలని.. లేదంటే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చేశారని హెచ్చరించింది. పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసేలా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆఫీస్ నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కదా..? అని ప్రశ్నించింది. పార్టీ ఆఫీసు నిర్మించిన తర్వాత ఎలా అనుమతి ఇస్తారని పిటిషనర్‌ను …
Read More »భూమిపైకి మహాభారతంతో సంబంధం ఉన్న మినీ చంద్రుడు… ఇస్రో కీలక ప్రకటన
పిల్లలు తినడానికి మారాం చేస్తే.. చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పాట పాడుతూ తల్లులు గోరు ముద్దలు పెడుతుంటారు.. ఇది నిజం కాబోతోందని, చంద్రుడి భూమిపైకి వచ్చి దాదాపు రెండు నెలల పాటు ఉంటాడని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరిక్షం నుంచి ఒక గ్రహశకలం భూమిపైకి వస్తుందని.. అది గురుత్వాకర్షణ పరిధిలో సంచరిస్తుందని చెబుతున్నారు. నాసాకు చెందిన అట్లాస్ పరికరం ద్వారా ఆగస్టు 7న గుర్తించిన 2024 PT5అనే 10 మీటర్ల వ్యాసం ఉండే ఈ గ్రహశకలం సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 …
Read More »ఒక్కో పేజర్‌లో 3 గ్రాముల పేలుడు పదార్థం.. హెజ్బొల్లాను పక్కా స్కెచ్‌తో దెబ్బకొట్టిన మొసాద్!
లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా జరిగిన పేజర్ పేలుళ్ల వెనుక ఇజ్రాయేల్ స్కెచ్ ఉన్నట్టు వెల్లడయ్యింది. మొత్తం 5 వేలకుపైగా పేజర్లు పేలిన ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా… దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయేల్ గూఢచర్య సంస్థ మొసాద్ పక్కా ప్లానింగ్‌తో దాడి చేసింది. పేలిపోయిన పేజర్లు తైవాన్‌లో తయారుకాగా.. కొద్ది నెలల కిందటే హెజ్బొల్లా గ్రూప్ ఆర్డర్ చేసిందని లెబనాన్‌కు చెందిన భద్రతా వర్గాలు రాయిటర్స్‌కు వివరించాయి. ఈ ఆపరేషన్ కోసం మొసాద్ కొద్ది నెలలుగా కార్యాచరణ …
Read More »ఏపీలో టీచర్‌గా పనిచేసిన ఢిల్లీకి కాబోయే సీఎం ఆతిశీ.. ఆ ఫేమస్ స్కూల్ ఎక్కడుందంటే!
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ మార్లేనా ఎన్నికయ్యారు.. త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలతో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ సీఎం కాబోతున్న అతిశీ గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి.. ఆమె ఏపీలో టీచర్‌గా పనిచేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని కురబలకోట మండలం రిషివ్యాలీ స్కూల్ ఉంది. గతంలో ఆతిశీ ఆ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా …
Read More »ఎంట్రీతోనే అదరగొట్టిన స్టాక్.. తొలిరోజే పెట్టుబడి డబుల్.. ఒక్కోలాట్‌పై రూ.1.20 లక్షల లాభం!
IPO Listing: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి కొనసాగుతోంది. రోజుకో కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. మూడు రోజుల క్రితమే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ భారీ లాభాలతో లిస్టింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరో కంపెనీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపించింది. అదే ఇన్నోమెట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ లిమిటెడ్ (Innomet Advanced Materials Ltd) స్టాక్. ఈ కంపెనీ షేర్లు జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలో సెప్టెంబర్ 18 బుధవారం రోజున …
Read More »ఏపీలో మహిళలకు తీపికబురు.. ప్రతి నెలా ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.1500
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో పథకం అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది.. నూతన మద్యం విధానం, వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఆడబిడ్డ నిధి పథకంపై చర్చ జరిగింది. పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. సూపర్స్ సిక్స్‌లో భాగంగా.. …
Read More »మోదీ ఓ అద్భుతం.. వచ్చే వారం కలుస్తా.. డొనాల్డ్ ట్రంప్
వచ్చేవారం తమ దేశంలో పర్యటించనున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీని తాను కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిచిగాన్‌లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ట్రంప్.. ప్రధాని మోదీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ అద్భుతమైన వ్యక్తి అని ఆకాశనికెత్తేశారు. ‘వచ్చే వారం ఆయన ఇక్కడకు వస్తున్నారు.. నేను కలుస్తాను’ అని అన్నారు. అయితే, ఇరువురి భేటీకి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి …
Read More »అనంతపురం వరకు ఆ రైలు పొడిగింపు.. బెంగళూరుకు ఈజీగా వెళ్లొచ్చు
ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. బెంగళూరు-పుట్టపర్తి ప్యాసింజర్ రైలు (06515/06516)ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్యాసింజర్ రైలును పుట్టపర్తి వరకు కాకుండా అనంతపురం వరకు పొడిగించినట్లు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి నిత్యం బెంగళూరుకు రాకపోకలు ఉంటాయి.. ఇప్పుడు ఈ రైలును అనంతపురం వరకు పొడిగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు పుట్టపర్తితో పాటుగా బెంగళూరుకు వెళ్లేందుకు రైలు సౌకర్యం కల్పించాలని అంబికా లక్ష్మీనారాయణ …
Read More »