Blog Layout

విశాఖ ఎయిర్‌పోర్టులో కొత్త సేవలు.. ఇక ఆ ఇబ్బందులు తప్పినట్లే..

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. విశాఖపట్నం విమానాశ్రయంలో నూతన సేవలు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయం నుంచి నిత్యం ఎంతోమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం విశాఖపట్నం విమానాశ్రయంలో డిజి యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్రవారం కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సేవలను ప్రారంభించారు. విశాఖపట్నంతో పాటుగా రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, పట్నా, గోవా, కోయబత్తూరు సహా 9 చోట్ల డిజి యాత్ర సేవలను అందుబాటులోకి తెచ్చారు. …

Read More »

వైఎస్ జగన్ టీమ్‌లోకి ఐఐటియన్.. గతంలో లోకేష్ దగ్గర.. ఎవరీ సాయిదత్?

2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ.. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కొన్ని జిల్లాలలో వైసీపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక ఎన్నికల తర్వాత కూడా పలువురు ముఖ్యనేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికీ చాలా మంది పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్మిర్మాణం చేసి.. పార్టీ …

Read More »

పిల్లల చదువు, పెళ్లికి బెస్ట్ ప్లాన్.. ఒకేసారి చేతికి రూ.28 లక్షలు.. సెప్టెంబర్ 30 వరకే ఛాన్స్

పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారమనే చెప్పాలి. ఈ క్రమంలో చాలా మంది పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పాలసీ అందిస్తోంది. అదే ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్. ప్రస్తుతం ఈ పాలసీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే ఇందులో సేవింగ్స్ బెనిఫిట్స్‌తో పాటు బీమా కవరేజీ లభిస్తోంది. ఇందులో మనీ బ్యాంక్ …

Read More »

రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. ఇంటర్‌, డిగ్రీ అర్హత

RRB NTPC Notification 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రాడ్యుయేట్ పోస్టులు (లెవల్ 5, 6 పోస్టులు), అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల (లెవల్ 2, 3) కోసం RRB NTPC 2024 షార్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 11,558 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల(NTPC) పోస్టుల కోసం మొత్తం 11,558 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8113 ఉన్నాయి. అలాగే.. అండర్ గ్రాడ్యుయేట్ …

Read More »

గ్యాంగ్ రేప్ జరగలేదు.. ఆరోపణలు తోసిపుచ్చిన సీబీఐ వర్గాలు

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందనే ప్రచారాన్ని సీబీఐ తోసిపుచ్చింది. ఈ కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడని అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి నిర్దారణకు వచ్చింది. అత్యంత పాశవికంగా వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్యచేశాడని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కేసు విచారణ ‘చివరి దశ’లో ఉందని, త్వరలోనే అభియోగాలు నమోదుచేస్తామని తెలిపాయి. ఈ ఘోరమైన నేరం విషయంలో పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాజకీయ ప్రత్యర్థులు, ప్రజా …

Read More »

జగన్ లండన్ ప్రయాణం వాయిదా.. ఆ పాస్‌పోర్ట్ రద్దు చేయడంతో, ఏమైందంటే!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్ ప్రయాణం వాయిదా పడింది. ఆయనకు పాస్‌పోర్ట్ కష్టాలు ఎదురయ్యాయి.. మొన్నటి వరకు సీఎం హోదాలో ఉన్న డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్ ‌రద్దుయ్యింది.. దీంతో ఆయన జనరల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.. ఈ వ్యవహారంపై జగన్ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ జరిపి.. ఏడాదికి పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పుపై జగన్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఐదేళ్ల పాటూ …

Read More »

ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ.. పార్టీకి ఘంటా దంపతులు గుడ్ బై

ఏలూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి ఆళ్ల నాని, ఏలూరు కార్పొరేషన్ ఛైర్మన్, కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. వీరిలో ఏలూరు కార్పొరేషన్ ఛైర్మన్, కార్పొరేటర్లు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు పార్టీకి రాజీనామా చేశారు. …

Read More »

వినాయకచవితికి బ్యాంక్ హాలిడే ఉందా? తెలుగు రాష్ట్రాల్లో శనివారం బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?

సెప్టెంబర్ 7. నెలలో తొలి శనివారం. మరి బ్యాంకులకు సెలవు ఉంటుందా? ప్రతి నెలలో రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది కదా ఇలా అడుగుతున్నారేంటి అనుకుంటున్నారా? బ్యాంకులకు సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల్ని నిర్ధరిస్తుంటుంది. జాతీయ సెలవులు సహా ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు.. ఇతర ప్రాంతీయ పండగల సందర్భంగా ప్రాంతాల్ని బట్టి సెలవులు మారుతుంటాయి. జాతీయ సెలవులు మాత్రం.. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 26- గణతంత్ర దినోత్సవం, ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం, …

Read More »

ఏపీకి బంగాళాఖాతంలో మరో ముప్పు.. ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం.. ఆరెంజ్, ఎల్లో అలర్ట్!

ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు ముంచుకొస్తోంది.. ఉత్తరాంధ్రను, పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే రాజస్థాన్‌లోని జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 9వ వరకూ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఉత్తర వాయవ్యంగా …

Read More »

ఏపీలో ఆ చెట్లు డేంజర్ అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో నరికివేత.. హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో కోనో కార్పస్ చెట్ల నరికివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. కోనో కార్పస్‌ చెట్లతో శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపించారు. కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 645 చెట్లను కొట్టేసి.. వాటి స్థానంలో దేశీ మొక్కలు నాటుతున్నారని ధర్మాసనానికి తెలిపారు. కోనో కార్పస్‌ చెట్లపై శాస్త్రీయ పరిశోధన ఏదీ జరగలేదని.. రాష్ట్రంలో ఆ …

Read More »