భార్య వేధింపులకు తాళలేక ఇళ్లు వదిలి పారిపోయాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. భర్త కనిపించకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడు నొయిడాలో ఉన్నట్టు గుర్తించారు. నచ్చజెప్పి అతడ్ని బెంగళూరుకు తీసుకురాగా.. భార్య నన్ను చిత్రహింసలకు గురిచేస్తోందని వాపోయాడు. అంతేకాదు, జైలుకి వెళ్లమన్నా వెళ్తా కానీ ఆమెతో జీవితం పంచుకోలేనని తెగేసి చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర బెంగళూరులో భార్యతో కలిసి నివాసం ఉంటోన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ …
Read More »Blog Layout
రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. ఆ పైన లోన్ ఉన్న వారి పరిస్థితేంటి..?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధానమైంది రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని.. వరంగల్ డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆరు గ్యారంటీల్లోనూ ఇదే ప్రధానమైన హామీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది. మెుత్తం మూడు విడతల్లో ఈ హామీ అమలైంది. మూడో విడతలో భాగంగా రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రైతులకు మాఫీ …
Read More »జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల సందర్శించిన సభాపతి.. మొక్క నాటారు. శాసనసభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నామని.. జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు. జగన్ చేయి ఎత్తి అడిగితే మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు.. ప్రతిపక్ష హోదా విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు. అసెంబ్లీకి రాని …
Read More »RBI: 3 బ్యాంకులకు సడెన్ షాకిచ్చిన ఆర్బీఐ.. కఠిన నిర్ణయం.. ఆ నిబంధనలు పాటించకపోవడంతో..!
Bank of Maharashtra: దేశంలోని అన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనేది పెద్దన్న లాంటింది. ఇదే అన్ని నియంత్రణాధికారాలు కలిగి ఉంటుంది. ఆర్బీఐ ఆదేశాల్ని ఇవి తప్పక పాటించాల్సిందే. కస్టమర్ల పట్ల ఏ మాత్రం బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. తమకు తెలియకుండా ఏదైనా కొత్త నిబంధనలు తీసుకొచ్చినా ఆర్బీఐ ఊరుకోదు. కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దీనిని ఫైన్ రూపంలో లేదా మరీ సమస్య తీవ్రంగా ఉంటే ఏకంగా బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసేందుకూ …
Read More »అనకాపల్లి జిల్లాలో అరుదైన పురుగు.. ధర ఏకంగా రూ.75 లక్షలు?, ఎందుకంత డిమాండ్!
ప్రపంచంలో అత్యంత అరుదైన కీటకం అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. చీడికాడ మండలంలోని కోనాంలో ఔషధ గుణాలు కలిగిన స్టాగ్ బీటిల్ కనిపించింది. ఈ కీటకానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.. ఈ కీటకం ధర రూ.75 లక్షల వరకు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. కీటకానికి అంత ధర ఏంటి అని షాకవ్వకండి.. ప్రపంచంలోనే అత్యంత ఔషధ గుణాలు కలిగిన అరుదైన కీటకం స్టాగ్ బీటిల్ అని చెబుతుంటారు. ఈ కీటకం ఎవరికైనా దొరికితే అదృష్టవంతులే అని చెబుతుంటారు. బీఎండబ్ల్యూ, ఆడి కార్ల ధర కంటే …
Read More »HYD: ఘోర ప్రమాదం.. బస్సు కిందికి దూసుకుపోయిన ఆటో.. టెన్త్ అమ్మాయి మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హబ్సిగూడ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ స్కూల్ ఆటో.. అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో అతివేగంతో రావటం వల్ల.. బస్సు వెనకాల కిందకు దూసుకుని వెళ్లింది. ఈ ఘటనలో.. ఆటో డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న పదో తరగతి విద్యార్థిని బస్సు కింద ఉరుక్కుపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సహాయంతో ఆటోను బస్సు కింద నుంచి తొలగించారు. అమ్మాయితో పాటు ఆటో డ్రైవర్‌ను హుటాహుటిన …
Read More »Prabhas Kalki Ott Update : ఓటీటీలోకి ‘కల్కి’.. రికార్డులు బద్దలు కొట్టేందుకు రెబల్ ఫ్యాన్స్ రెడీ.. ట్విస్ట్ ఇదే
ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. కల్కి చిత్రం వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేయబోతోంది. ఈ మేరకు అమెజాన్ నుంచి అప్డేట్ వచ్చింది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన అద్భుతమైన ప్రపంచం ఇక ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కల్కి ఓటీటీ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రిపీట్ మోడ్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను చూస్తామంటూ సంబరపడిపోతోన్నారు. ఆగస్ట్ 22 నుంచి కల్కి చిత్రం ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుంది. తెలుగు, తమిళం, …
Read More »విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఆ యాప్‌లలో బిల్లులు కట్టొచ్చు.. కానీ..!
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. మునుపటిలాగే.. మొబైల్‌లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లులు కట్టేందుకు మార్గం సుగమమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ఫలితంగా.. జులై 1 నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపులు.. థర్డ్ పార్టీ యాప్‌లలో నిషేదించిన విషయం తెలిసిందే. అయితే.. విద్యుత్తు బిల్లుల చెల్లింపులను సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీసీపీడీసీఎల్‌లు భారత్ బిల్ పేమెంట్ సిస్టం(BBPS)లో చేరిపోయాయి. డిస్కంలు బీబీపీఎస్‌లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్‌టెక్ యాప్‌లు, …
Read More »పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌లో లుకలుకలు.. కోర్టుకెక్కిన రచ్చ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ లీగ్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాటిని సొంతం చేసుకునేందుకు ఎంతో మంది దిగ్గజ వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటారు. ఇటీవల బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిన నేపథ్యంలో ఫ్రాంఛైజీల కోసం పోటీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి లీగ్‌లో భాగమైన పంజాబ్ కింగ్స్ ప్రాంఛైజీలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ జట్టు యజమానుల మధ్య వాటాల విక్రయం విషయంలో వివాదం మొదలైనట్లు సమాచారం. పంజాబ్ …
Read More »చంద్రబాబు హామీ.. 24 గంటల్లోనే డ్రైవర్‌కు ఆటో అందజేత.. ఆసక్తికర సన్నివేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గురువారం గుడివాడ రామబ్రహ్మం పార్కులోని అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజినీకాంత్‌తో మాట్లాడారు. ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్య చదివిస్తున్నానని ఆయన సీఎంకు వివరించారు. రజినీకాంత్ కుమారుడు రవితేజ తాను ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తన చెల్లి బీడీఎస్ చదువుకు …
Read More »