rednews
July 27, 2024 తెలంగాణ
55
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే ప్రజలను మరో కొత్త వైరస్ భయపెడుతోంది. అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్.. ఇప్పుడు హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా.. కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వెల్లడించింది. ఈ నొరో వైరస్ విషయంలో ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. నొరో వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది. …
Read More »
rednews
July 27, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం, పాలిటిక్స్
63
కేంద్ర పౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయడు.. మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాతో కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు.. మోదీ మంత్రివర్గంలో అతి పిన్నవయస్కుడైన కేబినెట్ మంత్రిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే రామ్మోహన్ నాయుడు గురించి ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ …
Read More »
rednews
July 27, 2024 తెలంగాణ
52
ఉపాధ్యాయుడంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాలను బోధించటమే కాదు.. విద్యార్థులకు మంచి చెడుల వ్యత్యాసాన్ని నేర్పించి.. మంచి మార్గాన్ని చూపించటం కూడా. అవసరమైతే.. చేయి పట్టుకుని ఆ మార్గం వెంట నడిపించి గమ్యం చేరేలా చేయటం కూడా గురువు బాధ్యతే. అచ్చంగా అదే పని చేశాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులను తమతమ జీవితాల్లో గమ్యాలను చేర్పించటం ప్రస్తుత కాలంతో కొంచెం కష్టమైన విషయమే కానీ.. అడ్డుగా నిలిచిన వరద ప్రవాహాన్ని సురక్షితంగా దాటించి గమ్యస్థానాలకు చేర్చి.. మా మంచి మాస్టారు అనిపించుకున్నాడు. కుమురం భీం …
Read More »
rednews
July 27, 2024 క్రైమ్, జాతీయం
49
Amarnath Yatra: దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌కు భక్తులు పోటెత్తుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని మంచుకొండల్లో కొలువైన ఈ క్షేత్రానికి చేరుకునేందుకు.. యాత్రికులు దేశం నలుమూల నుంచి ఎన్నో అవస్థలు పడి వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. ఈ అమర్‌నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ.. ఖలిస్థాన్ ఉగ్రవాద గ్రూపులు కుట్ర చేసినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం వచ్చింది. …
Read More »
rednews
July 27, 2024 ఇతర క్రీడలు, క్రీడలు
61
పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అధికారికంగా తెరలేచింది. ఒలింపిక్ చరిత్రలో తొలిసారి నదిలో జరిగిన ఈ సంబురాలు.. చూపరులను ఆకట్టుకున్నాయి. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్ని తాకాయి. చారిత్రక సీన్ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో నిర్వహించింది. గతంలో ఎప్పుడైనా ప్రారంభ వేడుకలు స్టేడియంలో జరిగేవి.. కానీ పాత పద్దతికి స్వస్తి పలుకుతూ సెన్ నదిపై వేడుకలను ఘనంగా నిర్వహించింది ఫ్రాన్స్. విశ్వక్రీడల …
Read More »
rednews
July 27, 2024 ఆంధ్రప్రదేశ్
69
ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజులు ముందుగానే నిధుల విడుదలపై ఫోకస్ పెట్టింది. గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించగా.. ఈసారి కూడా వారే ఆగస్టు ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంగా తెలియజేశారు. అస్వస్థతతో ఉన్న వారు, ఇంకా పంపిణీ మిగిలితే 2న ఇస్తారు. ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు …
Read More »
rednews
July 27, 2024 Business, జాతీయం, బిజినెస్
68
పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. బడ్జెట్ తర్వాతి రోజు నుంచే బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. ఈ వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.5 వేలకుపైగా దిగిరావడం గమనార్హం. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ తర్వాతి రోజు నుంచి సైతం …
Read More »
rednews
July 27, 2024 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
68
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. తిరుమలలో శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టికెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలన్నారు. ఇందుకోసం గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దాతల విభాగం ప్రక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ …
Read More »
rednews
July 27, 2024 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
49
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు ఈవో జే శ్యామలరావు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగంవారు అన్నప్రసాదం సిబ్బందికి, పెద్ద, జనతా క్యాంటీన్‌ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి హోటల్ లో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. తిరుమల …
Read More »
rednews
July 27, 2024 జాతీయం
81
భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది వణికిపోతోంది. ఢిల్లీ, హిమాచల్, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఉత్తరాదిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో ఎడతెరిపి లేని వానలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబైను భారీ వర్షాలు ముంచెత్తడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పుణెలో విద్యుత్‌షాక్‌తో నలుగురు మృతి చెందారు. ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం …
Read More »