rednews
September 14, 2024 తెలంగాణ
46
వర్షాకాలం రావటంతో.. రైతులంతా ప్రభుత్వంవైపు ఆశగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నగదు సాయం ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 13న) జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లో మాట్లాడిన మంత్రి తుమ్మల.. రైతు భరోసా డబ్బులు విడుదలపై కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా డబ్బులు.. ఈసారి పంట వేసి సాగు చేస్తున్న వారికే ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు. కొండలు, గుట్టలకు ఎట్టి పరిస్థితిలో ఇవ్వబోమని క్లారిటీ …
Read More »
rednews
September 14, 2024 ఆంధ్రప్రదేశ్
44
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తానికి రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును సీఆర్డీఏ చెల్లించబోతోంది. అమరావతి రైతులకు కౌలు నిమిత్తం ప్రభుత్వం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించింది. ఆ నిధుల్ని సీఆర్డీఏకు విడుదల చేస్తూ పాలనాపరమైన అనుమతులు కూడా జారీ చేశారు. అంతేకాదు అమరావతిలో ప్రస్తుత హైకోర్టు భవనం ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు సంబంధించి రూ.13.33 కోట్లను సీఆర్డీఏ విడుదల చేసింది. మరోవైపు అమరావతిలో హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ …
Read More »
rednews
September 14, 2024 ఆంధ్రప్రదేశ్
43
ఏపీలోని మరో రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఆగనుంది. ఈ మేరకు వందేభారత్ హాల్ట్‌కు రైల్వే సహాయ మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి దుర్గ్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలు పట్టాలెక్కబోతోంది. అయితే పార్వతీపురంలో స్టాప్ లేకుండానే రైల్వే అధికారులు ఈ వందేభారత్ రైలు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే ఈ రైలుకు పార్వతీపురం, టౌన్ రైల్వే స్టేషన్‌ల్లో నిలుపలేదు. వెంటనే స్పందించిన పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర విశాఖపట్నంలోని డీఆర్‌ఎంతో పాటుగా అధికారులను …
Read More »
rednews
September 13, 2024 జాతీయం
51
కొందరికి కుర్చీపైనే ఆశ.. బెంగాల్ సీఎం మమత వ్యాఖ్యలు మెడికోల ఆందోళన వెనక రాజకీయాలు ఉన్నాయని విమర్శ కోల్‌కతా, సెప్టెంబరు 12: స్థానిక ఆర్‌జీ కర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు గురువారం కూడా తమ వైఖరిని సడలించుకోలేదు. చర్చలకు రావాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానించినప్పటికీ వారు సానుకూలంగా స్పందించలేదు. వరుసగా మూడో రోజు కూడా ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య చర్చలు జరగలేదు. దీనిపై మమత స్పందిస్తూ ”సామాన్యులకు న్యాయం చేయడం కోసం పదవిని వదులుకోవడానికి …
Read More »
rednews
September 13, 2024 ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం
50
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకుని మహిళా కానిస్టేబుల్‌ను చిక్కుల్లో పడ్డారు. గుంటూరులో జిల్లా జైలు దగ్గర బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌తో సెల్ఫీ తీసుకున్నారు.. జైలులో మహిళా కానిస్టేబుల్ ఆయేషాబానుకు ఛార్జి మెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్‌రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు.. అనంతరం జైలు బయట వచ్చిన …
Read More »
rednews
September 13, 2024 రాశిఫలాలు
56
దిన ఫలాలు (సెప్టెంబర్ 13, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఆశించిన స్థాయి ప్రోత్సాహకాలు అందుతాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. …
Read More »
rednews
September 11, 2024 అమరావతి, ఆంధ్రప్రదేశ్
59
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఇన్ పర్సన్‌గా కోర్టులో పిటిషనర్ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ హోదా హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని.. ఏపీ ఆర్థికంగా పునరుజ్జీవం పొందేందుకు కేంద్రం నుంచి …
Read More »
rednews
September 11, 2024 ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి
49
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే హైవేపై.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ బోల్తాపడటంతో ఏడుగురు చనిపోయారు.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో మినీలారీ బయల్దేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల సమీపంలో.. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో మినీ లారీ అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది. ఈ ప్రమాదంలో.. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన …
Read More »
rednews
September 11, 2024 అమరావతి, ఆంధ్రప్రదేశ్
57
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల పేషీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల పేషీల్లోకి కొత్తగా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్‌లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీ) ప్రకటన విడుదల చేసింది. 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లను, 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్‌లను నియమించబోతున్నట్లు తెలిపారు. వీరిని అవుట్‌సోర్సింగ్/తాత్కాలిక విధానంలో మంత్రులు పేషీల్లోకి తీసుకుంటారు. ప్రభుత్వం సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌కి విద్యార్హతను బీఈ/బీటెక్‌గా నిర్ణయించింది.. వీరికి నెలకు రూ.50 వేల జీతం ఇస్తారు. …
Read More »
rednews
September 11, 2024 ఆంధ్రప్రదేశ్, కృష్ణా
57
ఏపీని వర్షాలు, వరదలు వణికించాయి.. విజయవాడతో పాటూ మరికొన్ని జిల్లాలపై ప్రభావం కనిపించింది. ప్రధానంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి.. ఇళ్లన్నీ నీటమునిగాయి. ఇలా వర్షాలు, వరదలతో నష్టపోయిన విజయవాడ ప్రజలకు ఊరటనిచ్చే దిశగా ఏపీప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఈ ప్యాకేజీని అందజేసే దిశగా అడుగులు వేస్తోంది. విజయవాడలో బాగా నీట మునిగిన ఇళ్లకు రూ. 25 వేలు.. అలాగే …
Read More »