rednews
September 2, 2024 ఆంధ్రప్రదేశ్, కృష్ణా
41
భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో మొత్తం నీటమునిగి అస్తవ్యస్తం అయ్యాయి. ఇక ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న జనం.. తిండి, తాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి.. వరద బాధితులకు సహాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫార్మా కంపెనీ అయిన దివీస్ ల్యాబ్స్ కూడా రంగంలోకి దిగింది. భారీ వరదలతో అతలాకుతలం అయిన బెజవాడ నగరానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే విజయవాడ …
Read More »
rednews
September 2, 2024 ఆంధ్రప్రదేశ్, కృష్ణా
60
రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలను వణికిస్తున్నాయి. గత 2, 3 రోజుల నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షానికి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక జలాశయాలు, ప్రాజెక్టులు నిండిపోవడంతో.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రళయాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనిషి మునిగే లోతులో వరదనీరు చేరింది. సహాయం కోసం వరద బాధితులు.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అమావాస్య కావడంతో.. …
Read More »
rednews
September 2, 2024 ఆంధ్రప్రదేశ్, కృష్ణా
37
ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరదలు పోటెత్తడంతో ఎక్కడి జనం అక్కడే చిక్కుకుపోయారు. ఇక ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో.. సామాన్లు మొత్తం నీళ్లలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే జనం అంతా ఇళ్లపైకి ఎక్కి.. ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేయడమే కాకుండా ఆహారం, తాగునీరు సరఫరా చేస్తోంది. అయితే హెలికాప్టర్లు అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఉండకపోవడంతో టెక్నాలజీని వాడాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే డ్రోన్ల ద్వారా …
Read More »
rednews
September 2, 2024 ఆంధ్రప్రదేశ్
50
ఏపీని వర్షాలు ముంచెత్తాయి.. వాయుగుండం ప్రభావంతో మూడు రోజుల వర్షానికే జనజీవనం స్తంభించింది. వర్షాలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్న సమయంలో వాతావరణశాఖ మరో బాంబ్ పేల్చింది. ఈ నెల 6 ,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. అది తుఫాన్‌గా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పక్కాగా క్లారిటీ వస్తుంది అంటున్నారు. వాయుగుండం నుంచి తేరుకోక ముందే మళ్లీ తుఫాన్ టెన్షన్ మొదలైంది. తెలుగు రాష్ట్రాలు అతి భారీ …
Read More »
rednews
September 2, 2024 Business, బిజినెస్
64
టాటా గ్రూప్‌లోని మెటల్ దిగ్గజ సంస్థ టాటా స్టీల్ (TATA Steel) స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. అయితే ఈ స్టాక్ గత ఆగస్టు నెలలో ఇన్వెస్టర్లను నిరాశపరిచిందని చెప్పవచ్చు. 3 శాతం మేర క్షీణించింది. అయితే కంపెనీ సెప్టెంబర్ 1, 2024 రోజున చేసిన ఓ ప్రకటనతో ఫోకస్‌లోకి వచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు టాటా స్టీల్ స్టాక్ కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. …
Read More »
rednews
September 2, 2024 అంతర్జాతీయం
71
వీసా గడువు ముగిసినా తమ భూభాగంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో అవకాశం కల్పించింది. వీసా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు లేదా ఎటువంటి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే యూఏఈలోని భారతీయులకు సాయం చేసేందుకు స్థానిక భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం సెప్టెంబరు 1న మొదలై అక్టోబరు 30 వరకు అమలులో ఉంటుంది. పర్యాటకులు, వీసా గడువు ముగిసిన వారు …
Read More »
rednews
September 2, 2024 ఆంధ్రప్రదేశ్, కృష్ణా, విశాఖపట్నం
54
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన గమనిక.. భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ డివిజన్‌లో రైల్వే ట్రాక్స్ దెబ్బ తిన్నాయి. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ డివిజన్లో రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్స్ పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేశారు. తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొన్ని …
Read More »
rednews
September 2, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం, తెలంగాణ
59
తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. ఈ వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటాక శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో 10 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం భూభాగంలోకి వచ్చాక వేగం 20 కిలోమీటర్లకు పెరిగింది. ప్రసుత్తం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ (మహారాష్ట్ర) వైపు కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రుతుపవన ద్రోణి వాయుగుండం కేంద్రం …
Read More »
rednews
September 2, 2024 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
35
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమత్తు పనులు పూర్తయ్యాయి. కొత్త హంగులతో స్వామి పుష్కరిణిని సిద్ధం చేయగా.. ఆదివారం నుంచి శ్రీవారి భక్తులను టీటీడీ అనుమతించారు. కాగా ఈ మరమత్తు పనులు టీటీడీ ఆగష్టు 1వ తేదీన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్ విబాగంవారు దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి …
Read More »
rednews
September 2, 2024 ఆంధ్రప్రదేశ్, కృష్ణా
40
విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.భారీ వర్షాలు, వరదల కారణంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే చిల్లకల్లు, నందిగామ దగ్గర జాతీయ రహదారి మీదకు నీళ్లు వచ్చాయి. పాలేరు నది పొంగడం, సూర్యాపేట తర్వాత రామాపురం క్రాస్‌రోడ్డు బ్రిడ్జి కూలడంతో.. ప్రజల భద్రతా కారణాల రీత్యా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా వెళ్లాల్సి …
Read More »