rednews
August 31, 2024 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
46
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎవ్వరినీ లెక్క చేయకుండా బుల్డోజర్లు పంపిస్తున్నారు. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక ఇప్పటికే కొందరు అక్రమ నిర్మాణదారులకు హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. మాదాపూర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు నిర్మించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. ఇక …
Read More »
rednews
August 31, 2024 Business, టెక్నాలజీ, బిజినెస్
55
Cloud Storage Pricing: ఇటీవల జరిగిన రిలయన్స్ ఏజీఎం (యాన్యువల్ జనరల్ మీట్) లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. దీపావళి నుంచి 100 GB వరకు క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందించనున్నట్లు.. ఇది వెల్‌కం ఆఫర్ కింద వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ విభాగంలో ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి గూగుల్, యాపిల్ సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని పేర్కొన్నారు విశ్లేషకులు. జియో ఎంట్రీతో.. ఇక క్లౌడ్ స్టోరేజీ …
Read More »
rednews
August 31, 2024 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాలిటిక్స్
39
ప్రస్తుతం హైడ్రా (HYDRA) అనేది.. టాక్ ఆఫ్ ది సిటీగానే కాకుండా.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేవలం తెలంగాణ వరకే కాకుండా.. పక్క రాష్ట్రాల్లోనూ హైడ్రా గురించి చర్చ నడుస్తోందంటే.. బుల్డోజర్ల ప్రభావం గట్టిగానే పడిందని అర్థమవుతోంది. అందుకు కారణం.. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ భూములు కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా.. సామాన్యులా, సెలెబ్రిటీలా, రాజకీయ ప్రముఖులా అనేది చూడకుండా.. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా.. అక్రమకట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తుండటమే. ముఖ్యంగా.. టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ …
Read More »
rednews
August 31, 2024 తెలంగాణ
56
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఎండీ అధికారులు హైదరాబాద్‌కు భారీ వర్షం హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావారణ కేంద్రం అధికారులు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం …
Read More »
rednews
August 31, 2024 క్రికెట్, క్రీడలు
63
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆతిథ్య పాకిస్థాన్ ఏర్పాట్లు చకచకా చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన స్టేడియాల్లో మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించింది. అయితే భారత్ మాత్రం పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనే విషయంపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. కొందరేమో.. ఇరు దేశాల మధ్య ఘర్షణలను పక్కకు పెట్టి ఆటకోసమైనా భారత్.. పాక్‌కు వెళ్లాల్సిందే అని పట్టుబడుతున్నారు. పలువురు పాకిస్థాన్ మాజీలు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ల కోసం పాకిస్థాన్ అభిమానులు ఎదురుచూస్తున్నారని.. చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ …
Read More »
rednews
August 31, 2024 జాతీయం
46
గుజరాత్‌కు తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌గా మారింది. కచ్ తీరం, పాకిస్థాన్ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఈ తుఫాన్‌కు అస్నాగా పేరు పెట్టగా.. ఈ పేరును పాకిస్థాన్ సూచించింది. అరేబియా సముద్రంలో 1976 తర్వాత ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుఫాన్ అని చెబుతున్నారు. కచ్ తీరం మీదుగా ఆవరించిన అస్నా తుఫాన్ అరేబియా సముద్రంలోకి ఒమన్ దిశగా కదిలింది. ఆగస్టులో తుఫాన్‌లు రావడం చాలా అరుదు అని చెబుతున్నారు.. అయితే సముద్రాలు వేడెక్కడంతో తుఫాన్ ఏర్పడింది …
Read More »
rednews
August 31, 2024 జాతీయం
41
ఆర్మీ చాపర్ నుంచి హెలికాప్టర్ జారి పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో దెబ్బతిన్న హెలికాప్టర్‌ను అక్కడి నుంచి మరో చోటుకు తరలించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఆ దెబ్బతిన్న హెలికాప్టర్‌ను ఆర్మీ చాపర్‌కు తీగల సహాయంతో కట్టి తీసుకువస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ చాపర్‌కు కట్టిన తీగలు ఒక్కసారిగా తెగిపోవడంతో కింద ఉన్న హెలికాప్టర్ పట్టుకోల్పోయి.. పడిపోయింది. ఆ హెలికాప్టర్ కొండల్లో పడిపోతున్న దృశ్యాలను దూరంగా …
Read More »
rednews
August 31, 2024 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
55
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 నెలల్లో ఏకంగా 60 లక్షల మొక్కలు నాటామంటూ చెబుతున్న అటవీశాఖ సిబ్బందికి సవాల్ చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్‌లో నిర్వహించిన వనమహోత్సవ సభలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. గత 5 నెలల్లో ఇంత భారీ మొత్తంలో మొక్కలు నాటారని నిరూపిస్తూ రాజీనామా చేస్తాను అన్నారు. సోషల్ ఆడిట్లో 60 లక్షల మొక్కలు నాటినట్లు నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. అలాగే అయ్యన్నపాత్రుడు అటవీ …
Read More »
rednews
August 31, 2024 రాశిఫలాలు
55
దిన ఫలాలు (ఆగస్టు 31, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులకు ఆస్కారముంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగి పోతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా, సంతృప్తికరంగా ఉంటుంది. మిథున రాశి వారికి అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కొందరు బంధువులతో రాజీమార్గంలో వివాదాలను పరిష్కరించుకుంటారు. పెళ్లి ప్రయత్నాల …
Read More »
rednews
August 31, 2024 ఆంధ్రప్రదేశ్
56
ఆంధ్రప్రదేశ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఊపందుకున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపిస్తోంది. రెండు రోజులుగా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది.. ఆదివారం తెల్లవారుజాముకు వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. …
Read More »