rednews
August 15, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం
52
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసుల విచారణలో కీలక పరిణామం జరిగింది. జగన్ ఆస్తుల కేసులో ప్రమేయం ఉన్న భారతి సిమెంట్ కార్పొరేషన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలుచేసిన కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్‌కుమార్ తప్పుకొన్నారు. గతంలో తెలంగాణ హైకోర్టు జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్థతినే అనుసరించాలని తెలిపింది. …
Read More »
rednews
August 15, 2024 Business, బిజినెస్
56
OYO Revenue: ఐపీఓకు సిద్ధమవుతున్న ప్రముఖ స్టార్టప్ సంస్థ ఓయో.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 229 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది. ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా సంస్థకు లాభం రావడం ఇదే తొలిసారి. ఈ మేరకు తాజాగా కంపెనీ యాన్యువల్ రిపోర్టులో వెల్లడించింది. అయితే ఈసారి తాము రూ. 100 కోట్ల లాభం అంచనా వేయగా.. దాన్ని మించినట్లు వివరించారు ఓయో ఫౌండర్ రితేశ్ అగర్వాల్. ఇక సర్దుబాటు చేశాక.. ఎబిటా 215 శాతం పెరిగి సుమారుగా రూ. 877 …
Read More »
rednews
August 15, 2024 అమరావతి, ఆంధ్రప్రదేశ్
52
పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పెద్దిరెడ్డితో పాటు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన చల్లా రామచంద్రారెడ్డి, ఇతర పార్టీల అభ్యర్థులు, ఆర్‌వో, జిల్లా ఎన్నికల అధికారికి నోటీసులు జారీచేసింది. పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కేసుపై అవగాహన కోసం నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది.
Read More »
rednews
August 15, 2024 Uncategorized
39
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే లక్ష్యంతో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ‘వికసిత్ భారత్’థీమ్‌తో నిర్వహిస్తున్నారు. అప్పటికి భారతావనికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుంది. అందుకే ఆ సమయానికి భారత్‌ను సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం ఈ థీమ్ని ఎంపికి చేసింది. ఈ ఏడాది వేడుకలకు 6 వేల మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతోపాటు లఖ్‌పతీ దీదీ, డ్రోన్ దీదీ వంటి పథకాల లబ్ధిదారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు …
Read More »
rednews
August 14, 2024 అంతర్జాతీయం, అమరావతి
62
పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌరులకు అందించే సేవలను అన్నింటిని కలిపి ఒక యాప్ రూపంలో తీసుకువచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పౌరులకు అవసరమైన వివిధ రకాల సేవలను అందించేందుకు యాప్ రూపకల్పన చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే టాటా సంస్థ ఈ విషయంలో ప్రత్యేక యాప్ రూపొందించిన విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు.. ఈ యాప్ కొంతవరకూ మెరుగైన …
Read More »
rednews
August 14, 2024 జాతీయం
55
భారత్ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న ఈ శుభ తరుణంలో.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ కీలక సందేశం ఇచ్చారు. యువతకు, ప్రతి పౌరుడికి స్ఫూర్తినిచ్చే సూచనలు చేశారు. దేశానికి ఇప్పుడు ‘ఆధ్యాత్మిక విప్లవం’ కావాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక విప్లవం అంటే ఏమిటో, ఒత్తిడిని, అవరోధాలను జయించి ఎలా ముందుకు కదలాలో వివరించారు. శ్రీశ్రీ రవిశంకర్ సందేశం పూర్తి పాఠం ఆయన మాటల్లో.. ‘మన దేశం సౌందర్యం దాని వైవిధ్యంలోనే ఉంది. భారత ఉపఖండం విభిన్న …
Read More »
rednews
August 14, 2024 అమరావతి, ఆంధ్రప్రదేశ్
55
Nara Bhuvaneswari Donation for Anna canteens: పంద్రాగస్టును పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి అన్న క్యాంటీన్లు తెరుచుకోనున్నాయి. వంద అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్ట్ 16న మిగతా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు ప్రారంభించనున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ …
Read More »
rednews
August 14, 2024 జాతీయం
54
78వ స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. ఈ వేడుకలకు దేశం నలుమూల నుంచి ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వివిధ రంగాల్లో ప్రత్యేక సేవలు అందించటం ద్వారా గుర్తింపు పొందిన సామాన్యులను.. అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించటం ఆనవాయితీ. అయితే.. ఆ ప్రత్యేక అతిథుల జాబితాలో తెలంగాణకు చెందినవాళ్లు కూడా ఉండటం విశేషం. అతిథుల జాబితాలో రైతు ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు.. అంగన్‌వాడీ కార్యకర్తలు.. ఆశా కార్యకర్తలు.. విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. సామాజిక కార్యకర్తలు.. ఇలా చాలామందే ఉన్నారు. దేశ …
Read More »
rednews
August 14, 2024 అంతర్జాతీయం, ఇతర క్రీడలు, క్రీడలు
53
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఫైనల్ బౌట్‌కు ముందు అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వినేష్ ఫొగాట్ చేసిన అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) తిరస్కరించింది. దీంతో తాను పాల్గొన్న మూడో ఒలింపిక్స్‌లోనూ వినేష్ ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరిగినట్లయింది. దీంతో భారత్ ఏడో పతకం సాధిస్తుందని ఉన్న ఆశలు ఆడియాశలయ్యాయి. ఆరు పతకాలతోనే భారత్ పారిస్ …
Read More »
rednews
August 14, 2024 క్రైమ్, జాతీయం
40
ఉత్తర్ ప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్యలో భారీ చోరీ చోటుచేసుకుంది. రామమందిర సమీపంలోని భక్తిపథ్, రామ్ పథ్‌లో ఏర్పాటుచేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రొజెక్టర్ లైట్స్‌తో పాటు వేలాది వెదురు బొంగులు చోరీకి గురయినట్టు తెలిపిన పోలీసులు.. వీటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అత్యంత భద్రత ఉండే అయోధ్యలోనే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. దాదాపు 4 వేల లైట్స్‌ని దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. ఈ ఘటనపై రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఆగస్టు 9వ తేదీన కేసు …
Read More »