ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.. ఆగస్టు 7న సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ …
Read More »TimeLine Layout
July, 2024
-
31 July
జీవిత, ప్రమాద బీమాపై జీఎస్టీ ఎత్తేయండి… నిర్మలా సీతారామన్‌కు గడ్కరీ రిక్వెస్ట్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌పై అనేక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై విధించిన జీఎస్టీని ఉప-సంహరించుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆర్థిక మంత్రికి ఈ లేఖ రాస్తున్నట్లు గడ్కరీ …
Read More » -
31 July
జియో భారత్ జే1 4G ఫోన్ కేవలం రూ.1799 మాత్రమే..
Jio Bharat J1 4G Phone : దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ జియో భారత్ జే1 4జీ (Jio Bharat J1 4G) ఫోన్ ఆవిష్కరించింది. ఇది 4G కనెక్టివిటీతో దేశీయ మార్కెట్లో ప్రవేశ పెట్టిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్. జియో స్పెషల్ జియో భారత్ ప్లాన్‌కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ అందిస్తోంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ప్రీ- ఇన్‌స్లాల్ చేసింది. రేర్ …
Read More » -
31 July
161కి చేరిన వాయనాడ్ మృతులు.. వారికోసం రంగంలోకి ఆర్మీ జాగిలాలు
ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ వయనాడ్‌లోని మెప్పడిలో నాలుగు గ్రామాలపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకూ 161 మంది చనిపోయారు. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు. ఈ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా రాష్ట్ర యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద, బురద ప్రవాహంలో కొందరు కొట్టుకుపోగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో …
Read More » -
31 July
ఐటీఆర్ గడువు పొడిగింపుపై.. ఐటీ శాఖ కీలక ప్రకటన..
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఇవాళ్టితో గడువు పూర్తవుతుంది. తమ అకౌంట్ ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులందరూ జులై 31, 2024లోపు రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. జులై 30వ తేదీ వరకు 6 కోట్లకుపైగా ట్యాక్స్ పేయర్లు తమ రిటర్నులు ఫైల్ చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ ఇంకా చాలా మంది తమ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అయితే, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తడం ద్వారా రిటర్న్స్ దాఖలు చేయలేకపోతున్నట్లు గత కొన్ని రోజులుగా ట్యాక్స్ …
Read More » -
31 July
ఏపీలో మరోసారి ఎన్నికలు.. ఆగస్టు 30న పోలింగ్, మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్‌సీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ గెలిచారు. అయితే ఆయన జనసేన పార్టీలో చేరగా.. అనంతరం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది.. …
Read More » -
31 July
కేంద్రం నుంచి ఏపీకి తీపికబురు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట మంజూరు చేసిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలాఖరుకే పూర్తికాగా.. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. మరో 6.50 కోట్ల పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం …
Read More » -
31 July
ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై చర్చకు వచ్చింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని.. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు ఆ దిశగా కసరత్తు …
Read More » -
31 July
ఆ రాశి వారు వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 31, 2024): మేష రాశి వారు ఈ రోజు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతి …
Read More » -
30 July
పెన్షన్ల విషయంలో మోదీ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రూ.2 లక్షలు ఫైన్
Supreme Court: కేంద్ర ప్రభుత్వం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయడంలో చేస్తున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన సైనిక అధికారులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం ప్రకారం.. పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా మండిపడింది. ఈ వన్ ర్యాంక్ వన్ పెన్షన్లపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది. ఈ వ్యవహారంలో నరేంద్ర మోదీ సర్కార్‌కు చివరి అవకాశం ఇస్తున్నట్లు …
Read More »