VVIP Infratech IPO Listing Price: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారు ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే.. దీర్ఘకాలంలో మంచి లాభాల్ని అందుకోవచ్చు. మార్కెట్లు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు నష్టపోతాయో ముందే ఊహించడం కాస్త కష్టమే. అయితే.. మార్కెట్ లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా కొన్ని షేర్లు అదరగొడుతుంటాయి. వీటిల్లో ముఖ్యంగా ఐపీఓ ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. చాలా వరకు ఐపీఓలు అద్భుత ప్రీమియంతో స్టాక్ మార్కెట్లలో లిస్టవుతుంటాయి. ఇప్పుడు ఇలాగే ఒక ఐపీఓ ఎంట్రీ …
Read More »TimeLine Layout
July, 2024
-
30 July
ప్రతిపక్ష నేత హోదా కోరుతూ వైఎస్ జగన్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏజీ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ విన్నవించారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్ జగన్ తరఫున లాయర్ తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని.. …
Read More » -
30 July
ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్‌న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు.. నేటి నుంచే అమలులోకి!
FD Rates: దేశంలోని టాప్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించినట్లు తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. కొత్త వడ్డీ రేట్లను జులై 30వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ప్రత్యేక టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు పై జనరల్ కస్టమర్లతో పాటు సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. వడ్డీ రేట్ల సవరణ తర్వాత గరిష్ఠంగా 7.75 శాతం మేర వడ్డీ అందిస్తోంది. మరి ప్రస్తుతం ఈ బ్యాంకులో లేటెస్ట్ …
Read More » -
30 July
మను భాకర్ ఖాతాలో మరో పతకం..
పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ మరోసారి మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. సరబ్జోత్ సింగ్‌తో కలిసి బరిలోకి దిగిన భాకర్.. వరుసగా రెండో ఈవెంట్‌లోనూ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కాగా.. ఈ రెండూ మను భాకర్ సాధించినవే కావడం విశేషం. సోమవారం జరిగిన …
Read More » -
30 July
జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ విజయమ్మల భేటీలో మరో ట్విస్ట్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి లోటస్‌పాండ్‌లోని వైఎస్ విజయమ్మ ఇంటికి వెళ్లి కలిసినట్లు ప్రచారం జరిగింది. విజయమ్మ యోగ క్షేమాల గురించి అడిగి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై జేసీ ఆరా తీసినట్లు వార్తలొచ్చాయి. అయితే జేసీ విజయమ్మ ఇంటికి వెళ్లడం ఇక్కడ హాట్ టాపిక్ అయ్యింది. జేసీ పనిగట్టుకుని మరీ వెళ్లి …
Read More » -
30 July
హైదరాబాద్‌లో పంజా విసురుతున్న డెంగీ..
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అయితే డెంగీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, నిలోఫర్‌లోని చిన్న పిల్లల విభాగానికి డెంగీ జ్వరంతో వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారం రోజుల క్రితం మూసాపేటలో ఓ 10 ఏళ్ల ఓ చిన్నారి డెంగీతో ప్రాణాలు కోల్పోయింది. సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. అలా నిర్లక్ష్యం …
Read More » -
30 July
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. KCR రికార్డ్ బ్రేక్ చేసిన సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సోమవారం (జులై 29) ఐదో రోజు అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో దద్దరిల్లింది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా.. అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్ పద్దుపై చర్చించారు. 19 శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3:15 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. సాయంత్రం 4.40 నుంచి 5. 50 వరకు టీ …
Read More » -
30 July
కేరళ ప్రకృతి విలయంలో 43 మంది సమాధి..
మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి బీభత్సం ఇప్పటివరకు 43 మందిని పొట్టనబెట్టుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల మంది ప్రజలు.. శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. …
Read More » -
30 July
జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్
జార్ఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్‌పూర్ దగ్గర హౌరా-సీఎస్‌ఎంటీ (ముంబై) ఎక్స్‌ప్రెస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికుకలకు తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు బీహార్‌లో కూడా సోమవారం రైలు ప్రమాదం జరిగింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సమస్తిపూర్ దగ్గర ఇంజిన్, రెండు బోగీల …
Read More » -
30 July
అన్నవరం ఆలయానికి భక్తుడి ఖరీదైన కానుక.. అమ్మవారికి వజ్ర కిరీటం, ఏకంగా రూ.కోట్ల విలువ
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి ఓ భక్తుడు భారీ కానుకను అందజేశారు. సత్యనారాయణస్వామివారి దేవేరి అనంతలక్ష్మి అమ్మవారికి వజ్ర కిరీటాన్ని అందజేశారు. పెద్దాపురం శ్రీలలితా ఎంటర్‌ప్రైజెస్ ఇండస్ట్రీస్ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు దాదాపు రూ.కోటిన్నరతో (కిలో బంగారం, 130 క్యారెట్ల వజ్రాలతో) ఈ కిరీటాన్ని అమ్మవారికి తయారు చేయించారు. అలాగే స్వామి, అమ్మవార్లకు వజ్రాలు పొదిగిన బంగారు కర్ణాభరణాలను కూడా తయారు చేయించి అందజేశారు. ఆగస్టు 6న సత్యదేవుడి జన్మనక్షత్రం మఖ పర్వదినం రోజున అమ్మవారికి ఈ కిరీటాన్ని అలంకరిస్తారు. …
Read More »