TimeLine Layout

October, 2024

  • 17 October

    ఏపీలో మందుబాబులకు శుభవార్త.. లిక్కర్ ధరలపై భారీ ఊరట, పండగ చేస్కోండి

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు మొదలయ్యాయి.. బుధవారం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొత్త షాపుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా షాపుల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి వచ్చింది. మందుబాబులో బ్రాండెడ్ లిక్కర్ కొనుగోలు చేయడం కనిపించింది. బుధవారం ఉదయం నుంచే మందుబాబులు కొత్త షాపుల దగ్గర బారులు తీరారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వ షాపుల్లోని పాత సరుకును అధికారులు లెక్క చూసి డిపోలకు పంపించారు. బుధవారం ఉదయం నుంచి కొత్త స్టాక్‌ను ప్రైవేటు షాపులకు తరలించారు. అన్ని షాపులకు …

    Read More »
  • 17 October

    వరదలతో చెన్నై అతలాకుతలం.. ‘హైడ్రా’పై చర్చ

    చెన్నై నగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తమిళనాడు రాజధానితో పాటు దాని పరిసర జిల్లాల్లో రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరదలు పెద్ద ఎత్తున పోటెత్తడంతో నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. 300 ప్రాంతాలు నీట మునిగాయి. సబ్‌వేలల్లో 3 అడుగుల మేర నీరు చేరింది. కొంత మంది నడుము లోతు నీళ్లలో వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై వరదలు తమిళనాడు వాళ్లకే …

    Read More »
  • 17 October

    ఏపీలో కొత్త పింఛన్‌ల కోసం దరఖాస్తు చేసుకోండి.. ఆ నెల నుంచే డబ్బులు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. జనవరిలో కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది.. జనవరిలో జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లతో పింఛన్లు పొందినట్లు విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా దివ్యాంగుల కేటగిరీలో కొన్ని వేల మంది …

    Read More »
  • 16 October

    Jammu Kashmir: 20 సార్లు చావు నుంచి బయటపడి.. జమ్మూ కాశ్మీర్‌లో ఏకైక మహిళా మంత్రిగా సకీనా ఈటూ

    Jammu Kashmir: ఎట్టకేలకు జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం సాధించగా.. తాజాగా ముఖ్యమంత్రిగా ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం సహా నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరిలో ఏకైక మహిళా మంత్రిగా సకీనా ఈటూ ప్రమాణం చేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన సకీనా ఈటూ.. తండ్రి, సోదరుడు కూడా రాజకీయాల్లో ఉండేవారు. ఆమె …

    Read More »
  • 16 October

    ఐఏఎస్‌లకు హైకోర్టులో చుక్కెదురు.. ఏపీలో రిపోర్టు చేయాల్సిందే, రిలీవ్ చేయనున్న తెలంగాణ

    కేంద్రం ఇటీవల బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఏడుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి కాటా, వాణీప్రసాద్, హరి కిరణ్, శివశంకర్, సృజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం …

    Read More »
  • 16 October

    శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ దారి మూసేసిన టీటీడీ

    తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల, తిరుపతికి భారీ వర్ష సూచన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గురువారం శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో టీటీడీ ఈవో శ్యామలరావు.. బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విపత్తును ఎలా ఎదుర్కొనాలనే దానిపై పలు సూచనలు చేశారు. టీటీడీ సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలన్న ఈవో.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని …

    Read More »
  • 16 October

    Rs 10 Coin: రూ.10 కాయిన్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్.. దిగ్గజ బ్యాంకుల కీలక నిర్ణయం!

    Rs 10 Coin: ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10 కాయిన్లు తీసుకోవడం లేదు. ఏదైనా కొనుగోలు చేసి 10 రూపాయల నాణెం ఇస్తే చెల్లడం లేదని తీసుకోవడం లేదు. ఈ అనుభవం మీకు కూడా ఎదురయ్యే ఉంటుంది. కొందరి వద్ద పదు సంఖ్యలో నాణేలు జమ అయ్యాయని చెబుతున్నారు. ఎవరూ తీసుకోకపోవడంతో నష్టపోవాల్సిందేనా అని బాధపడుతున్న వారూ ఉన్నారు. అయితే, అలాంటి వారదరికీ ఇది శుభవార్త అని చెప్పాలి. రూ.10 నాణేల చెల్లుబాటుపై ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ …

    Read More »
  • 16 October

    ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. పండగకు ముందే దీపావళి గిఫ్ట్

    Diwali: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు 3 శాతం డీఏ(కరవు భత్యం) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 50 శాతంగా ఉన్న డీఏ.. ప్రస్తుతం 53 శాతానికి పెరిగింది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతుండగా.. ఈ ఏడాది మార్చిలో పెంచగా.. ప్రస్తుతం మరోసారి పెంచారు. మార్చిలో 4 శాతం పెరిగిన డీఏ.. తాజాగా …

    Read More »
  • 16 October

    భారీగా పడుతున్న రిలయన్స్ షేరు.. టార్గెట్ ప్రైస్ తగ్గింపు.. అంబానీ అసలు ఆట ముందుందిగా..!

    Ambani Shares: దేశంలోనే మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. దేశంలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. కొంతకాలం కిందట ఏకంగా ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 21 లక్షల కోట్లను కూడా అధిగమించి ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది. ఇదే సమయంలో జులై నెలలో స్టాక్ రూ. 3217.60 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని కూడా నమోదు చేసింది. అయితే ఇది ఒకప్పుడు. ఇప్పుడు స్టాక్ ఎందుకో తెలియదు …

    Read More »
  • 16 October

    మా మనసులు గెలుచుకున్నారు.. సీఎం రేవంత్‌పై మెగాస్టార్ కోడలు ఎమోషనల్ పోస్ట్

    మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగాపవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల.. సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ మనుసులు గెలుచుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా మనుసులు గెలుచుకున్నారు. తెలంగాణ వారసత్వం, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చేసిన కృషితో పాటు.. భారత్‌లో ఆర్చరీ క్రీడకు తిరుగులేని మద్దతును అందించినందుకు మా నాన్న అనిల్ కామినేనిని సత్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.. లవ్ యూ …

    Read More »