TimeLine Layout

October, 2024

  • 16 October

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో ముగ్గురు కొత్త జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు, వివరాలివే

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల్ని నియమించడానికి సుప్రీం కోర్టు కొలీజియం పేర్లను సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌ల పేర్లతో.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన కొలీజియం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, హైకోర్టులోని ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులను సంప్రదించారు. అయితే ఈ ముగ్గురినీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ మే …

    Read More »
  • 16 October

    ఏకాభిప్రాయంతో సాగిన ఆ బంధం.. అత్యాచారం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

    ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం ఎలాంటి మోసపూరిత అంశాలు లేకుండా పరస్పర అంగీకారంతో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతోన్న శారీరక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహ వాగ్దానం మొదటి నుంచి నేరపూరితమని రుజువైతే తప్ప ఏకాభిప్రాయంతో కొనసాగిన శారీరక సంబంధాన్ని అత్యాచారంగా చూడలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు పెళ్లి చేసుకుంటానని హామీతో అత్యాచారానికి పాల్పడ్డినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొరాదాబాద్‌కు చెందిన శ్రేయ్‌ గుప్తాపై ఉణ్న క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను జస్టిస్ అనీశ్‌కుమార్ గుప్తా రద్దు చేశారు. తన భర్త మరణించిన …

    Read More »
  • 16 October

    హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. చదరపు అడుగుకు ఇన్ని వేలా.. ఐదేళ్లలో మార్పు ఇదే..!

    Property Prices Surge: రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కరోనా సమయంలో కాస్త ఈ రంగంపై ప్రభావం పడినా.. మళ్లీ కొన్నాళ్లకే ఊహించని రీతిలో పుంజుకుంది. ఇప్పుడు అడ్డూఅదుపు లేకుండా రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఇళ్లు, భూముల ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. రేట్లు పెరుగుతున్నా డిమాండ్ ఏ మాత్రం తగ్గట్లేదు. నిత్యం కొత్త కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రారంభం అవుతూనే ఉన్నాయి. వీటిల్లో బుకింగ్ ప్రాసెస్ కూడా గంటల్లో ముగుస్తోంది. అంతలా డిమాండ్ ఉంది మరి. గత …

    Read More »
  • 16 October

    ‘బెదిరిస్తున్నావా.. నా ఇంటికి రా.. వాళ్లు చెబితేనే చేశా’ భూమా అఖిలప్రియ వర్సెస్ జగన్

    నంద్యాల జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, విజయ పాల డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. నంద్యాల విజయ డెయిరీకి వెళ్లిన ఆమె.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరుతో ఉన్న శిలాఫలకాన్నే కాలువలో పడేయడంపై భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు.. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నంద్యాలలో పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని ప్రారంభించిన సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఇప్పుడు తొలగించి కాలువపై వేయడంపై మండిపడ్డారు. …

    Read More »
  • 16 October

    వెంకటేష్‌, అనిల్ రావిపూడి సినిమా.. సంక్రాంతికి డౌటేనా?

    టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి సీజన్‌ అత్యంత కీలకం. అందుకే స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు సంక్రాంతికి రావాలని భావించే వారు ఎక్కువ మంది ఉంటారు. గత ఆరు నెలలుగా సంక్రాంతి సీజన్ సినిమాల గురించి మీడియాలో వార్తలు వస్తు ఉన్నాయి. మొదట 2025 సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర, వెంకటేష్‌, అనిల్ రావిపూడి మూవీ, నాగార్జున మూవీ, రవితేజ సినిమాలు రాబోతున్నట్లు ప్రకటన వచ్చాయి. సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్ది ఒక్కో సినిమా చొప్పున తప్పుకుంటూ కొత్త సినిమాలు బరిలోకి వస్తున్నాయి. ఇటీవల …

    Read More »
  • 16 October

    ఆస్ట్రేలియా పర్యటన నుంచి షమీ ఔట్!.. హింట్ ఇచ్చిన రోహిత్ శర్మ!

    టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సుమారు ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ 2023లో అతడు చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్న మహమ్మద్ షమీ.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అయితే అతడు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడని.. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని అంతా భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడు …

    Read More »
  • 16 October

    ఆరోగ్యం విషయంలో ఆ రాశుల వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

    దిన ఫలాలు (అక్టోబర్ 16, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఆర్థిక విషయాల్లో ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథున రాశి వారికి అవసరానికి తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ధనాదాయ …

    Read More »
  • 16 October

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. మొత్తానికి ఆ ఫైల్ కదిలింది

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన ఫైల్ కదిలింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన క్రమశిక్షణా కేసుల వివరాలను తనకు పంపాలని సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు, జిల్లాస్థాయి అధికారులంతా ఉద్యోగులపై నమోదైన కేసులను తక్షణమే సమీక్ష చేయాలని.. పెండింగ్‌ కేసుల వివరాలతో ఒక నోట్‌ను తనకు పంపాలంటూ సీఎస్‌ అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ నీరబ్‌కుమార్ మెమో జారీ చేశారు. 2022లో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన కేసులను సంబంధిత శాఖ కానీ, …

    Read More »
  • 16 October

    అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి

    అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. దక్షిణ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో స్టేట్ హైవేపై సాయంత్రం 6.45 గంటలకు (అమెరికా కాలమానం) రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ …

    Read More »
  • 16 October

    ఏపీలో మందుబాబులకు పండగ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, ప్రభుత్వం చాలా తక్కువకే!

    AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి అమల్లోకి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రతి షాపు నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం లైసెన్సులు దక్కించుకున్నవారు ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆర్డర్లు పెట్టారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు. మద్యం షాపులకు లిక్కర్ ఆర్డర్ల కోసం ఎక్సైజ్‌ శాఖ లైసెన్సులు దక్కినవారికి ప్రత్యేకంగా లాగిన్‌ ఐడీలు కేటాయించింది. నేటి నుంచి మందుబాబులు …

    Read More »