TimeLine Layout

October, 2024

  • 14 October

    హరితేజను బుక్ చేసేశారుగా..ఈ వారం నామినేషన్స్ ఫుల్ లిస్ట్ ఇదే.. ఏకంగా 9 మంది

    బిగ్‌బాస్ 7వ వారం నామినేషన్స్‌లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. దాని కంటే ముందు ప్రోమో 2పై ఓ లుక్కేద్దాం. ప్రోమో 2లో ముందుగా తేజను నామినేట్ చేసింది యష్మీ. ఆయన నుంచి ఫన్ నేను అనుకున్నంత రాలేదు అంటూ యష్మీ చెప్పింది. దీనికి అవాక్కైన తేజ.. అసలు నేను మా క్లాన్‌తో ఎలా ఉన్నానో యష్మీకి తెలీనే తెలీదంటూ తేజ చెప్పాడు. అయితే బీబీ హోటల్ టాస్కులో తేజ క్యారెక్టర్ నుంచి బయటికొచ్చాడంటూ …

    Read More »
  • 14 October

    ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం.. కాలితో తన్ని మరీ.. కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత

    సికింద్రాబాద్‌ పరిధిలోని మోండా మార్కెట్‌ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఆదివారం (అక్టోబర్ 13న) రోజు రాత్రి సమయంలో ఆలయంలో నుంచి శబ్దం రావటంతో మేల్కొన్న స్థానికులు.. పారిపోతున్న ముగ్గురు దుండగుల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. పారిపోయిన వారికోసం గాలింపు చేపట్టారు. అయితే.. ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా.. ఓ దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్నుతూ విగ్రహాన్ని ధ్వంసం …

    Read More »
  • 14 October

    ఎకనామిక్స్‌లో ముగ్గురికి నోబెల్.. దేశాల సంపదలో అసమానతలపై పరిశోధనలు

    Nobel prize 2024: అర్థశాస్త్రంలో చేసిన విశేష కృషికి గానూ 2024 ఏడాదికి ముగ్గురికి నోబెల్‌ బహుమతి లభించింది. మెడికల్ విభాగంతో ప్రారంభమైన ఈ నోబెల్ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది. తాజాగా సోమవారం అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాన్ని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. దేశాల మధ్య నెలకొన్న సంపదలో అసమానతలపై జరిపిన అనేక పరిశోధనలకు గానూ డారెన్‌ ఏస్‌మోగ్లు, సైమన్‌ జాన్సన్, జేమ్స్‌ ఎ. రాబిన్‌సన్‌ ఈ నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. మెడిసిన్ విభాగంతో గత సోమవారం మొదలైన …

    Read More »
  • 14 October

    ట్విస్ట్ ఇచ్చిన ఆమ్రపాలి సహా ఆ ఇద్దరు.. క్యాట్‌లో పిటిషన్.. సీఎం రేవంత్ రంగంలోకి దిగుతారా..?

    తెలంగాణలో కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్‌ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఏపీలో కొనసాగుతున్న తెలంగాణ కేడర్ అధికారులు.. తమ సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఇటీవల కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‎గా కొనసాగుతోన్న ఆమ్రపాలితో పాటు మిగతా 10 మంది అధికారులకు డిపార్ట్‏మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సెంటర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉండగా.. ఐఏఎస్‌లు ట్విస్ట్ ఇచ్చారు. డీఓపీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమ్రపాలి సహా నలుగురు …

    Read More »
  • 14 October

    దసరాకు ‘ఆల్ టైం రికార్డు’ సృష్టించిన మందుబాబులు.. గతేడాది కంటే రూ.200 కోట్లు ఎక్కువ.. ఆ జిల్లానే టాప్‌..!

    Telangana Wines Shops: తెలంగాణలో దసరా అంటే మామూలుగా ఉండదు. చుక్కా ముక్కా ఉండాల్సిందే. అది కూడా ఏదో సరదాగా తాగటం కాదు.. అదో యుద్ధం చేసినట్టే ఉంటుంది. అలాగని తెలంగాణ ప్రజలకు తాగటం ఓ వ్యసనం కాదు.. అలవాటు పడిన ఓ సంప్రదాయం. అయితే.. ప్రతీ దసరాకు.. ఖజానాకు గట్టిగానే కాసులు ముట్టజెప్తారు తెలంగాణ మందుబాబులు. ప్రతిసారిలాగే ఈసారి కూడా.. మందుబాబులు రికార్డుస్థాయిలో మద్యం తాగేశారు. కేవలం పది రోజుల్లో వెయ్యి కోట్లు మార్కు దాటించి.. ఆల్ టైం రికార్డు సృష్టించారు. అయితే.. …

    Read More »
  • 14 October

    నీ యవ్వా ఇది నామినేషన్ అంటే.. పూనకంతో ఊగిపోయిన అవినాష్..ప్రోమో అదుర్స్

    బిగ్‌బాస్ ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో కంటెస్టెంట్ల మధ్య మాటాలదాడి మాములుగా లేదు. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియకి సరికొత్త థీమ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ప్రశాంతంగా సాగే ప్రయాణంలో ఇంటి సభ్యులందరిలో నుంచి ఎవరు నామినేట్ అవుతారనేది ఇద్దరు కిల్లర్ గర్ల్స్ అయిన హరితేజ-ప్రేరణపైన ఆధారపడి ఉంటుంది.. ప్రతిసారి గుర్రం సౌండ్ వినిపించినప్పుడల్లా ఇద్దరు కిల్లర్ గర్ల్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి హ్యాట్‌ను (టోపీ) పట్టుకోవాల్సి ఉంటుంది.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అంటే హ్యాట్‌ను ఎవరైతే …

    Read More »
  • 14 October

    39,481 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇందులో మహిళలకు 3869 పోస్టులు.. 10th Class అర్హత.. దరఖాస్తుకు ఇవాళే ఆఖరు తేది!

    SSC GD Constable Recruitment 2025 : ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 39,481 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుషులు, మహిళలు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. పురుషులకు 35,612 పోస్టులు ఉండగా.. మహిళలకు 3869 పోస్టులున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ …

    Read More »
  • 14 October

    డైలీ 1.5 GB డేటా.. జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ ఏది చీప్.. దేంట్లో ఎంత రీఛార్జ్ చేయాలి?

    Daily 1.5 GB Data Plans: తక్కువ ధరల్లోనే అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్‌లు అని రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చి దేశంలో కొన్నేళ్ల కిందట రిలయన్స్ జియో సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. జియో రాకతో.. జనం దీనికి అలవాటుపడ్డారు. దెబ్బకు ఎయిర్‌టెల్, వొడాఫోన్- ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటివి కుదేలయ్యాయి. వీటి సబ్‌స్క్రైబర్లు భారీగా తగ్గి మెజార్టీ సంఖ్యలో జియోకు మారిపోయారు. కొంతకాలం బాగానే నడిచినా.. తర్వాత్తర్వాత జియో బాటలోనే అన్నీ పయనించాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాగే రీఛార్జ్ ప్లాన్లు కూడా. ముందుగా …

    Read More »
  • 14 October

    టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఊహించని ట్విస్ట్.. లొంగిపోయిన ప్రధాన నిందితుడు

    తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసు సోమవారం ట్విస్ట్ తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పానుగంటి చైతన్య సోమవారం కోర్టులో లొంగిపోయారు. మంగళగిరి కోర్టులో పానుగంటి చైతన్య లొంగిపోయారు. ప్రస్తుతం పానుగంటి చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2021 అక్టోబర్‌లో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై కొంతమంది దాడి చేశారు. రాళ్లు, కర్రలతో టీడీపీ కేంద్ర కార్యాలయం అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ కేసులో పానుగంటి చైతన్య ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ …

    Read More »
  • 14 October

    వాహనదారులు ఎగిరి గంతేసే వార్త.. ఇక కార్లకు టోల్ ట్యాక్స్‌ ఉండదు

    Toll Tax: మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వివిధ వర్గాలకు ఊరటనిచ్చేలా అనేక పథకాలు, నిర్ణయాలను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాహనదారులకు మహారాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి ముంబై నగరంలోకి ప్రవేశించే.. లైట్ మోటార్ వాహనాలకు ఆ మార్గంలో ఉండే టోల్ ప్లాజాల్లో టోల్ ఫీజులు వసూలు చేయమని …

    Read More »