TimeLine Layout

October, 2024

  • 12 October

    పండుగ రోజున చంద్రబాబు ఇంటికి చిరంజీవి.. అసలు కారణమదే..

    మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి శనివారం సాయంత్రం వచ్చారు చిరంజీవి. చంద్రబాబును కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళం తాలూకు చెక్ అందజేశారు. విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తన తరుఫున రూ.50 లక్షలు, రామ్ చరణ్ తరుఫున మరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని శనివారం రోజున చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. ఇక …

    Read More »
  • 12 October

    ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లోనే.. టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు

    ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్య గమనిక. ఏపీలో ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 14వ తేదీ (సోమవారం) నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని కారణంగా ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం, అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, …

    Read More »
  • 12 October

    డీఎస్పీ హోదాలో క్రికెటర్ మహమ్మద్ సిరాజ్.. లుక్ అదుర్స్

    టీమిండియా ఆటగాడు, హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్.. డీఎస్పీగా (డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌) బాధ్యతలు స్వీకరించారు. ఖాకీ డ్రెస్సు ధరించి, చేతిలో లాఠీ పట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహ్మద్‌ సిరాజ్‌.. శుక్రవారం (అక్టోబర్ 12) తెలంగాణ డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ను కలిసి రిపోర్ట్‌ చేశారు. ఆయన చేతుల మీదుగా జాయినింగ్ లెటర్‌ను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు మహేష్ భగవత్, రమేశ్‌తో పాటు ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో …

    Read More »
  • 12 October

    దసరా పండుగ రోజు ఏపీకి కేంద్రం సూపర్ న్యూస్.. మరోసారి నిధుల విడుదల.. ఈసారి ఎంతంటే?

    ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం కింద తొలి విడతగా ఏపీకి రూ.593.26 కోట్లు నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ఈ నిధులు కేటాయిస్తారు. మరోవైపు ఇటీవలే కేంద్రం గోదావరి పుష్కరాలకు సైతం నిధులు విడుదల చేసింది. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద తూర్పుగోదావరి జిల్లాలో పుష్కర పనుల కోసం రూ.100 కోట్లు విడుదల చేశారు.2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అప్పటిలోగా ఈ నిధుల …

    Read More »
  • 12 October

    ఫోన్ పే, గూగుల్ పేతో ఒక్కరోజులో ఒక్క ట్రాన్సాక్షన్‌పై గరిష్టంగా ఎంత పంపొచ్చు..? ఏ బ్యాంకులో ఎలా?

    HDFC UPI Transaction Limit: భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) రాకతో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయని చెప్పొచ్చు. మొదటి నుంచే దీనిపై ఆసక్తి ఎక్కువైంది. యూపీఐ పేమెంట్స్ చేసేందుకు.. గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటితో ఇలా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుపుతుంటారు. దీంతో.. తక్కువ టైంలోనే ఎక్కువ మంది వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల సాధనంగా మారింది యూపీఐ. ఈ క్రమంలోనే యూపీఐ సేవల్ని మరింత మందికి చేరువ చేసేందుకు కొత్త కొత్త సదుపాయాల్ని ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంది రిజర్వ్ బ్యాంక్ …

    Read More »
  • 12 October

    ఏపీ ప్రజలకు బంపరాఫర్.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్, ఉపయోగించుకోండి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు దసరా బొనాంజా ప్రకటించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతుబజార్లలో వంట నూనెలు, ఉల్లి, టమాటాలు విక్రయాలు ప్రారంభమయ్యాయి. పామాయిల్‌ లీటరు రూ.110కి, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.124కు విక్రయిస్తున్నారు.. అలాగే కిలో టమాటా రూ.45, ఉల్లిపాయల్ని కూడా డిసౌంట్‌పై అందిస్తోంది. అలాగే రైతు బజార్లలో వినియోగదారులకు కనబడేలా బోర్డులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ విజయవాడలో పర్యటించారు. నగరంలోని పటమట, …

    Read More »
  • 12 October

    ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, పిడుగులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

    ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వాన ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది.. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. బంగాళాఖాతంలో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 14వ తేదీ వరకు నేరుగా వాయుగుండంగా.. 15 నాటికి తీవ్ర తుఫాన్‌గా మారనుందని భావిస్తున్నారు. ఇది 15వ తేదీన తమిళనాడులో తీరం దాటే …

    Read More »
  • 12 October

    ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.5లక్షలు

    ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ మహిళల స్వయం ఉపాధి కల్పనకు సిద్ధమైంది. ప్రభుత్వం ఉపాధి యూనిట్‌ ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణకు రూ.50వేల రాయితీతో రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు రుణాలు అందిస్తోంది. అయితే వీరు తీసుకున్న రుణంలో రాయితీ పోను మిగతా మొత్తంపై వడ్డీ కూడా ఉండదు. నవంబరు నుంచి లబ్ధిదారుల ఎంపిక మొదలుకానుంది. రాయితీ రుణాలకు మూడేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు చేయనుండగా.. ఇందులో రాయితీ రూ.180 కోట్లు, మిగతా రూ.320 …

    Read More »
  • 12 October

    ఖర్చుల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

    దిన ఫలాలు (అక్టోబర్ 12, 2024): మేష రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయి, కొత్త ఆఫర్లు ముందుకు వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు …

    Read More »
  • 11 October

    లిక్కర్ షాపు దరఖాస్తులకు ముగిసిన గడువు.. ప్రభుత్వానికి ఎన్ని కోట్లు ఆదాయమంటే?

    లిక్కర్ షాపుల లైసెన్సుల ద్వారా ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఇవాళ్టితో ముగిసింది. శుక్రవారం (అక్టోబర్ 11) రాత్రి ఏడు గంటలకు ఈ గడువు ముగియగా.. భారీగా దరఖాస్తులు వచ్చాయి. లిక్కర్ షాపుల కోసం సుమారుగా 90 వేల వరకూ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. దరఖాస్తుదారుల నుంచి ఫీజుగా రూ.2 లక్షలు చొప్పున వసూలు చేశారు. దీంతో దరఖాస్తు రుసుము రూపంలో ఏపీ ప్రభుత్వ ఖజానాకు రూ.1800 కోట్లు …

    Read More »