ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఈ ప్రభావంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో.. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. ఈ నెలలో మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో రెండు, అరేబియాలో మరో తుఫాన్ ఏర్పడుతుందని.. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని భావిస్తున్నారు. ఈ నెల 10 తర్వాత కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇవాళ …
Read More »TimeLine Layout
October, 2024
-
7 October
తిరుమల లడ్డూ కౌంటర్‌లలో సరికొత్త విధానం.. ఇకపై భక్తులకు ఈజీగా, మెషిన్లు వచ్చేశాయి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. లడ్డూల విషయంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ చర్యలు మొదలుపెట్టింది. తిరుమలలోని కౌంటర్ల దగ్గర ఎలాంటి ఆలస్యం లేకుండా.. త్వరగా భక్తులకు లడ్డూలను అందిస్తోంది. గతంలో చెప్పినట్లుగానే ఆధార్ ఆధారంగా లడ్డూలను అందిస్తున్నారు.. దీని కోసం ప్రత్యేకంగా స్కానింగ్ మెషిన్లను తీసుకొచ్చారు అధికారులు. టీటీడీ ఐటీ విభాగం.. తిరుమల లడ్డూ ప్రసాదం కౌంటర్‌లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించే పనిలో ఉంది. తిరుమలలో లడ్డూ ప్రసాదాలను ప్రస్తుతం …
Read More » -
7 October
పోలీస్ స్టేషన్‌కు ఏడో నిజాం మనవరాలు ప్రిన్సెస్ ఫౌజియా.. అసలు వివాదం ఏంటంటే..?
నిజాం ఆస్తులు కొట్టేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవరాలు ప్రిన్సెస్ ఫాతిమా ఫౌజియా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. వారుసులుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆస్తులు కొట్టేసేందుకు కుట్రపన్నారంటూ నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండో కుమారుడు హైనస్ వాల్షన్ ప్రిన్స్ మౌజ్జమ్ ఝా బహదూర్ కుమార్తె ఫాతిమా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే 2016లో నాంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము ఏడో నిజాం …
Read More » -
7 October
నేడు ప్రధానితో సీఎం భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్‌ప్లాంటు, వరద సాయం తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాని మోదీని, పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో హస్తినకు బయల్దేరతారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో సమావేశమవుతారు. ఆ తర్వాత రైల్వే, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలుస్తారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రోడ్డురవాణా మంత్రి నితిన్ …
Read More » -
7 October
నేటి అలంకరణ శ్రీ మహాచండీదేవి ఆశ్వీయుజ శుద్ధ పంచమి, సోమవారం
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీమహాచండీ అమ్మవారు ఉద్భవించారు. ఆమెలో అందరు దేవతలు కొలువై ఉన్నారు. అందుకే శ్రీమహాచండీ దేవివి ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టేనంటారు పెద్దలు. శ్రీమహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఏ కోరికలతో భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ …
Read More » -
7 October
తెలంగాణ ప్రజలకు సర్కార్ దసరా కానుక.. పండుగకు ఒక రోజు ముందే.. మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో ప్రతిష్టాత్మక కార్యక్రమంవైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపికబురు వినిపించారు. తెలంగాణలో విద్యార్థులకు మెరుగైన విద్యా అందించటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే.. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పైలెట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిరలో క్యాంపస్‌లు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత.. అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే.. ఆదివారం …
Read More » -
7 October
అమాంతంగా పెరిగిపోయిన టమాటా ధరలు.. 15 రోజుల్లోనే ట్రిపుల్.. అసలు కారణాలివే..!
కూరగాయలు కొందామంటేనే సామాన్యులు వణికిపోతున్నారు. కూరగాయల ధరలు వింటేనే గుండెల్లో దడ పుడుతుందంటున్నారు జనాలు. ఆ రేంజ్‌లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. అందులోనూ.. టమాట ధరలు మండిపోతున్నాయి. నెల కిందటి వరకు టమాటా ధరలు 30 నుంచి 40 రూపాయలు (కిలోకు) ఉండగా.. ఈ 15 రోజుల గ్యాప్‌లోనే కొండెక్కి కూర్చున్నాయి. ఈ రెండు వారాల్లోనే ఉన్నట్టుండి టమాట రేట్లు ఏకంగా ట్రిపుల్ అయ్యాయి. ప్రస్తుతం టమాటా ధర.. 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్‌లోనే కిలో టమాటా ధర …
Read More » -
7 October
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎవరూ డబ్బులు ఇవ్వొద్దన్న టీటీడీ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు అక్టోబరు 7న తిరుమలకు చేరుకుంటాయి.
Read More » -
6 October
రేపే అకౌంట్లలోకి డబ్బులు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. వారందరికీ బిగ్ రిలీఫ్
ఏపీలో వరద పరిహారం ఇంకా అందనివారికి బిగ్ రిలీఫ్.. వివిధ కారణాల వలన వరద పరిహారం అందని వారికి సోమవారం పరిహారం పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వరదల కారణంగా సుమారు నాలుగు లక్షల మంది ప్రభావితులయ్యారనే అంచనాతో ప్రభుత్వం వరద పరిహారం విడుదల చేసింది. మొత్తం రూ.602 కోట్లు విడుదల చేయగా.. ఇప్పటికే చాలా మందికి వారి బ్యాంకు ఖాతాల్లో పరిహారం మొత్తం జమైంది. అర్హులైన వారిలో ఇప్పటి వరకూ 98 శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. …
Read More » -
6 October
బతుకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు.. ‘తెలంగాణ హెరిటేజ్ వీక్’ పేరుతో సంబురాలు
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సూచిక.. తెలంగాణకు మాత్రమే సొంతమైన పూల కేళిక.. బతుకమ్మ పండుగ. పూలను పూజించే అత్యంత అరుదైన సంబురం బతుకమ్మ. ప్రకృతిలోనే పరమాత్మున్ని చూసుకుని.. పూలనే గౌరమ్మగా భావించి.. చేసుకునే తొమ్మిదిరోజుల మహా ఉత్సవం బతుకమ్మ. అలాంటి బతుకమ్మ పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు.. బతుకమ్మ పండుగకు అధికారికంగా గుర్తించాయి. అంతేకాదు.. బతుకమ్మ సంబరాల వారాన్ని.. బతుకమ్మ …
Read More »