TimeLine Layout

September, 2024

  • 25 September

    ఏపీలో వారందరికి ఉద్యోగాలు.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్

    ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కారుణ్య నియామకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాల జాబితాలో వేచి చూస్తున్న వారిని జిల్లా కలెక్టర్ల కామన్‌ పూల్‌లోని ఖాళీల్లో నియమించే అంశంపై.. రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులతో చర్చించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్‌ ఉద్యోగులు, వాటి పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యాయులు మరణిస్తే.. వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంపై పంచాయతీరాజ్‌ …

    Read More »
  • 25 September

    ఏపీలో వారందరి అకౌంట్‌లలోకి డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.25వేలు, రూ.10వేలు జమ

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వర్షాలు, వరద బాధితులకు నేడు సాయం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి కూటమి ప్రభుత్వం ప్యాకేజీని అందజేస్తోంది. నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో పలువురు వరద బాధితులకు సీఎం చంద్రబాబు సాయం అందజేస్తారు. ఈ 4 లక్షలమందిలో విజయవాడ పరిధిలోనే సుమారు లక్షన్నర మంది బాధితులు ఉన్నారు. ఇవాళ ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను బాధితులకు సాయం కింద ప్రభుత్వం పంపిణీ చేయనున్నారు. అలాగే ఇళ్లు, షాపులు, వాహనాలు, పంటలు, పశువులు, తోపుడు …

    Read More »
  • 25 September

    ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

    దిన ఫలాలు (సెప్టెంబర్ 25, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) చేపట్టిన పనులన్నీ ఉత్సాహంగా పూర్తవుతాయి. …

    Read More »
  • 24 September

    ఏపీలో తొలి వందే మెట్రో.. ఆ రూట్లో పరుగులు..!

    రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ వస్తోంది. ఈ క్రమంలో వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం కోసం ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా అందుబాటులోకి తేనుంది. తాజాగా వందే మెట్రో పేరుతో తక్కువ దూరం ఉండే నగరాల మధ్యన నడిపేలా కొత్త రైలును కూడా ప్రవేశపెట్టారు. గుజరాత్‌లోని భుజ్- అహ్మదాబాద్ మధ్యన దేశంలోనే తొలి వందే మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. …

    Read More »
  • 24 September

    పిలిచి సీటిచ్చిన వైఎస్ జగన్‌కు షాకిచ్చిన కృష్ణయ్య.. అసలు కారణాలు ఇవేనట..

    ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ ఆర్. కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్. కృష్ణయ్య.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం రాజీనామా చేసిన కృష్ణయ్య లేఖను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు అందజేశారు. ఆర్. కృష్ణయ్య రాజీనామాకు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ఆమోదం తెలిపారు. మరోవైపు ఆర్. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ …

    Read More »
  • 24 September

    యూట్యూబర్ హర్షసాయిపై నటి ఫిర్యాదు.. పెళ్లి పేరుతో మోసం చేశాడని..!

    Harsha Sai Case: ఫేమస్ తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై.. ఓ యువతి ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ ద్వారా ఫేం అయిన ఓ నటి.. తనను పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసం చేశాడంటూ.. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. అడ్వకేట్‌తో కలిసి పీఎస్‌కి వచ్చిన నటి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా ఫిర్యాదు చేయటం గమనార్హం. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నట్టు తెలుస్తోంది. …

    Read More »
  • 24 September

    పవన్ కళ్యాణ్ లాగే మరో హీరోకు డిప్యూటీ సీఎం.. హింట్ ఇచ్చిన ముఖ్యమంత్రి

    తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్.. ఎన్నిక కానున్నట్లు గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అధికార ద్రవిడ మున్నేట్ర కజగం – డీఎంకే పార్టీ నేతలు అయితే తమ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాట్లాడిన తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మంగళవారం ఒక హింట్ ఇచ్చారు. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఉదయనిధికి డిప్యూటీ …

    Read More »
  • 24 September

    టీటీడీకి కొత్త పాలకమండలి!.. దేవాదాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

    తిరుపతి లడ్డూ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామకం చర్చకు వచ్చింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేశారు. ఇక నూతన పాలకమండలిని నియమించాల్సి …

    Read More »
  • 24 September

    సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ ట్రైన్.. 80 శాతం సీట్లు ఖాళీ, ఇలా అయితే కష్టమే..!

    సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న వర్చువల్‌గా ట్రైన్ ప్రారంభించగా.. ఈనెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే కొత్త వందేభారత్ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ ఆశించినంతగా ఉండటం లేదు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దాదాపుగా అన్ని కోచ్‌లు ఖాళీగానే ఉంటున్నాయి. 80శాతానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయని.. రైల్వే అధికారులు గుర్తించారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ, తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ ట్రైన్ ఏర్పాటు చేశారు. …

    Read More »
  • 24 September

    తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్.. తెలంగాణ భక్తురాలి ఆరోపణపై టీటీడీ క్లారిటీ

    తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని టీటీడీ తెలిపింది. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని.. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదన్నారు. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారుని.. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందన్నారు. …

    Read More »