TimeLine Layout

October, 2024

  • 22 October

    హడ్కో నిర్ణయంతో అమరావతికి మహర్దశ.. ఏకంగా రూ.11వేల కోట్లు

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. . రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏకు రూ. 11 వేల కోట్ల రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి నారాయణ ఢిల్లీలో హౌసింగ్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) సీఎండీని కలిశారు. అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వివరించగా.. రూ.11వేల కోట్ల ఈ రుణానికి సంబంధించి హడ్కో ఛైర్మన్, సీఎండీ (మేనేజింగ్‌ డైరెక్టర్‌) సంజయ్‌ కుల్‌ శ్రేష్ఠ హామీ ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. మరో రూ. 165 కోట్ల రుణం విడుదలకూ …

    Read More »
  • 22 October

    ఏపీలో మందుబాబులకు శుభవార్త.. ఇక పండగ చేస్కోండి

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ గతవారమే మొదలైంది. వారం రోజులుగా కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి.. అన్ని బ్రాండ్ల మద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్‌ రూ.99 మద్యం కూడా షాపుల్లో అందుబాటులోకి వస్తోంది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. రూ.99కే క్వార్టర్ మద్యానికి క్రేజ్ పెరిగింది. మరికొన్ని కంపెనీలు కూడా తక్కువ ధరకు నాణ్యమైన మద్యం తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆసక్తి కనబరుస్తున్నాయట. …

    Read More »
  • 22 October

    ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ ఐదు జిల్లాలపై తీవ్ర ప్రభావం, వాతావరణశాఖ అలర్ట్

    ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. బంగాళాఖాతంలో సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్రంగా బలపడింది. ఇది మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది.. బుధవారం నాటికి తుఫాన్‌గా, గురువారం నాటికి తీవ్ర తుఫాన్‌గా మారొచ్చని ఐఎండీ చెబుతోంది. ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున పూరీ (ఒడిశా), సాగర్‌ ద్వీపం (పశ్చిమ బెంగాల్‌) మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది తుఫాన్‌గా బలపడితే ఖతర్‌ సూచించిన దానా …

    Read More »
  • 21 October

    దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్ మాత్రం అప్పుడే..చంద్రబాబు ఆదేశాలు

    chandrababu free gas cylinder scheme: ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుపై సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆ శాఖ అధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో చంద్రబాబు సమీక్షించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై వారితో చర్చించారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న …

    Read More »
  • 21 October

    MK Stalin: ప్రతీ జంట 16 మంది పిల్లల్ని కనండి.. చంద్రబాబు వ్యాఖ్యలకు స్టాలిన్ మద్దతు

    MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్.. ప్రతీ ఒక్కరు 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేశాయని.. అయితే దాని వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయి, లోక్‌సభ నియోజకవర్గాలు కూడా తగ్గుతున్నాయని తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటులో …

    Read More »
  • 21 October

    జగన్ డైలాగ్‌ను ఆయన మీదకే వదిలిన షర్మిల.. వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇలానా..!

    వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ఫైరయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి అన్న మీద బాణాలు వదులుతున్న వైఎస్ షర్మిల.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. వైసీపీపైనా అస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం కూటమి పాలనతో పాటుగా గత వైసీపీ పాలనను కూడా షర్మిల ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై షర్మిల.. ప్రస్తుత, గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. వైఎస్ఆర్ మానసపుత్రిక అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం.. …

    Read More »
  • 21 October

    SGB: ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు!

    SGB: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక ప్రకటన చేసింది. తమ బ్యాంకులో సావెరిన్ గోల్డ్ బాండ్, ఆర్‌బీఐ బాండ్లు కొనుగోలు చేసిన వారికి కీలక సూచన చేసింది. ఇప్పటి వరకు వడ్డీ డబ్బులు రాని వారు, తమ బాండ్లు మెచ్యూరిటీ పూర్తయిన వారు, మెచ్యూరిటీ సమయానికి దగ్గరగా ఉన్న వారు వెంటనే తమ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి తమ బ్యాంక్ ఖాతాను వెరిఫై చేసుకోవాలని సూచించింది. అందుకు 5 రోజుల సమయం ఇచ్చింది. ఈ గడువులోపు …

    Read More »
  • 21 October

    Tirupati Laddu: పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు

    Tirupati Laddu: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. ఓ లాయర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. ఆ పిల్‌ను స్వీకరించిన సిటీ సివిల్ కోర్టు.. ఆయనకు సమన్లు ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కూడా కోర్టు సమన్లు జారీ …

    Read More »
  • 21 October

    నీ అయ్య లెక్క అందరూ ఉండరు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్.. నెటిజన్ల ఘాటు కామెంట్లు

    తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు హద్దుమీరుతున్నాయి. ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకునే క్రమంలో వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల్లా కాకుండా.. సాధారణ ప్రజల్లా అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల నుంచి చీత్కారాలు చవిచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో.. ఎంపీ చామల కిరణ్ …

    Read More »
  • 21 October

    Diarrhoea in Gurla: డయేరియా మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సాయం.. 10 లక్షలు

    విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వ్యక్తిగతంగా ఆర్థిక సాయం ప్రకటించారు. డయేరియాతో బాధపడుతూ గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌తో సమీక్ష జరిపిన పవన్ కళ్యాణ్.. ప్రభుత్వం తరుపున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తామన్న పవన్ కళ్యాణ్.. తన తరఫున వ్యక్తిగతంగా రూ. …

    Read More »