గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థ నిండా ముంచేసింది. మొత్తం 200 మంది సామాన్య రైతుల నుంచి ఏకంగా రూ.9 కోట్లు దండుకుంది. చివరకు ఇది బోగస్ అని తేలడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి.. మూడు నెలల కిందట ‘జెన్ని మిల్క్’ అనే పేరుతో ఓ సంస్థ ఏర్పాటుచేశాడు. హొసపేటెలోని హంపీ రోడ్డులో హంగూ ఆర్భాటాలతో దీనిని ప్రారంభించి.. ఉద్యోగులను నియమించుకున్నాడు. గాడిద పాల వ్యాపారం చేస్తే లక్షాధికారులు …
Read More »TimeLine Layout
September, 2024
-
18 September
నెల ఆలస్యంగా ‘కంగువా’.. రజినీకాంత్ కోసం సూర్య వెనకడుగు
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ ఫాంటసీ డ్రామా ‘కంగువా’ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజున తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వేట్టయ్యన్ సినిమా విడుదల అవ్వబోతుంది. రజినీకాంత్ సినిమాను దసరా బరిలో ఉంచడంతో పాటు, ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయడంతో కంగువా సినిమా విడుదల విషయంలో మేకర్స్ ఆలోచనలో పడ్డారట. రజినీకాంత్ సినిమాకు పోటీ గా కంగువాను విడుదల చేయడం …
Read More » -
18 September
కేంద్రం కీలక నిర్ణయం.. పీఎఫ్ విత్ డ్రా లిమిట్ పెంపు.. ఒకేసారి రూ.1 లక్ష తీసుకోవచ్చు!
PF Withdrawal: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లకు అదిరే శుభవార్త అందించింది కేంద్రం. ఉద్యోగులు ఇకపై తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా మంగళవారం వివరాలు వెల్లడించినట్లు హిందుస్తాన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతా నుంచి ఒకసారి గరిష్ఠంగా రూ.50 వేలు మాత్రమే ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని రూ.1 లక్షకు …
Read More » -
18 September
తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు బంపరాఫర్.. ఐడియా అదిరింది!
తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పార్టీ సభ్యత్వాలను ప్రాంరభించాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్2 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టాలని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే రూ.లక్ష పైబడి సభ్యత్వం చెల్లించిన వారికి శాశ్వత సభ్యత్వం కల్పిద్దామని నేతలకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.. వారందరితో మాట్లాడారు. ఈ సమావేశం మంగళవారం అర్ధరాత్రి వరకు సాగగా.. పార్టీకి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించారు. …
Read More » -
18 September
చపాతీలను ఇలా తింటే బరువు తగ్గుతారు
బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నిస్తుంటారు. నిజానికీ బరువు తగ్గించడంలో మనం తీసుకునే ఆహారం కీ రోల్ పోషిస్తుంది. తర్వాత వర్కౌట్. బరువు తగ్గించడంలో చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ని కంట్రోల్ చేయాలి. అందుకోసం చపాతీలు తినొచ్చు. ఎలా చపాతీలను తింటే రిజల్ట్ ఉంటుందో.. ఏ చపాతీలు మంచివో తెలుసుకోవాలి. దీని వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. చపాతీలు అనేక రకాల పిండిలతో చేసుకోవచ్చు. ఇందులో మల్టీగ్రెయిన్స్.. అంటే చిరు ధాన్యాలు. జొన్నలు, రాగులతో కూడా చేయొచ్చు. ఈ గ్రెయిన్స్‌లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. …
Read More » -
18 September
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు.. మొదలై తొలి విడత పోలింగ్
జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిసారిగా 2014లో అక్కడ శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 స్థానాలుండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడతలో 24 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొదటి విడతలో వివిధ పార్టీలకు చెందిన 219 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 23 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో భద్రతా …
Read More » -
18 September
యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు
ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.. జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. …
Read More » -
18 September
ఈ 4 ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు.. లిస్ట్‌లో SBI, ICICI.. ఒక్కనెలలో రూ.10 వేల కోట్లకుపైనే!
Investment: పెట్టుబడి పెట్టే విషయంలో గత కొంత కాలంగా ప్రజల ఆలోచన ధోరణి మారింది. రిస్క్ ఉన్నా సరే హైరిటర్న్స్ పొందాలని భావిస్తున్న వారు పెరుగుతున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులవైపు మళ్లుతున్నారు. స్టాక్ మార్కెట్లతో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉండడం, హైరిటర్న్స్ వస్తున్న క్రమంలో ఈక్విటీ ఫండ్స్‌లో భారీగా డబ్బులు పెడుతున్నారు. ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్‌లోకి వేల కోట్ల రూపాయలు వచ్చి చేరుతున్నాయి. దాదాపు 43 మ్యూచువల్ ఫండ్స్ గత ఆగస్టు నెలలో ఏకంగా రూ.67.98 లక్షల కోట్ల పెట్టుబడులను అందుకున్నాయి. …
Read More » -
18 September
ఏపీలో పింఛన్ల పంపిణీలో మార్పులు.. ఒకరోజు ముందుగానే డబ్బులు, కీలక ఆదేశాలు
Ntr Bharosa Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పింఛన్ల పంపిణీకి సంబంధించి మార్పులు చేసింది. రాష్ట్రంలో పింఛను పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం ముఖ్యమైన పలు సవరణలు చేసింది. ఒకవేళ నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే.. అప్పుడు పింఛనును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి అందిస్తారు. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు పింఛను పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100 శాతం పంపిణీ …
Read More » -
18 September
గంగ ఒడికి గణనాథుడు
హైదరాబాద్‌లో మహా నిమజ్జనం ప్రశాంతం ఈసారి పూర్తిగా నీళ్లలో ఖైరతాబాద్ గణేశుడు 25 అడుగుల లోతు.. 35 అడుగుల వెడల్పుతో వారం రోజులుగా పూడిక తీయడంతోనే రూ.30.01 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ పలుచోట్ల రూ.10 లక్షలు దాటిన వేలం నిమజ్జనం తీరుపై పొన్నం ఏరియల్ వ్యూ ఎన్‌టీఆర్ మార్గ్‌కు సీఎం.. ఏర్పాట్ల పరిశీలన పారిశుధ్య కార్మికులు, క్రేన్ ఆపరేటర్లతో మాట నిమజ్జనంపై ప్రభుత్వ వ్యవస్థల పనితీరు భేష్.. రేవంత్ పర్యవేక్షణ అభినందనీయం: రాజాసింగ్ ‘గణేశ్ మహరాజ్ కీ జై’.. ‘గణపతి బొప్పా మోరియా.. …
Read More »