TimeLine Layout

October, 2024

  • 21 October

    CNG Price: వాహనదారులకు అలర్ట్.. ‘సీఎన్‌జీ గ్యాస్’ ధర పెంపు.. కిలోపై ఎంత పెరగనుందంటే?

    CNG Price: ప్రస్తుతం పెట్రోల్ ధరలు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. దీంతో చాలా మంది సీఎన్‌జీ గ్యాస్ వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు వారికి సైతం ధరల షాక్ తగలనుంది. దేశీయంగా వెలికి తీస్తున్న సహజ వాయువు (సీఎన్‌జీ) సరఫరా తగ్గిపోతోంది. దీంతో గిరాకీని అందుకునేందుకు విక్రయ సంస్థలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. విదేశాల నుంచి ఎక్కువ మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో దేశీయంగా ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడిందని రిటైల్ విక్రయ సంస్థలు చెబుతన్నాయి. విదేశాల్లో …

    Read More »
  • 21 October

    హైదరాబాద్: షవర్మా ఇష్టంగా తింటున్నారా..? అమ్మబాబోయ్, నమ్మలేని నిజాలు

    హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ..గడువు ముగిసిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా.. సికింద్రాబాద్లోని పలు షవర్మ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. శాంధార్ షవర్మ, రోల్స్ ఆన్ వీల్స్, ముజ్ తాబా గ్రిల్స్, ఆసియన్ చో, సింక్ షవర్మ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో షవర్మా సెంటర్ల నిర్వహకులు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు …

    Read More »
  • 21 October

    ఏపీలో కూటమి సర్కారు సూపర్ సిక్స్ అమలు!.. ఏవో చెప్పిన వైసీపీ నేత

    ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు దాటిపోయింది. మొన్నటి వరకూ అధికార పక్షం మీద విమర్శలు చేయడానికి కాస్త ఆలోచించిన వైసీపీ నేతలు.. తాజాగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వాగ్భాణాలు సంధిస్తున్నారు. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తొలు ఆరు నెలలు పాటు.. నూతన ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అంటుంటారు. ఆ సమయంలో కొత్త ప్రభుత్వం మీద విపక్షాలు పెద్దగా ఆరోపణలు చేయవు. ప్రభుత్వం కాస్త కుదురుకోవడానికి సమయం ఇస్తాయి. అయితే టీడీపీ కూటమి సర్కారు తీరు కారణంగా అంత సమయం కూడా ఇవ్వమంటోంది …

    Read More »
  • 21 October

    పెళ్లి పనులు ప్రారంభం.. పసుపు దంచే కార్యక్రమంలో శోభిత.. ఫ్యామిలీ పిక్స్ వైరల్

    శోభిత ధూళిపాళ ప్రస్తుతం పెళ్లి పనుల్ని ప్రారంభించింది. పసుపు దంచడంతోనే పెళ్లి పనుల్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం అయిన తరువాత ఇతర పనుల్ని ముట్టుకుంటారు. అంటే పెళ్లి తంతులో మొదటి ఘట్టం ప్రారంభం అయినట్టే. మరి ఇంత వరకు పెళ్లి డేట్‌ని అయితే ఈ జంట ప్రకటించలేదు.

    Read More »
  • 21 October

    తమిళనాడులో వైసీపీ మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్.. హత్య కేసులో నిందితుడిగా, వీడియో వైరల్!

    మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొస్తున్నారు. శ్రీకాంత్‌ని కారులో ఎక్కిస్తున్న సమయంలో మాట్లాడారు. తాను డాక్టర్‌నని.. ప్రాణాలు పోయడమే తప్ప ప్రాణాలు తీయడం చేతకాదంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ …

    Read More »
  • 21 October

    ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10లక్షలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ పథకాన్ని అమలు చేసే అంశాలపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేయాలా.. సెర్ప్‌ (పేదరిక నిర్మూలన సొసైటీ) ద్వారా అమలు చేయాలా అనే అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు రెండు విధానాలు ప్రభుత్వం దగ్గరకు వచ్చాయి. సెర్ప్ ద్వారా విధానం అమలు చేయాలా?.. గ్రామ, వార్డు సచివాయాల ద్వారా అమలు చేయాలా అనే రెండు ఆప్షన్లను పరిగణలోకి తీసుకుంది. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం.. …

    Read More »
  • 21 October

    కానిస్టేబుళ్లకు రూ.కోటి, ఐపీఎస్‌లకు రూ.2 కోట్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

    త్యాగానికి, సేవకు పోలీసులు ప్రతీక అని.. వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో ముందుంటారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో వారి సేవలు మరువలేనివని కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. గోషామహల్ పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. పోలీసుల త్యాగాలు …

    Read More »
  • 21 October

    తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. మరో మూడ్రోజులే, త్వరపడండి

    తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లను టీటీడీ వేలం వేస్తోంది. ఆసక్తి ఉన్నవారు సీల్డ్ టెండ‌ర్ల‌ను టీటీడీ ఆహ్వానించింది.. టెండ‌ర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళి టిన్‌లు 2025 మార్చి 31వ తేదీ వ‌ర‌కు సేక‌రించేందుకు అవకాశం ఉంటుంది. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండ‌ర్లు అక్టోబరు 23వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు అంద‌జేయాలని సూచించారు. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో …

    Read More »
  • 21 October

    ఏపీ పోలీసులకు శుభవార్త.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులక తీపికబురు చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని.. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసించారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను అభినందిస్తున్నానని.. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీలేదు అన్నారు. పోలీసులు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారన్నారు. పోలీసుల …

    Read More »
  • 21 October

    శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త

    శబరిమల అయ్యప్ప ఆలయంలో నవంబరు 16 నుంచి మండల పూజలు ప్రారంభం కానున్నాయి. నెలవారీ పూజల కోసం అక్టోబరు 17న ఆలయం తెరుచుకోగా.. వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మూడు రోజుల అనంతరం ఆదివారం సాయంత్రం ఆలయాన్ని మూసివేశారు. ముందు రెండు రోజులతో పోల్చితే ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. ఇదిలా ఉండగా, అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రత్యేకంగా ఓ రేడియోను ప్రారంభించనుంది. ‘రేడియో హరివరాసనం’ పేరుతో ఆన్‌లైన్ రేడియో సర్వీసులను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. భౌతికంగా శబరిమలకు రాలేని …

    Read More »