ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి విజయవాడ నగరం గజగజా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోవడంతో అక్కడికి పడవల్లోనే అధికారులు వెళ్లి.. బాధితులకు భోజనం, తాగునీరు అందిస్తున్నారు. మరీ వరదలో చిక్కుకున్న వారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు ఉన్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారు ఇళ్లల్లో ఉండలేక.. బయటికి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వరద నీటిలోనే …
Read More »TimeLine Layout
September, 2024
-
3 September
వరద బాధితులకు బాలకృష్ణ భారీ సాయం.. టీడీపీ ఎంపీ రూ. కోటి విరాళం
Balakrishna: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకుంటున్నారు. ఇక తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికి తోచిన సహాయాన్ని వారు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇక మరో …
Read More » -
3 September
బుధవారం కూడా అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు.. ఈ జిల్లాలో మాత్రమే..
School Holiday : మంగళవారం కూడా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ఉందా? లేదా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సోమవారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇంకా వర్ష బీభత్సం కనిపిస్తోంది. వాగులు వంకలు వరదతో పోటేత్తాయి. వర్షపు నీళ్లు ప్రవాహంలా మారి రోడ్లపైకి వచ్చేశాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చేశాయి. వాహనాలు ముగినిపోయాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే.. ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా …
Read More » -
3 September
అందుకే వరదబాధితుల వద్దకు రావట్లేదు.. పవన్ క్లారిటీ, బాధితులకు రూ.కోటి విరాళం
Deputy CM: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరదలతో అల్లాడుతున్న వారికి అండగా నిలిచేందుకు తన వంతుగా రూ.కోటి విరాళం ప్రకటించారు. ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు ధైర్యం చెప్పేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత, …
Read More » -
3 September
‘నచ్చింది కొనుక్కోండి.. నా క్రెడిట్ కార్డు వివరాలివే’.. వ్యాపారవేత్త ఆఫర్ కోసం ఎగబడిన జనం!
Bold Care: ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. దీంతో మోసాలు సైతం పెరిగాయి. ఈ క్రమంలో తమ కార్డుల వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని ప్రభుత్వాలు, బ్యాంకులు, ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి. తమ కార్డు వివరాలు బహిర్గతమయితే వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి బ్లాక్ చేయిస్తుంటారు. కానీ, ఓ వ్యాపారవేత్త ఏకంగా తన క్రెడిట్ కార్డు వివరాలను ఆన్‌లైన్‌లోనే పెట్టేశాడు. తన కార్డును ఉపయోగించుకుని మీకు నచ్చింది కొనుక్కోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో …
Read More » -
3 September
ఆ 185 మంది దగ్గరే రూ. 100 లక్షల కోట్లు.. ఈ డేటా చూస్తే మైండ్ బ్లాంక్.. టాప్-10 లో ఒకే మహిళ!
Ambani Adani Wealth: ప్రపంచ దేశాల్లో.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి రేటు ఇతర చాలా దేశాలతో పోలిస్తే ఘనంగా ఉందని చెప్పొచ్చు. ఇదే సమయంలో.. భారత్‌లో సంపన్నుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో నికర సంపద ఒక బిలియన్ డాలర్లకు (రూ. 8400 కోట్లు) పైగా సంపద ఉన్న వారి సంఖ్య 185 ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ మొత్తం 185 మంది నికర సంపద ఒక ట్రిలియన్ డాలర్ …
Read More » -
3 September
తోడేళ్లు కనిపిస్తే కాల్చిపారేయండి.. యోగి సర్కార్ సంచలన ఆదేశాలు
UP Govt: గత కొన్ని రోజులుగా ఉత్తర్‌ప్రదేశ్‌లో తోడేళ్ల దాడులు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. కనిపించిన వారిపై కనిపించినట్లే దాడులు చేయడంతో ఇప్పటివరకు 10 మంది మృత్యువాతపడ్డారు. మరో 30 మందికిపైగా తోడేళ్ల దాడుల్లో గాయపడ్డారు. ఇక చనిపోయిన 10 మందిలో 9 మంది చిన్న పిల్లలే కావడం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా తోడేళ్లు చేస్తున్న దాడులను నివారించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని తోడేళ్లను అధికారులు పట్టుకోగా.. మరికొన్ని మాత్రం …
Read More » -
3 September
సొంతగడ్డపై పాకిస్థాన్‌కు ఘోర పరాభవం.. రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్ విజయం..
సొంతగడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఆ జట్టు టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. పూర్తిస్థాయి జట్టులో బరిలోకి దిగినప్పటికీ.. బంగ్లాదేశ్‌ను కట్టడి చేయలేక చిత్తుగా ఓడిపోయింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓడి.. ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. రెండో టెస్టులో పట్టు చిక్కే అవకాశం లభించినప్పటికీ.. 6 వికెట్ల తేడాతో పరాజయం పాలై పరువు పోగొట్టుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో 185 …
Read More » -
3 September
వరద బాధితులకు తీన్మార్ మల్లన్న ఆర్థిక సాయం.. ఎంత ప్రకటించారంటే..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తాయి. దీంతో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల ప్రజలు ముంపు బాధితులుగా మిగిలారు. భారీ వరదలకు ఇల్లు వాకిలి కొట్టుకుపోయి నిరాశ్రయులుగా మారారు. దీంతో వారిని అదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు. తాజాగా.. వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సాయం ప్రకటించారు. వరద బాధితుల కోసం ఎమ్మెల్సీగా తనకు వచ్చే ఒక నెల జీతాన్ని సీఎం సహాయ నిధికి …
Read More » -
3 September
ఆ 2000 నోట్లన్నీ ఇక చిత్తు కాగితాలేనా? RBI మరో కీలక ప్రకటన..
Rs 2000 Notes: రూ.2 వేల కరెన్సీ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి కీలక ప్రకటన చేసింది. చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.96 శాతం రూ.2000 కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపింది. ఇంకా ప్రజల వద్ద రూ.7261 కోట్లు విలువైన పెద్ద నోట్లు ఉన్నాయని తెలిపింది. మే 19, 2023 రోజున చలామణి నుంచి 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాటిని మార్చుకునేందుకు …
Read More »