TimeLine Layout

August, 2024

  • 24 August

    కోల్‌కతా హత్యాచార నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్.. అసలేంటీ పరీక్ష, అందులో నిజం ఎలా తెలుస్తుంది?

    Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెను సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం ఘటనలో సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోర్టు ఆదేశాలతో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ సహా మరో ఆరుగురికి పాలీగ్రాఫ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో అతడ్ని జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే జైలులోనే ఈ పాలీగ్రాఫ్ టెస్ట్‌ను సీబీఐ అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు.. సంజయ్ రాయ్‌తోపాటు …

    Read More »
  • 24 August

    హైకోర్టులో నాగార్జునకు బిగ్ రిలీఫ్.. N కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని ఆదేశం

    హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేయగా.. ఇది అక్రమం అంటూ యజమాని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాగార్జున పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేతలపై స్టే విధించింది. కాగా, హీరో నాగార్జున మాదాపూర్‌లోని తూంకుంట ఒడ్డున 2015లో ఈ …

    Read More »
  • 24 August

    రేవంత్ సర్కార్‌కు సవాల్..హీరో నాగార్జున?

    హైదరాబాద్ మాదాపూర్‌లో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదులు రావటంతో ఇవాళ ఉదయం అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్‌లో మెుత్తం 10 ఎకరాల్లో N కన్వెక్షన్ నిర్మాణం ఉంది. అయతే 29 ఎకరాల్లో ఉన్న తమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించినట్లు ఫిర్యాదులు అందాయి. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్‌ కబ్జా చేసి ఈ కన్వెన్షన్ నిర్మించటంతో హైడ్రా అధికారులు నేలమట్టం …

    Read More »
  • 24 August

    ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై నో టెన్షన్, జీతాలపై కూడా క్లారిటీ వచ్చేసింది!

    ఏపీలో వాలంటీర్లకు శుభవార్త.. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం.శివప్రసాద్ స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేతనాలు రెండు నెలల నుంచి బకాయిలు పడ్డాయని తెలిపారు. ఆ బకాయిల్ని విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపామన్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం ఆమోదించే అవకాశం ఉందని.. వాలంటీర్లలో అత్యధికులు విద్యాధికులు కావడంతో వారిని మరింత ఉన్నత స్థానాల్లో తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు …

    Read More »
  • 24 August

    చంద్రయాన్-3 ప్రయోగానికి ఏడాది.. ఇస్రో కీలక నిర్ణయం

    సరిగ్గా ఏడాది కిందట ఆగస్టు 23న సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా చంద్రయాన్-3ను దింపి భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఏ దేశానికీ సాధ్యం కాని ఘనతను సాధించింది. రెండు వారాల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించిన ల్యాండర్ విక్రమ్.. రోవర్ ప్రజ్ఞాన్‌లు కీలక సమాచారాన్ని సేకరించాయి. ఈ డేటాను విశ్లేషణ కోసం తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది. దక్షిణ ధ్రువంపై శివశక్తి పాయింట్‌ వద్ద ల్యాండర్ దిగి ఏడాది పూర్తయిన సందర్భంగా …

    Read More »
  • 24 August

    మాచర్లలో పిన్నెల్లికి బిగ్ షాక్.. బెయిల్ వచ్చిందన్న ఆనందం కూడా మిగల్లేదుగా!

    మాచర్ల రాజకీయం మరో మలుపు తిరిగింది.. ఊహించినట్లే మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగిరింది. శుక్రవారం మున్సిపాలిటీ నిర్వహించిన అత్యవసర సమావేశంలో 16 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తెలుగు దేశం పార్టీలో చేరారు. మొత్తం 31 మంది కౌన్సిలర్లలో 16 మందితోపాటు, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఓటుతో కలిపి 17కు బలం పెరిగింది. మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నికకు కోరం 16 మంది ఉండటంతో.. టీడీపీ తరఫున ఛైర్మన్‌గా డిప్యూటీ ఛైర్మన్‌ పోలూరి నరసింహారావును ఎన్నుకున్నారు. దీంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరింది. గత వైఎస్సార్‌సీపీ …

    Read More »
  • 24 August

    హడలెత్తిస్తున్న ‘హైడ్రా’.. హీరో నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత

    అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాఫిక్‌గా మారిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఎక్కడా తగ్గటం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్‌ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున …

    Read More »
  • 24 August

    తిరుమలలో విషాదం.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు మృతి

    తిరుమలలో విషాదం జరిగిది.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. అలిపిరి మెట్లదారిలో శ్రీవారి దర్శనానికి నడిచి వెళుతుండగా.. గుండెపోటుతో చనిపోయాడు. నవీన్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.. ఆయనకు 15 రోజుల క్రితం వివాహమైంది. నవీన్ శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చారు.. అక్కడి నుంచి కాలినడకన అలిపిరి మెట్లమార్గంలో తిరుమలకు బయలుదేరారు. నడుకుకుంటూ 2,350వ మెట్టు దగ్గరకు రాగానే.. నవీన్‌ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న భద్రతా సిబ్బందికి …

    Read More »
  • 24 August

    ఏపీలోని మహిళలకు శుభవార్త.. ఉచిత గ్యాస్ పంపిణీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఎన్నో రోజులుగానో ఎదురుచూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తామని ప్రకటించారు. అలాగే ఇల్లు లేని …

    Read More »
  • 24 August

    ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్, ఉత్తర్వులు వచ్చేశాయి

    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ బదిలీలను పాత జిల్లా (ఉమ్మడి) స్థాయిలోనే నిర్వహించనుండగా.. బదిలీలకు అర్హత ఉన్న ఉద్యోగులు ఈ నెల 27లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ బదిలీలను నిర్వహించే విభాగాలు 28న దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుంటాయి.. ఈ నెల 29 నుంచి 30 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, బదిలీ ఆదేశాలు ఇస్తారు. కౌన్సెలింగ్‌ సమయంలో …

    Read More »