TimeLine Layout

August, 2024

  • 24 August

    వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

    దిన ఫలాలు (ఆగస్టు 24, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. మిథున రాశి వారికి ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు డబ్బు చేతికి అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) రోజంతా …

    Read More »
  • 23 August

    తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 

    తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి ఆలయాల్లోని హుండీలలో కానుకలుగా వచ్చిన కెమెరాలను దక్కించుకునే అద్భుత అవకాశం టీటీడీ కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో ఏర్పాటుచేసిన హుండీల ద్వారా భక్తులు ఆ స్వామికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇలా వచ్చిన కెమెరాలను టీటీడీ వేలం వేయనుంది. శ్రీవారికి కానుకలుగా సమర్పించిన ఉపయోగించిన లేదా పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం ఆరు లాట్లను ఆగస్ట్ 28న వేలం వేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్ట్ 28న నిర్వహించే టెండర్ …

    Read More »
  • 23 August

    స్పీకర్ పదవైనా వదిలేస్తా కానీ.. ఈ విషయంలో తగ్గేదే లేదు..

    Ayyanna Patrudu on Narsipatnam RTC Depot land Private Lease issue: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి అయ్యన్న శైలి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఆయన. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ముక్కుసూటితనం, ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం ఆయన స్టైల్. అయితే తాజాగా చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్తున్నా కూడా వినకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని …

    Read More »
  • 23 August

    శ్రీవారి మెట్టు మార్గంలో ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం..

    తిరుమల శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. శ్రీవారిమెట్టు నడక మార్గంలోని 450వ మెట్టు వద్ద ఓ మహిళ, మరో యువకుడు పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ విషయాన్ని గమనించి వెంటనే టీటీడీ సిబ్బందికి తెలియజేశారు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వేగంగా స్పందించి.. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇద్దరినీ కిందకు దించారు. అనంతరం అంబులెన్సులో రుయా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు యత్నించిన జంటను చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. …

    Read More »
  • 23 August

    ఇన్వెస్టర్ల పంట పండింది.. ఒక్కరోజే ఏకంగా 40 శాతం పెరిగిన షేరు.. ఆ ఒక్క కారణంతోనే!

    Multibagger Stocks: మీరు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారా. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కాస్త రిస్క్‌తో కూడుకున్నదని చెబుతుంటారు. అదే సమయంలో మంచి అవగాహనతో.. మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని పెట్టుబడులు పెడితే లాంగ్ టర్మ్‌లో బంపర్ ప్రాఫిట్స్ అందుకోవచ్చని నిపుణులు అంటుంటారు. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇందుకోసం ముఖ్యంగా మార్కెట్లపై అవగాహన పెంచుకోవడం దగ్గర్నుంచి.. ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రకటనలు ఇలా అన్నింటినీ గమనిస్తూ సరైన టైంలో పెట్టుబడి …

    Read More »
  • 23 August

    వైద్యురాలిపై హత్యాచారానికి ముందు ఏం జరిగింది? కీలక విషయాలు గుర్తించిన సీబీఐ

    కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనపై సీబీఐ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆమె సహచర వైద్యులను విచారిస్తోన్న సీబీఐ.. వారికి లై-డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వారు పొంతనలేని వాంగ్మూలాలు ఇవ్వడమే ఇందుకు కారణం. వీరిలో ఓ హౌస్ సర్జన్, ఓ ఇంటెర్న్, ఇద్దరు మొదటి సంవత్సరం పీజీ డాక్టర్లు ఉన్నారు. ఈ నేరంలో వీరి భాగస్వాములైనట్టు కనిపించడం లేదు, కానీ …

    Read More »
  • 23 August

    పబ్లిక్‌లో అలా చేస్తే చుక్కలే.. హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

    ప్రస్తుతం యువత పరిస్థితి ఎలా తయారైందంటే.. ఒక్క పూట తినకుండా అయినా ఉండగలరు కానీ.. సోషల్ మీడియా లేనిదే బతుకు భారమనేలా పరిస్థితి తయారైంది. ఉదయం లేచిన దగ్గర నుంచి నేటి యువత సోషల్ మీడియా వెనుక పరుగులు తీస్తున్నారు. పొద్దున లేచింది మొదలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షార్ట్స్, రీల్స్ అంటూ సెల్‍‌ఫోన్ పట్టుకుని చక్కర్లు కొడుతున్నారు. సరే ఎవరిష్టం వారిది అనుకున్నా.. తమ రీల్స్, షార్ట్స్ లైకుల కోసం మరీ తెగించేస్తున్నారు. ప్రాణాలకు తెగించి రిస్క్ చేసేది కొంతమంది అయితే.. పక్కోడి ప్రాణాలను …

    Read More »
  • 23 August

    కీవ్‌లో అడుగుపెట్టిన భారత ప్రధాని మోదీ.. 

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం(ఆగస్ట్ 23) ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీని కలుకున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం(ఆగస్ట్ 23) ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీని కలుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియం …

    Read More »
  • 23 August

    చిన్నారులతో నిండిపోయిన ఆస్పత్రులు.. బెడ్లు లేక తీవ్ర ఇబ్బందులు

    వర్షాకాలం నేపథ్యంలో.. తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు సీజన్ వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో.. చిన్నారులతో ఆస్పత్రులు నిండిపోయాయి. ఏ ఆస్పత్రి చూసినా.. చిన్నపిల్లలతో వార్డులన్ని నిండిపోయాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి అయిన నీలోఫర్ హాస్పిటల్‌లోని.. ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక పిల్లల తల్లిదండ్రుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓకే బెడ్డుపై ముగ్గురు నలుగురు పిల్లలను వైద్యులు పడుకోబెట్టి వైద్యం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఒకరి జబ్బు ఇంకొకరికి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం …

    Read More »
  • 23 August

    రహస్య వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్

    Kiran Abbavaram Rahasya Gorak కిరణ్ అబ్బవరం, రహస్యల పెళ్లి గురువారం జరిగినట్టుగా తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లి వేడుకలు తనఊర్లో తన బంధువుల సమక్షంలో జరిగినట్టుగా కనిపిస్తోంది. ఈ వేడుకలకు సినీ సెలెబ్రిటీలు ఎక్కువగా హాజరైనట్టు కనిపించడం లేదు.

    Read More »