TimeLine Layout

August, 2024

  • 19 August

    నలుగురి ప్రాణం తీసిన కలుషితాహారం.. రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటన

    అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషితహారం తిని నలుగురు విద్యార్థులు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. చనిపోయినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడిన చంద్రబాబు.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అలాగే చనిపోయిన నలుగురు విద్యార్థుల కుటుంబసభ్యులకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఇప్పటికే హోం మంత్రి …

    Read More »
  • 19 August

    ఇకపై సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్లు.. సిగ్నల్ లేకపోయినా కాల్స్, ఇంటర్నెట్..?

     నేటి ఆధునిక సాంకేతిక యుగంలో.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా మారుతున్న కాలానుగుణంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతోంది. ఈ క్రమంలోనే వివో, జియోమి, హువాయ్‌ వంటి మొబైల్‌ తయారీ సంస్థలు త్వరలో ఎలాంటి నెట్‌వర్క్‌ లేకుండా పనిచేసే మొబైల్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుడు అడవిలో ఉన్నా లేదా పర్వతాలపై ఉన్నా నెట్‌వర్క్‌ అవసరం లేదు. ఎలాంటి నెట్‌వర్క్‌ లేకుండానే కాలింగ్, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ కంపెనీలు తన నెక్ట్స్‌ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ గ్యాడ్జెట్ శాటిలైట్ ఆధారిత …

    Read More »
  • 19 August

    కోల్‌కతా ఘటనలో తెలంగాణ తరహా న్యాయం చేయాలని డిమాండ్.. దటీజ్ కేసీఆర్: కేటీఆర్

    కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యంత అమానుష ఘటనపై దేశమంతా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో న్యాయం చేయాలంటూ.. వైద్య విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా ఘటనలో తెలంగాణ తరహా న్యాయం చేయాలని.. మిగతా రాష్ట్రాల వైద్య విద్యార్థులు డిమాండ్ …

    Read More »
  • 19 August

    ఏపీలోకి ఫాక్స్‌కాన్!.. నారా లోకేష్‌తో సంస్థ ప్రతినిధుల చర్చలు

    ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీ మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో.. ఆయనను కలిసి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. భేటీ సందర్భంగా ఏపీలో ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్‌కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా …

    Read More »
  • 19 August

    గంజాయికి అవకాడోతో చెక్.. ఎకరాలో పండిస్తే ఇంత లాభమా? ఐడియా అదిరింది గురూ

    మన్యం ప్రాంతాలలో ఎక్కువగా ఇబ్బందులు పెట్టే సమస్యలు.. ఒకటి మావోయిస్టులు.. రెండు గంజాయి. ఇక విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా సహా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయిని అక్రమంగా సాగు చేస్తుంటారు. పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేస్తున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అయితే ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం గంజాయి మహమ్మారిని అరికట్టడానికి కీలక చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే గంజాయి సాగు నుంచి మన్యం ప్రాంతాల వాసులను మళ్లించేందుకు …

    Read More »
  • 19 August

    రోడ్డుపై సింపుల్‌గా నడిచెళ్లిపోయిన అల్లు అర్జున్.. ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్

    మెగా Vs అల్లు వివాదం మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్ మాములుగా లేదు. ఎక్కడ ఏ చిన్న ట్రోలింగ్ మెటీరియల్ దొరికినా అసలు వదలడం లేదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి సంబంధించిన ఓ వీడియోను మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఓ లుక్కేద్దాం. పట్టించుకోలేదంటూ ట్రోలింగ్ ఈ వీడియోలో అల్లు అర్జున్ సింపుల్‌గా టీషర్ట్, షార్ట్ వేసుకొని వీధిలో రోడ్డుపై నడిచెళ్లిపోతున్నారు. చుట్టూ బౌన్సర్లు కానీ క్యారవాన్ కానీ ఏం లేదు. అయితే అటుగా …

    Read More »
  • 19 August

    శరవేగంగా దూసుకొస్తున్న అంబానీ.. కొడుకుల పేరుతో కొత్త వ్యాపారం.. పీఎం స్కీమ్ మెయిన్ టార్గెట్!

    Anil Ambani Sons: భారత్ సహా ప్రపంచంలోని అత్యంత కుబేరుల్లో రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ.. ఒకప్పుడు ముందు వరుసలో ఉండేవారు. ప్రస్తుత భారత కుబేరుడు, ఈయన సోదరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూడా అనిల్ వెనుకే ఉండేవారు. అయితే కాలం వేగంగా కదిలింది. పరిస్థితి మారిపోయింది. తన వ్యాపారాల్ని అలాగే మరింత విస్తరించే క్రమంలో అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోయారు. ఆయనకు చెందిన పలు కంపెనీలు దివాలా పరిస్థితికి పతనమయ్యాయి. దీంతో ఆయా కంపెనీల షేర్లు పడిపోవడం సహా …

    Read More »
  • 19 August

    Gold Loans: చీపెస్ట్ గోల్డ్ లోన్స్.. ఏ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా దేంట్లో ఎంతంటే?

    HDFC Bank Gold Loan: మనకు ఏదో ఒక సమయంలో కాస్త పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది. అప్పుడు స్నేహితులు, బంధువుల దగ్గర అందుబాటులో లేకుంటే ఇక బ్యాంక్ లోన్ల కోసం అప్లై చేస్తుంటారు. ఇందులో పర్సనల్ లోన్ వంటి వాటికైతే చాలా డాక్యుమెంట్లు కావాలి. మంచి సిబిల్ స్కోరు ఉండాలి. ఇంకా ఇది అన్ సెక్యుర్డ్ లోన్. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా సురక్షిత లోన్ అంటే గోల్డ్ లోన్లు అని చెప్పొచ్చు. ఇక్కడ బంగారం తాకట్టుగా …

    Read More »
  • 19 August

     శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆర్జిత సేవా టికెట్లు విడుదల

    తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు లక్కీ డిఫ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారణ సేవా టికెట్ల విడుదల చేస్తామని …

    Read More »
  • 19 August

    SSY Calculator: ఈ స్కీంలో పెట్టుబడితో ఆడబిడ్డ భవిష్యత్తుకు భరోసా.. ఎలా చేరాలి.. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి?

    SSY Documents Required: మీరు సంపాదించిన దాంట్లో ఏమైనా పొదుపు చేస్తున్నారా.. దీనిని పెట్టుబడుల రూపంలోకి మళ్లించి డబ్బు సృష్టిస్తున్నారా. లేకపోతే ఇప్పటినుంచే అలవర్చుకోవడం మంచిది. అప్పుడే మలివయసులో, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా హాయి జీవితం గడపొచ్చు. ఇంకా మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఇబ్బందులు లేకుండా ఉండేందుకు.. ఆడపిల్లకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఒక గొప్ప పథకం తీసుకొచ్చింది. అదే సుకన్య సమృద్ధి …

    Read More »