దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై ఈ నెల 8 వ తేదీన జరిగిన రేప్, మర్డర్ ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా సీరియస్ అయింది. ఇక ఈ హత్యాచార ఘటనపై ఆ రాష్ట్రంలో మొదలైన ఆందోళనలు, నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం అర్ధరాత్రి ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ …
Read More »TimeLine Layout
August, 2024
-
16 August
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో ఏడాది ఉచితం, ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు వసతి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, హెచ్‌వోడీ, అసెంబ్లీ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి కొనసాగిస్తున్నారు. తాజాగా హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి పొడిగించారు.. 2025 జూన్ 26 వరకు ఉచిత వసతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. ఉచిత వసతి పొడిగించినందుకు ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. …
Read More » -
16 August
‘రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడబోయే’.. హరీష్ టార్గెట్‌గా ఫ్లెక్సీలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట కొందరు ఈఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హరీశ్ రావు రాజీనామాకు వారు డిమాండ్ చేశారు. ‘దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు …
Read More » -
16 August
శ్రీకాకుళం: చిన్న చేప ముల్లు మత్స్యకారుడి ప్రాణాలు తీసింది.. ఇలా కూడా జరుగుతుందా!
చిన్న చేప ముల్లుకు ఓ నిండు ప్రాణం బలైంది. కుటుంబ పోషణ కోసం పొరుగు రాష్ట్రానికి వెళితే.. ఊహించని ఘటనతో ప్రాణాలే పోయాయి.. ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం రూరల్ మండలం నర్సయ్యపేటకు చెందిన కొమర పోలీసు అనే మత్స్యకారుడికి రేవతి అనే మహిళతో వివాహమైంది.. ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసుకు స్థానికంగా ఉపాధి లేకుండా పోయింది.. దీంతో ఉపాధి కోసం తన తండ్రి అవతారంతో కలిసి గత నెల 28న కర్ణాటక రాష్ట్రం మంగుళూరు వలస వెళ్లాడు. అక్కడ పోలీసుకు …
Read More » -
16 August
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం, జాగ్రత్తగా ఉండండి
హైదరాబాద్ నగరవాసులకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. కాసేపట్లో నగరంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత, లేదా రాత్రికి నగరంలో భారీ వర్షానికి ఛాన్స్ ఉందన్నారు. మధ్యాహ్నం వరకు వాతావరణం చాలా తేమగా ఉంటుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా క్యుములోనింబస్ తుఫానులు వస్తాయని హెచ్చరిచారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఉత్తర తెలంగాణలోనూ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, …
Read More » -
16 August
Tax Deductions: తెలుగు రాష్ట్రాల్లోని వారిపై ఐటీ శాఖ గుర్రు.. నోటీసులు, పెనాల్టీ.. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఇలా చేస్తున్నారా?
Tax Notices: ఆర్థిక వ్యవస్థలో పన్ను అనేది చాలా కీలకం. పరిమితికి మించి ఆదాయం ఉన్నట్లయితే వారు ఆదాయపు పన్ను చట్టం కింద టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. దీనికి ఆదాయాన్ని బట్టి నిర్దిష్ట శ్లాబ్స్ ఉంటాయి. దాని ప్రకారం అంత శాతం మేర పన్ను కట్టాలి. అయితే ఈ పన్ను తగ్గించుకునేందుకు కొన్ని పెట్టుబడులపై టాక్స్ మినహాయించుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఇదే అదునుగా కొందరు తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టడం లేదా సరైన వివరాలు సమర్పించకుండా టాక్స్ క్లెయిమ్ చేస్తుంటారు. తప్పుడు టాక్స్ డిడక్షన్ (తగ్గింపు) …
Read More » -
16 August
జనసేన పార్టీకి షాక్.. ఐదు రోజుల్లోనే మళ్లీ వాళ్లిద్దరు వైసీపీలో చేరారు
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీల్లోకి చేరికలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంపింగ్స్ నడుస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.. వైఎస్సార్‌సీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన నేతలు.. ఐదు రోజులకే తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంల జంపపాలెం ఎంపీటీసీ శిలపరశెట్టి ఉమ యలమంచిలి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా ఉన్నారు. ఈ నెల 8న ఉమ మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో యలమంచిలి ఎమ్మెల్యే …
Read More » -
16 August
Reliance Share: అంబానీ కంపెనీ అదుర్స్.. అప్పుడు వందల కోట్ల నష్టం.. ఇప్పుడు సీన్ రివర్స్.. దూసుకెళ్తున్న స్టాక్!
Reliance Power Shares: దిగ్గజ పారిశ్రామిక వేత్త, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నుంచి చాలానే స్టాక్స్ ఉన్నాయి. అయితే ఇవి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. తర్వాత అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోవడంతో దాదాపు చాలా కంపెనీలు దివాలా స్థాయికి కూడా పడిపోయాయి. బ్యాంకులకు అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తన దగ్గర సంపదేం లేదని ఆయన కూడా చేతులెత్తేశారు. దీంతో ఆయా స్టాక్స్ పడిపోయాయి. కానీ కొంతకాలంగా పరిస్థితి మారిపోతోంది. ఆయన కంపెనీలు క్రమక్రమంగా కోలుకుంటున్నాయి. వ్యాపారాలు మెరుగుపడుతున్నాయి. అంబానీ …
Read More » -
16 August
జమ్మూ కశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడే షెడ్యూల్
మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు మీడియాను సమావేశానికి ఆహ్వానించింది. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 30లోగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో మిగతా మూడు రాష్ట్రాలతో పాటు కశ్మీర్‌లోనూ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక, హరియాణా అసెంబ్లీకి నవంబరు 3తోనూ.. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు …
Read More » -
16 August
సత్తెనపల్లి: ఏడేళ్ల చిన్నారి వరల్డ్ రికార్డులు.. అనారోగ్యం వెంటాడుతున్నా సరే, హ్యాట్సాఫ్
ఏడేళ్ల బాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా స్కూల్‌కు వెళుతూ అరుదైన ఘనతను దక్కించుకుంది.. సరికొత్త రికార్డుల్ని అందుకుంది. ఐదున్నర నెలలకే పుట్టి.. మూడున్నరేళ్ల వయసు వరకు ఒక గదిలోనే చికిత్స తీసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తాన్‌వలి కారు డ్రైవర్ కాగా.. కేరళకు చెందిన షీబాను వివాహం చేసుకున్నారు. షీబా 2017లో గర్భం దాల్చిన ఐదో నెలలోనే అయత్ ఇశ్రాయెల్ జిబ్రిల్ అనే పాపకు జన్మనిచ్చారు. పుట్టినప్పుడు బిడ్డ బరువు 500 గ్రాములే ఉండటం, అవయవాలు పూర్తిగా రూపుదాల్చలేదు. …
Read More »