TimeLine Layout

August, 2024

  • 16 August

    విజయవంతంగా నింగిలోకి చేరిన ఈవోఎస్-8.. ఇస్రో ప్రయోగం సక్సెస్

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌ మొదటి లాంచింగ్ ప్యాడ్ నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-8 (EOS-08)ను చిన్నపాటి ఉపగ్రహ వాహన నౌక ఎఎస్ఎస్ఎల్వీ-డీ3 శుక్రవారం ఉదయం ప్రయోగించారు. ఆరున్నర గంటల కౌంట్ డౌన్ అనంతరం ఉదయం 9.17 గంటలకు బయలుదేరిన రాకెట్.. 17 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న …

    Read More »
  • 16 August

    రూపాయి స్టాక్ అద్భుతం.. లక్షను రూ. 90 లక్షలు చేసింది.. నాలుగేళ్లలోనే దశ తిరిగిపోయింది..!

    Penny Multibagger Stocks: దలాల్ స్ట్రీట్‌లో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించే స్టాక్స్ ఎన్నో ఉంటాయని చెప్పొచ్చు. వీటిని కనిపెట్టడమే కాస్త కష్టం. అయితే మార్కెట్లను రెగ్యులర్‌గా జాగ్రత్తగా గమనిస్తూ.. ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయా కంపెనీల పనితీరు, ప్రకటనలు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రణాళికలు ఇలా అన్నింటినీ పరిశీలిస్తుండాలి. అప్పుడు నిపుణుల సలహాతో పెట్టుబడి పెట్టాలి. దీంతో లాంగ్ రన్‌లో మంచి లాభాలు అందుకునే అవకాశాలు …

    Read More »
  • 16 August

    14 వేల మంది ఆదివాసీ చిన్నారులతో జాతీయ గీతాలాపన.. గిన్నిస్ రికార్డుల్లోకి భారతీయుడి ఆర్కెస్ట్రా

    ప్రపంచ ప్రముఖ సంగీత దర్శకుడు, మూడుసార్లు గ్రామీ విజేత రిక్కీ కేజ్‌ (Ricky Kej).. స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొని అద్భుతమైన వీడియోను రూపొందించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా సహా సంగీత దిగ్గజాల సహకారంతో భారత జాతీయగీతం జనగణమనను (National Anthem) వైవిధ్యభరితంగా ఆలపించారు. బ్రిటిష్‌ ఆర్కెస్ట్రా, 14వేల మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించిన ఈ గీతాలాపన.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను రిక్కీ కేజ్‌ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్‌ చేశారు. పండిట్ హరిప్రసాద్‌ …

    Read More »
  • 16 August

    ఢిల్లీకి చంద్రబాబు.. హడావిడిగా వెళ్తున్న ఏపీ సీఎం, రేవంత్ కూడా హస్తినలోనే.. ఎందుకంటే!

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజుల పాటూ ఆయన హస్తినలో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళతారు.. 16, 17న అక్కడే ఉంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటూ పలువుర్ని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుకు …

    Read More »
  • 16 August

    అన్న క్యాంటీన్లకు ప్రతి ఏటా రూ.కోటి ఇస్తానన్న ప్రముఖ వ్యాపారి.. ఆయనకు రూ.100 కోట్లు ఆదాయం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో సంపద ఉన్నవారు అట్టడుగున ఉన్న వారికి సాయం చేసి సమానంగా తీసుకు రావాలని చంద్రబాబు సూచించారు. అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు విరాళాలు అందజేయాలని కోరారు.. వీరి కోసం ప్రత్యేకంగా అకౌంట్ నంబర్ ప్రారంభించారు. ఎస్‌బీఐ ఖాతా నంబరు 37818165097, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0020541కు అందించాలన్నారు. వెబ్‌సైట్‌ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చన్నారు. అన్న క్యాంటీన్ల కోసం …

    Read More »
  • 16 August

    మాజీ మంత్రి రోజాకు చిక్కులు.. రంగంలోకి సీఐడీ, ఆ మాజీ మంత్రి కూడా!

    మాజీ మంత్రి రోజా చిక్కుల్లో పడ్డారు.. గత వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. సీఐడీకి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్‌ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలయ్యాయి. ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యపాట్య సంస్థ సీఈవో ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై చర్యలు …

    Read More »
  • 16 August

    వారు ఉద్యోగ సమస్యలు పరిష్కరించుకుంటారు..12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

    దిన ఫలాలు (ఆగస్టు 16, 2024): మేష రాశి వారికి ఈ రోజు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. మిథున రాశి వారు ఆశించిన శుభవార్తలు వింటారు. ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) సమయం బాగా అనుకూలంగా …

    Read More »
  • 15 August

    లోపల చేయి పెట్టి వేసిన స్టెప్పు.. ట్రోలింగ్ మీద హరీష్ శంకర్ రియాక్షన్

    మిస్టర్ బచ్చన్ సినిమాకు సోషల్ మీడియాలో వస్తోన్న రెస్పాన్స్ గురించి అందరికీ తెలిసిందే. హరీష్ శంకర్ తీసిన వాటిల్లో అత్యంత చెత్త సినిమా ఇదే అవుతుందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. బయట కనిపిస్తే కొట్టేస్తామంటూ పబ్లిక్ టాక్‌లో రవితేజ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రవితేజ ఎనర్జీ వరకు సినిమా ఓకే అని సరిపెట్టుకునే ఫ్యాన్స్ సైతం మిస్టర్ బచ్చన్ విషయంలో పెదవి విరుస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఇలా ఎలా తీశావ్ అంటూ హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ …

    Read More »
  • 15 August

    ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు రంగంలోకి యాంటీ నక్సల్ స్పెషలిస్ట్.. జమ్ముకశ్మీర్ డీజీపీగా ఏపీ క్యాడర్ ఐపీఎస్

    జమ్మూకశ్మీర్‌ శాంతి భద్రతలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో ఉగ్రదాడులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల దాడులను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్ స్పెషల్ డీజీగా నియమించింది. సెప్టెంబర్ 30వ తేదీ ప్రస్తుతం డీజీగా ఉన్న ఆర్ఆర్ స్వైన్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన రిటైర్‌మెంట్ తర్వాత నళిన్ ప్రభాత్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. …

    Read More »
  • 15 August

    తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ టోకెన్లు పెంచే ఆలోచనలో టీటీడీ..

    కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అలా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ నిత్యం కృషి చేస్తూ ఉంటుంది. అయితే రద్దీ వేళల్లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. ఈ సమయాన్ని తగ్గించేందుకు కూడా టీటీడీ చర్యలు ప్రారంభించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఉద్యోగులను …

    Read More »