TimeLine Layout

August, 2024

  • 12 August

    కవిత బెయిల్ పిటిషన్.. ఈడీ, సీబీఐలకు సుప్రీం నోటీసులు

    దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 9న బెయిల్ కోరుతూ ఆమె తరుపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఈ మేరకు …

    Read More »
  • 12 August

    ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓటమి.. విద్యార్థులను చితకబాదిన పీఈటీ.. వైరల్ వీడియో

    ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోయారని విద్యార్థులపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్.. వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యార్థులను ఇష్టమొచ్చినట్టు కాళ్లతో తన్ని, జుట్టుపట్టుకుని ఈడ్చిపడేసి చెప్పు తీసుకుని కొట్టాడు. దారుణమైన ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు సమీపంలో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడిన సదరు పీఈటీని విధుల నుంచి సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి …

    Read More »
  • 12 August

    రైల్వేశాఖ మరో జాబ్ నోటిఫికేషన్‌ విడుదల.. 1376 ఉద్యోగాల భర్తీకి ప్రకటన

     రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. భర్తీ చేసే ఆర్‌ఆర్‌బీ రీజియన్లు ఇవే : అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పూర్, …

    Read More »
  • 12 August

    రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2.74లక్షల మంది రైతులకు బీమా..!

    రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు బీమా పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎల్‌ఐసీ కింద ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించింది. ఈ ఏడాది ప్రీమియం ఎంత చెల్లించాలనేది త్వరలో ఖరారు కానుంది. రైతు బీమా పథకం ద్వారా రైతులు సహజంగా, లేదా ఏ విధంగానైనా మరణిస్తే, సదరు రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల …

    Read More »
  • 12 August

    మంటల్లో జపోరిజియా అణువిద్యుత్ ప్లాంట్‌.. అంతర్జాతీయ సమాజం ఆందోళన

    ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కర్మాగారంలో మంటలు చెలరేగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన‌ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉంది. దీనిపై రష్యా, ఉక్రెయిన్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రష్యా సైన్యమే ఈ పేలుళ్లకు పాల్పడినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. కీవ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి ఈ చర్యకు తెగబడ్డారని ఆయన మండిపడ్డారు. అటు, ఉక్రెయిన్‌ దళాలు ప్రయోగించిన శతఘ్నుల వల్లే మంటలు వ్యాపించాయని మాస్కో ప్రత్యారోపణలు చేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ …

    Read More »
  • 12 August

    ఎస్బీఐ నుంచి కొత్త స్కీమ్.. ఒక్కరోజే ఛాన్స్.. కనీసం రూ. 500 పెట్టుబడితో షురూ..

    పెట్టుబడులు పెట్టేందుకు చాలానే ఆప్షన్లు ఉంటాయి. స్టాక్ మార్కెట్లు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఇలా చాలా ఉంటాయి. అయినప్పటికీ.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులపైనా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. స్టాక్ మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తుంటారు. ఇక్కడ సిప్ అంటే నెలనెలా కొంత మొత్తం పెట్టుబడి ద్వారా మంచి రిటర్న్స్ అందుకుంటారు. ముఖ్యంగా కాంపౌండింగ్ (చక్రవడ్డీ) కారణంగా దీంట్లో అసలు పెట్టుబడికి ఎన్నో …

    Read More »
  • 12 August

    దిగ్గజ సంస్థ దివాలా.. కుప్పకూలుతున్న షేర్లు.. ఒక్కరోజులోనే 20 శాతం పతనం.. ఇన్వెస్టర్లకు భారీ నష్టం!

    Coffee Day Shares: కేఫ్ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఇటీవల జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ కేఫ్ కాఫీ డే పేరిట రిటైల్ చైన్ నిర్వహిస్తోంది. కేఫ్ కాఫీ డే.. రూ. 228.45 కోట్లు చెల్లించడంలో విఫలమైందని ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ ఒక పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్ ఇలా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కంపెనీ అప్పుల్లో …

    Read More »
  • 12 August

    కష్టకాలంలో షేక్ హసీనాకు సాయం.. కేంద్రంపై శశిథరూర్ ప్రశంసలు

    కష్ట సమయంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఓ స్నేహితుడిగా ఆమెకు భారత్ సహయం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి..బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై జాతీయ మీడియాతో తిరువనంతపురం ఎంపీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో అధికార మార్పిడి విషయంలో భారత్ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం …

    Read More »
  • 12 August

    చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ భేటీ.. ఆ లెటర్లను ఓకే చేయాలని స్పెషల్ రిక్వెస్ట్

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కలిశఆరు. ఈ మేరకు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.. తాను ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వంగా కలిశానని.. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వినతి అందించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని స్పీకర్ ప్రసాద్ చంద్రబాబును కోరారు. దైవ దర్శనం …

    Read More »
  • 12 August

    మార్కెట్లు పడుతున్నా అదరగొడుతున్న ఓలా.. మళ్లీ ఒక్కరోజే 20 శాతం పెరిగిన షేరు.. కాసుల పంట!

    Stock Market Live Updates: సెబీ ఛైర్‌పర్సన్ మాధబి బచ్, ఆమె భర్తపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన షేర్ల విలువల్ని కృత్రిమంగా పెంచేందుకు దోహదపడిన అంతర్జాతీయ ఫండ్లలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఛైర్‌పర్సన్ దంపతులకు వాటాలున్నాయని ఈ సంస్థ ఆరోపించింది. వీటిని ఇరువురూ ఖండించారు. ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. అయినప్పటికీ హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. సూచీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సోమవారం సెషన్ …

    Read More »