TimeLine Layout

August, 2024

  • 12 August

    మంత్రి నారా లోకేష్ పేరుతో డబ్బుల కావాలని మెసేజ్.. పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

    ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోటోతో గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేసే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు లోకేష్ ఫోటోను వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకుని డబ్బులు అడుగుతున్నారని టీడీపీ నేత బెజవాడ నజీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఓ మొబైల్ వాట్సాప్‌కు మంత్రి నారా లోకేష్ ప్రొఫైల్ పిక్‌గా ఉంది.. శుక్రవారం విజయవాడలోని పటమటకు చెందిన ఆర్‌.వేణుకు ఆ వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లో తనను నారా …

    Read More »
  • 12 August

    గ్రేటర్ హైదరాబాద్‌లో డెంగీ డేంజర్ బెల్స్.. భారీగా కేసులు, ఈ జాగ్రత్తలు తీసుకోండి

    ప్రస్తుతం వర్షాకాలం కావటంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దానికి తోడు డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. డెంగీ జ్వరాల కారణంగా చాలా మందిలో ఒక్కసారిగా ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయి. దీంతో ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్స్‌లో చేరుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్ వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటికే 600లకు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రైవేటు హాస్పిటల్స్‌లోనూ పలువురు డెంగీ జ్వరాలతో జాయిన్ అవుతుండగా.. వారి …

    Read More »
  • 12 August

    వరుడి ఘనకార్యంతో చివరి నిమిషంలో ఆగిన పెళ్లి.. ఇదేం ట్విస్ట్ బాసూ!

    కళ్యాణ మండపంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు.. బంధువులు, స్నేహితలతో సందడి వాతావరణం కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో కొత్త జంట ఒక్కటి కాబోతోంది.. ఇంతలో ఊహించని పరిణామం కనిపించింది. ఓ యువతి కళ్యాణ మండపంలోకి దూసుకొచ్చింది.. నేరుగా వరుడి దగ్గరకు వెళ్లింది. ఆెమ దగ్గర మారణాయుధం చూసి అందరూ అవాక్కయ్యారు.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ బయటపడింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని నందలూరులో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. రైల్వేకోడూరుకు చెందిన సయ్యద్‌ బాషాకు.. తిరుపతికి చెందిన జయ …

    Read More »
  • 12 August

    ఆలయ శ్రావణమాస వేడుకలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి

    బిహార్‌లోని ఓ ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుని.. ఏడుగురు భక్తులు మృతిచెందారు. ఆదివారం అర్ధరాత్రి జెహానాబాద్‌ పట్టణం మఖ్దుంపూర్‌‌లోని బర్వావర్‌ కొండపై ఉన్న బాబా సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడినవారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని సహాయక …

    Read More »
  • 12 August

    విజయవాడ దుర్గమ్మ భక్తులకు అదిరే ఆఫర్.. ఉచితంగానే, వెంటనే దరఖాస్తు చేస్కోండి

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. ఈనెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించబోతున్నట్లు ఆలయ ఈవో రామరావు తెలిపారు. ఆ రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆర్జిత సేవ టికెట్‌ రూ.1500తో కొన్న వారికి వ్రతం నిర్వహిస్తారన్నారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు తెల్ల రేషను కార్డు కలిగి ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత వరలక్ష్మీ వ్రతాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తుమన్నారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతానికి బ్యాచ్‌కు 500 మందికి మాత్రమే అనుమతి …

    Read More »
  • 12 August

    స్వింగ్‌ స్టేట్స్‌లో కమలా హ్యారిస్ దూకుడు.. పోల్ సర్వేల్లో ట్రంప్‌పై ఆధిక్యం

    గతంలో ఎన్నడూలేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వం నుంచి అనూహ్యంగా జో బైడెన్ తప్పుకోవడం.. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీకి వచ్చారు. ఆగస్టు 19న జరిగే డెమొక్రాటిక్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కమలా పేరును లాంఛనంగా ప్రకటించున్నారు. ఎన్నికలకు మరో మూడు నెలలే సమయం ఉండగా.. డెమొక్రాట్లకు అన్నీ శుభశకునాలే ఎదురవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పోల్‌ సర్వేల్లో రిపబ్లికన్ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్‌ …

    Read More »
  • 12 August

    వరుసగా పెరిగి ఒక్కసారిగా ఇలా.. లేటెస్ట్ బంగారం, వెండి ధరలివే.. తులం గోల్డ్ ఎంతంటే?

    Hyderabad Gold Rates: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా భారత మహిళలు బంగారు ఆభరణాల్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఎక్కువగా పండగలు, ఇతర శుభకార్యాలు, వేడుకల సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ సమయాల్లో కొనుగోలు చేసి ధరిస్తుంటారు. దీంతో డిమాండ్ కూడా అప్పుడు భారీగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో మాత్రం ఈ డిమాండ్‌తో పెద్దగా పని లేకుండానే ఇతర కొన్ని కారణాలతో గోల్డ్ రేట్లలో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంతకుముందు …

    Read More »
  • 12 August

    ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ఇదే!

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్పు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్క‌డ సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లను డీడీవోగా ఇవ్వాలని ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ట్లు సమాచారం. గ్రామ సంక్షేమ కార్యాల‌యంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, జాబితాను తయారీని ఎటువంటి రాజకీయం ఒత్తిడి …

    Read More »
  • 12 August

    తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త.. క్యూలైన్‌లలో ఆ సమస్యకు చెక్, నో టెన్షన్

    తిరుమలలో భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై రింగురోడ్డులో సర్వదర్శనం క్యూలైన్ల నిర్మాణం వేగవంతం అయ్యింది. తిరుమలలో గత ఐదారునెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయిన భక్తులను రింగురోడ్డు మీదుగా ఆక్టోపస్‌ భవనం వరకు నిర్మించిన తాత్కాలిక క్యూలైన్లలో పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఫ్యాన్‌లు, లైట్లు లేకపోవడం, వర్షం పడితే భక్తులు తడిసిపోతుండటం, మార్గంలో తాత్కాలిక మరుగుదొడ్లు సరిపోవడం లేదు. అందుకే టీటీడీ శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్ల నిర్మాణం …

    Read More »
  • 12 August

    టీటీడీకి పంజాబ్ కంపెనీ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?

    Punjab Company donates 21 crore to TTD Trust: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ)కు భారీ విరాళం అందింది. పంజాబ్‌కు చెందిన ఓ కంపెనీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందించింది. ఏకంగా 21 కోట్ల రూపాయలను ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది పంజాబ్‌కు చెందిన ట్రైడెంట్ గ్రూప్. ఈ సంస్థకు చెందిన రాజిందర్ గుప్తా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి ఈ విరాళం తాలూకు చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వారిని అభినందించారు. …

    Read More »