పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ చేరిన వినేష్ ఫొగాట్ స్వర్ణ పతకం సాధిస్తుందని అంతా భావించారు. 50 కేజీల మహిళ రెజ్లింగ్ విభాగంలో పాల్గొన్న ఆమె ఫైనల్ మ్యాచ్‌కు ముందు కొన్ని గ్రాముల బరువు ఎక్కువ ఉన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది. దీంతో ఆమె ఫైనల్ ఆడకుండా అనర్హత వేటు విధించింది. దీంతో 140 కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురయ్యారు. భారత క్రీడాలోకం మొత్తం వినేష్ ఫొగాట్‌కు మద్దతు ప్రకటించారు. రౌండ్ 16, క్వారర్స్, సెమీఫైనల్ మ్యాచ్‌లకు ముందు వినేష్ ఫొగాట్ బరువు …
Read More »TimeLine Layout
August, 2024
-
7 August
భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం.. 27 ఏళ్ల తర్వాత సిరీస్ కోల్పోయిన భారత్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ కాంబోలో ఆడిన తొలి వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన ఈ వన్డే సిరీస్‌లో 0-2తో భారత్ ఓడిపోయింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 110 రన్స్ తేడాతో టీమిండియాను ఓడించింది. బ్యాటర్ల వైఫల్యంతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత్ గెలవలేకపోయింది. అయితే ఈ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లో …
Read More » -
7 August
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఇక ఆ నిబంధన తొలగించిన సర్కార్
Local Body Elections: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హత అనే నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఎంతో మందికి స్థానిక …
Read More » -
7 August
ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్.. స్మార్ట్‌టీవీలు, Apple iPhone, Google, Samsung ఫోన్లపై భారీ డిస్కౌంట్‌లు
Flipkart Flagship Sale 2024 : స్వాతంత్య్రదినోత్సవం 2024 సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్లాగ్‌షిప్ సేల్’ తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని లైవ్ మైక్రోసైట్ ప్రకారం.. ఫ్లాగ్‌షిప్ సేల్ ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు ఈ Flagship Sale ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వివరాల్లోకెళ్తే.. ఈ సేల్‌లో భాగంగా ఫ్యాషన్ ఉత్పత్తులపై …
Read More » -
7 August
ఏపీలో అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ.. తక్కువ ధరకే లిక్కర్
AP Cabinet: ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలు కానుంది. అక్టోబర్ 1 వ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని అమలు చేయనున్నట్లు.. ఏపీ కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఇక ఇదే మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రి వివరించారు. కొత్త మద్యం పాలసీ, క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ.. జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను …
Read More » -
7 August
పలాసలో వింత దొంగలు.. ప్రభుత్వ ఆఫీస్‌లో ఇదేం పని, ఏం చేశారో తెలిస్తే!
శ్రీకాకుళం జిల్లా పలాసలో విచిత్రమైన ఘటన జరిగింది. స్థానిక గ్రామీణ నీటిపారుదల విభాగం పాత కార్యాలయంలో చోరీ కలకలంరేపింది. ఈ దొంగతనంలో పలు ఫైల్స్ చోరీకి గురైనట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ కార్యాలయం వెనుక ఉండే కిటికీ తొలగించిన దొంగలు.. లోపలికి చొరబడ్డారు. దస్త్రాలను మూటలు కట్టి తుక్కు షాపులో దొంగలు అమ్మేసినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా స్క్రాప్ షాప్‌లోని మూటలను గుర్తించారు. ఈ విషయం ఇంజినీరింగ్ అధికారులకు తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి అధికారులు …
Read More » -
7 August
రూపే క్రెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త.. మరిన్ని రివార్డ్ పాయింట్లు.. యూపీఐ లావాదేవీలపైనా..!
Rupay Credit Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీగా పెరిగాయి. అందులో యూపీఐ ట్రాన్సాక్షన్ల వాటానే అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ పేమెంట్లు చేసేందుకు రూపే క్రెడిట్ కార్డులకు అవకాశం కల్పించింది కేంద్రం. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు ఎన్‌పీసీఐ కీలక సూచన చేసింది. ఇతర కార్డు లావాదేవీలపై అందించే రివార్డు పాయింట్లు, ఇతర బెనిఫిట్స్ రూపే క్రెడిట్ కార్డులకు అందించాలని స్పష్టం చేసింది. …
Read More » -
7 August
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సడెన్ షాక్.. వడ్డీ రేట్లు పెంపు.. ఇక ఎక్కువ కట్టాల్సిందే!
HDFC Bank Hikes MCLR Rate: ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షాకింగ్ ప్రకటన చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ పెంచిన లోన్ రేట్లు ఆగస్ట్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన కొన్ని టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ పెరిగినట్లు తెలిపింది. సవరించిన తర్వాత బ్యాంకులో ఎంసీఎల్ఆర్ రేట్ల శ్రేణి 9.10 …
Read More » -
7 August
Vizag News: పింఛన్ డబ్బులు నాకొద్దు బాబోయ్ అంటున్న వృద్ధురాలు.. కారణం తెలిస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు
సాధారణంగా ఒకటి తేదీ వచ్చిందంటే వృద్ధులు పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఆమె మాత్రం అందుకు భిన్నం.. తనకు పింఛన్ డబ్బులు వద్దంటోంది. అనకాపల్లి జిల్లాలో విచిత్రం జరిగింది.. ఓ వృద్ధురాలు రెండు నెలలుగా పింఛన్ తీసుకోవం లేదు. పింఛన్ డబ్బుల నాకొద్దు బాబోయ్ అంటూ సచివాలయ సిబ్బందిని పంపించేస్తోంది. ఆమె ఎందుకు ఇలా పింఛన్ డబ్బులు వద్దని చెబుతోందని ఆరా తీస్తే విచిత్రమైన కారణం తెలిసింది. చోడవరం బుక్కా వీధిలో నివాసం ఉంటున్న వృద్ధురాలు కోట్ల కాంతంకు వృద్దాప్య పింఛన్ …
Read More » -
7 August
మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి 8500 కోట్ల ఫైన్ వసూలు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
Bank Account: బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు ఉన్నట్లయితే వాటిల్లో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలని సూచిస్తుంటారు. ఒక వేళ బ్యాంక్ రూల్స్ ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ లేనట్లయితే పెనాల్టీలు విధిస్తారు. అయితే కొన్ని బ్యాంకు ఖాతాలకు మినహాయింపు ఉంటుంది. కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ వంటి దిగ్గజ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్ల నుంచి ఏకంగా రూ.8500 కోట్లు వసూలు చేశాయట. ఈ అంశంపై రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ క్లారిటీ …
Read More »