TimeLine Layout

August, 2024

  • 7 August

    ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్.. వినేష్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు, పతకం లేకుండానే!

    పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. సెమీ ఫైనల్‌లో గెలిచి నాలుగో పతకం ఖాయం చేసిన వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో పతకం ఖాయమనుకున్న భారత్‌కు షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు బరువు కొలవగా.. 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల ఫైనల్‌ …

    Read More »
  • 7 August

    మహిళల కోసం కేంద్రం స్కీమ్.. గతేడాదే తెచ్చింది.. అంతలోనే షాకింగ్ ప్రకటన.. ఇక కష్టమే!

     మహిళా ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు.. వారిలో ఆర్థిక సాధికారత పెంపొందించేందుకు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం (MSSC). ఇది వన్ టైమ్ ఇన్వె‌స్ట్‌మెంట్ స్కీమ్. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో భాగంగానే దీనిని లాంఛ్ చేసింది. కేవలం మహిళలకు మాత్రమే ఇందులో చేరేందుకు అనుమతి ఉంటుంది. 2023 బడ్జెట్ సమయంలో తీసుకురాగా.. రెండేళ్ల వరకు గడువు విధించింది. అంటే 2025 మార్చి వరకు ఈ స్కీంలో చేరేందుకు …

    Read More »
  • 7 August

    తెనాలి పానీపూరి బండి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం.. ఎందుకో తెలుసా? ఇది అరుదైన అవకాశం!

    గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పానీపురం బండి నిర్వహించే వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా రాష్ట్రపతి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను పంపించారు. ఆగస్టు 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కింది. తెనాలి బాలాజీరావుపేటకు చెందిన మెఘావత్ చిరంజీవి.. రైల్వే స్టేషన్ వీధిలో పానీ పూరి అమ్ముతున్నారు. ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకునేవారు. ఆ తర్వాత ఆయన తన ఆలోచనను మార్చుకున్నారు. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్‌ కింద మెప్మా రుణం …

    Read More »
  • 7 August

    తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ రైలు రద్దు చేశారు, మరో రెండు రైళ్లకు అదనపు స్టాప్‌లు

    తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైమన గమనిక.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 11 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖ-కడప మధ్య నడిచే రైలు (17488 ) ఈ నెల 5 నుంచి 10 తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో కడప నుంచి విశాఖ రైలు (17487) ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు చెప్పారు. విజయవాడ సమీపంలో నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ప్రయాణికులు …

    Read More »
  • 7 August

    ఆ రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

    దిన ఫలాలు (ఆగస్టు 7, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు చాలా కాలం ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. వృషభ రాశివారికి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు చాలా కాలం ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో భాగస్థులతో …

    Read More »
  • 7 August

    త్వరలో శుక్ర సంచారం.. ఈ రాశులకు కుభేర యోగం.. పట్టిందల్లా బాగారం.. మీరున్నారా చెక్ చేసుకోండి..

    శుక్రుడు ఆగష్టు 11వ తేదీన శుక్రుడు రాశిని మార్చుకోనున్నాడు. ఇలా శుక్రుడు నక్షత్ర సంచారంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు లగ్జరీ లైఫ్‌ అనుభవిస్తారు. ఈనెల 11న శుక్రుడు ఫాల్గుణ నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. శుభాలను ఇచ్చే శుక్రుడు తన రాశులకు శుభ యోగాలను సృష్టిస్తాడు. ఇలా శుక్రుడు పాల్గుణ నక్షత్రంలో అడుగు పెట్టడం వలన కొన్ని రాశులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. సంపదల వర్షం కూడా కురుస్తుంది. ఈ సందర్భంగా ఏ రాశులకు శుభ యోగాలను సృష్టిస్తాడో.. అందులో మీ …

    Read More »
  • 6 August

    బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా 26 ఏళ్ల నహిద్ ఇస్లామ్.. రేసులో భారత వ్యతిరేకి కూడా!

    Nahid Islam: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని ఏలిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇక ప్రస్తుతం సైనిక పాలనలో ఉన్న బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన 26 ఏళ్ల నహీద్ ఇస్లామ్ కొత్త ప్రధాని రేసులో ఉన్నారు. నహీద్ ఇస్లామ్‌తోపాటు మాజీ ప్రధానమంత్రి, షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా, …

    Read More »
  • 6 August

    ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ.. సీఎం చంద్రబాబు కీలక చర్చలు

    CM Chandrababu talks with Youtube CEO on Academy in AP:ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెంచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు హామీల అమలు, పెట్టుబడుల ఆకర్షణపై ఫోకస్ పెట్టారు. ఏపీలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో …

    Read More »
  • 6 August

    మా నాన్న ఐఏఎస్.. టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు

    తిరుమల సిఫార్సు లేఖల విషయంలో గుంటూరు అరండల్‌పేటలో తనపై నమోదైన కేసు, వస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లను అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని భరత్ అన్నారు.. తన తండ్రి ఓ ఐఏఎస్ అధికారి అని చెప్పిన భరత్ .. తాను ఒక బ్యూరోక్రట్ ఫ్యామిలీ నుంచి వచ్చానని అన్నారు. ఉన్నతమైన విలువలతో తమ కుటుంబం బతుకుతోందని అన్నారు. టీడీపీ నేత చిట్టిబాబు చెప్తున్నట్లుగా తనకు మల్లికార్జున్ అనే పీఆర్వో లేడన్న ఎమ్మెల్సీ భరత్.. ఆ …

    Read More »
  • 6 August

    బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవదహనం.. 440కి చేరిన మృతులు

    బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు ఆగడం లేదు. ఇప్పటికే ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి పారిపోయినా అక్కడ ఆందోళనలు మాత్రం చల్లారడం లేదు. దేశం మొత్తాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నా.. నిరసనకారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 440 కి పెరిగింది. తాజాగా ఓ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పుపెట్టడంతో.. అందులో ఉన్న 24 మంది సజీవ దహనం అయ్యారు. ఆ హోటల్‌లో ఇండోనేషియాకు చెందిన ఓ పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. …

    Read More »