TimeLine Layout

August, 2024

  • 2 August

    సమంతను చూస్తూ ‘నేనే నానినే’ పాట పాడిన వరుణ్ ధావన్

    విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ తర్వాత సమంత కొత్త సినిమా ఏం చేయలేదు. అయితే చాన్నాళ్లుగా ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ సిరీస్ షూటింగ్‌లో మాత్రం పాల్గొంటుంది. ఈసారి తనలోని యాక్షన్‌ యాంగిల్‌ను చూపించేందుకు సామ్ సిద్ధంగా ఉంది. ఇందులో వరుణ్‌ ధావన్‌ సామ్‌కి జోడీగా నటిస్తున్నాడు. రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌ టీజర్‌‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. నవంబరు 7న రాబోతున్న ఈ సిరీస్ టీజర్‌లో సమంత-వరుణ్ ధావన్ యాక్షన్‌తో అదరగొట్టారు. ఇందులో సమంత గూఢచారిగా …

    Read More »
  • 2 August

    దెబ్బకి దిగొచ్చిన పల్లవి ప్రశాంత్.. రైతు కుటుంబానికి రూ.20 వేల సాయం

    ఇచ్చిన మాట తప్పిన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ని నెటిజన్లు నిలదీయడంతో దెబ్బకి దిగొచ్చాడు. తనని బిగ్ బాస్ విన్నర్‌గా గెలిపిస్తే ప్రైమ్ మనీ మొత్తం పైసలతో సహా.. రైతులకు పంచిపెడతానని కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా ప్రమాణం చేసిన పల్లవి ప్రశాంత్.. ఒక పేద కుటుంబానికి మాత్రమే సాయం చేసి ఆ తరువాత ప్లేట్ తిప్పేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రారంభానికి రెడీ అవుతుంది కానీ.. తాను ఇచ్చిన మాటని మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు పల్లవి ప్రశాంత్. అయితే …

    Read More »
  • 2 August

    చంద్రబాబుపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రశంసలు.. ఇదే పద్ధతి ఫాలో కావాలని సూచన

    టీడీపీ, కాంగ్రెస్ పార్టీలంటే ఒకప్పుడు ఉప్పూనిప్పూగా ఉండేవి. టీడీపీ ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఇక మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ పార్టీలు రెండూ దగ్గరయ్యాయి. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా పోటీకూడా చేశాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు గురువారం ఉమ్మడి …

    Read More »
  • 2 August

    శ్రీశైలం ఆలయంలో అపచారం.. ఓ ఉద్యోగి సిగ్గు లేకుండా..?

    శ్రీశైలం ఆలయంలో అపచారం జరిగింది.. ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. ఉద్యోగి తీరు తేడాగా ఉండటంతో భక్తులకు అనుమానం వచ్చింది.. అతడ్నిపట్టుకుని భక్తులు చితకబాదారు. గురువారం రాత్రి 9 గంటలకు క్యూ కంపార్టుమెంట్‌లో ఈ ఘటన జరిగింది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల దగ్గర బైఠాయించి నిరసనను తెలియజేశారు. ఈ విషయం తెలియడంతో ఆలయ అధికారి జి.స్వాములు అక్కడికి వచ్చారు. ఆందోళన విరమించాలని భక్తుల్ని కోరారు. ఆలయ అధికారి భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ఆలయ సిబ్బంది మద్యం తాగి …

    Read More »
  • 2 August

    తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అక్కడ కూడా దర్శన టికెట్లు, కౌంటర్ ఏర్పాటు

    తిరుమల శ్రీవారి ఎస్‌ఎస్‌డీ టైం స్లాట్ టోకెన్లు వారానికి 1.47 లక్షలు జారీ చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. అలిపిరి నుంచి విజిలెన్స్, అటవీశాఖ అధికారుల కొన్ని సూచనలు ఉన్నాయని.. త్వరలోనే చర్చించి అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చూస్తామన్నారు. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో.. టీటీడీ ఈవో జే శ్యామల రావు భక్తుల వద్ద నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు భక్తుల దగ్గర నుంచి ప్రశంసలు వచ్చాయి. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యతపై భక్తులు …

    Read More »
  • 2 August

    నేడే తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల.. 

    తెలంగాణ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రణాళిక ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో.. శుక్రవారం (ఆగస్టు 2) అసెంబ్లీ (TG Assembly)లో జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. యువతకు హామీ ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ (Job Calendar) విడుదల చేస్తామన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్త చేస్తామని రెండు రోజుల క్రితలం మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించిన …

    Read More »
  • 2 August

    పేపర్ లీకేజ్‌పై సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

    వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) ప్రశ్నాపత్రం లీకేజ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్ధులు, ఓ జూనియర్ ఇంజినీర్, ఇద్దరు కుట్రదారులు సహా 13 మందిని నిందితులుగా చేర్చింది. నీట్ లీక్ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. పరీక్షను రద్దుచేసి.. మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టును పలువురు ఆశ్రయించగా.. అందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమే కానీ.. దీని …

    Read More »
  • 2 August

    ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రభుత్వ ఉద్యోగులు ఖుషీ.. 

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెన్షన్లు జమ చేసింది. ఆగస్టు 1నే జీతాలు జమ చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు.. ఓ ఉద్యోగి వీడియోను ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే పడిన జీతాలు.. ఆనందమయ జీవితాలు. ఇదీ కూటమి ప్రభుత్వం సమర్ధ పాలనకు నిదర్శనం’ అన్నారు. ఒకటో తేదీన జీతాలు పడ్డాయంటూ ఓ ఉద్యోగి పలకపై రాశారు.. గురువారం ఉదయం 7.45 నిమిషాలకు జీతం అకౌంట్‌లో …

    Read More »
  • 2 August

    వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

    దిన ఫలాలు (ఆగస్టు 2, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారు వ్యాపార లావాదేవీల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. మిథున రాశి వారికి తల్లితండ్రుల నుంచి ఊహించని ధన సహాయం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దైవ …

    Read More »
  • 2 August

    చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్.. ఏపీ చరిత్రలో తొలిసారి, ఒక్కరోజులోనే సాధ్యమైంది !

    ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఈ రికార్డును అందుకున్నారు. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పింఛన్లను వరుసగా రెండో నెలలో కూడా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకే పంపిణీ ప్రారంభించగా.. వరుసగా రెండో నెల సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజులోనే 97.50 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. …

    Read More »