Allahabad High Court: దేశంలో మరో మసీదు మందిరం వివాదం కొనసాగుతూనే ఉంది. అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదును నిర్మించారని తేల్చిన సుప్రీంకోర్టు.. హిందువులకు అనుకూలంగా తీర్పునివ్వడంతో అక్కడ దివ్య రామమందిరం కొలువుదీరింది. మరోవైపు.. అదే ఉత్తర్‌ప్రదేశ్‌లో శ్రీకృష్ణ జన్మభూమిగా భావించే మధురలోనూ హిందూ, ముస్లిం సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మధుర శ్రీ కృష్ణ జన్మభూమి అని హిందువులు వాదిస్తుండగా.. అది షాహీ ఈద్గా మసీదు అంటూ ముస్లిం పక్షాలు కోర్టుల్లో పిటిషన్ల మీద …
Read More »TimeLine Layout
August, 2024
-
1 August
తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులు బ్యాంకులు బంద్..
జులై నెల ముగిసి ఆగస్టులోకి అడుగుపెట్టాం. క్యాలెండర్ నెల మారితే కొన్ని ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వస్తుంటాయి. ఈ సారి వాణిజ్య సిలిండర్ ధరలను స్వల్పంగా పెంచింది కేంద్రం. అలాగే విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించింది. అయితే తరుచుగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి వారు కచ్చితంగా బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవాలి. లేదంటే తీరా సమయానికి బ్యాంక్ లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ఆగస్టు నెలలో మొత్తంగా బ్యాంకులకు 13 …
Read More » -
1 August
కేటీఆర్, హరీష్ సహా BRS ఎమ్మెల్యేలు అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీలో నేడు గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభ ముందు ఆందోళన చేపట్టగా.. అభ్యంతరం చెబుతూ వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అమాంతం ఎత్తుకెళ్లి పోలీసులు వాహనాల్లో ఎక్కించారు. అనంతరం వారిని అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు తరలించారు. బుధవారం (జులై 31) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించారని .. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని సభ్యులు డిమాండ్ …
Read More » -
1 August
యూపీఐ సహా ఆ పేమెంట్లు చేసే వారికి అలర్ట్.. RBI కీలక ప్రతిపాదనలు.. ఇక ఓటీపీతో పాటు!
దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా నిత్యం కోట్లల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. అలాగే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీల్లో ఎస్మెమ్మెస్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే, ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు పెరిగి పోయిన క్రమంలో ఓటీపీతో పాటు అదనపు అథెంటికేషన్ ఉండాల్సిన అవసరం ఉందని కీలక ప్రతిపాదనలు చేస్తూ ముసాయిదా ఫ్రేమ్‌వర్క్ విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిజిటల్ పేమెంట్ల విషయంలో అథెంటికేషన్ కోసం ప్రత్యేకంగా …
Read More » -
1 August
శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు.. కృష్ణమ్మకు ముఖ్యమంత్రి జలహారతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. చంద్రబాబు ఉదయం హెలికాప్టర్‌లో తాడేపల్లి నుంచి సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం వచ్చారు.. అక్కడ చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకోగా.. ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక …
Read More » -
1 August
హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్.. 20 మంది గల్లంతు.. భయానక దృశ్యాలు
కేరళలో ప్రకృతి ప్రకోపం మరిచిపోకముందే హిమాచల్ ప్రదేశ్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. సిమ్లా సమీపంలోని రామ్‌పూర్‌లో గురువారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ అయినట్టు కుండపోత వర్షం కురవడంతో 20 మంది గల్లంతయ్యారు. సమేజ్ ఖడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో క్లౌడ్ బరస్ట్ అయినట్టు విపత్తు నిర్వహణ దళానికి సమాచారం వచ్చిందని జిల్లా అధికారులు తెలిపారు. తక్షణమే అక్కడకు విపత్తు నిర్వహణ బృందం, డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్, ఎస్పీ సంజీవ్ గాంధీ సహా ఇతర ఉన్నతాధికారులు బయలుదేరి వెళ్లారని వెల్లడించారు. క్లౌడ్ …
Read More » -
1 August
మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా యువ అధికారి.. ఏరి కోరి మరీ, ఎవరీ ఆకుల వెంకటరమణ!
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా యువ అధికారి ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. కడప జిల్లా నుంచి ఏరికోరి ఆయన్ను తీసుకొచ్చి మానవ వనరులశాఖలో మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా నియమించారు. రమణ గతంలో తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడ గిరిజనులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో, జీవన ప్రమాణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ నుంచి కడప జిల్లా బద్వేలు ఆర్డీవోగా బదిలీ కాగా.. అక్కడ కూడా సమర్థవంతమైన అధికారిగా ప్రశంసలు పొందారు. ఇప్పుడు నారా …
Read More » -
1 August
దశ తిప్పిన ఐపీఓ.. లిస్టింగ్‌తో చేతికి రూ. 2.75 లక్షలు.. ఒక్కరోజే 100 శాతం పెరిగిన షేరు!
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు రిస్క్ ఉంటుందని తెలుసుకోవాలి. అయినప్పటికీ ఇటీవలి కాలంలో ఇందులో లాభాలపై ఆశతో కొత్తగా ఎక్కువ మంది చేరుతున్నారని చెప్పొచ్చు. అయితే వీరు ముందుగా మార్కెట్లపై మంచి అవగాహన పెంపొందించుకోవాలి. ఇంకా ఆర్థిక నిపుణుల సలహాతో సరైన స్టాక్ ఎంచుకోవాలి. కంపెనీల పనితీరు, ప్రకటనలు, ఫలితాలు, పెట్టుబడి వ్యూహాలు ఇలా అన్నీ గమనిస్తూ సరైన సమయంలో సరైన స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ వస్తుంటాయి. ఇక ఐపీఓలు మాత్రం లిస్టింగ్‌తోనే మీ సంపదను …
Read More » -
1 August
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్
తెలంగాణను వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు. గత 10 రోజులకు పైగా.. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయితే నేడు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. …
Read More » -
1 August
టీడీపీ మహిళా ఎమ్మెల్యే పెద్ద మనసు.. సొంత డబ్బులతో అంబులెన్స్,
టీడీపీ మహిళా ఎమ్మెల్యే పెద్ద మనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలో ప్రజల కష్టాలను చూడలేకపోయారు.. వెంటనే సొంత డబ్బులతో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఇటీవల రంపచోడవరం మండలం దారగూడెంకు చెందిన నెరం పద్మకాకినాడ జీజీహెచ్‌లో చనిపోయింది. అయితే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్వచ్ఛందంగా రూ.5500లతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహం గ్రామానికి చేర్చారు. రంపచడోవరం నియోజకవర్గంలో ఇక నుంచి ఎవరూ …
Read More »