ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 10, 2024): మేష రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన లాభాలు కలిగిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం కావచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో కొద్దిగా మార్పులు, చేర్పులు తలపెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. సొంత పనుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన లాభాలు కలిగిస్తాయి. వ్యక్తిగత సమస్యల విషయంలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. గౌరవమర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): చిన్నపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీకు ఆశించిన ప్రాధాన్యం లభిస్తుంది. వృత్తి జీవితంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయ త్నాలు కొద్దిగా నిరుత్సాహం కలిగించే అవకాశం ఉంది. ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగ స్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఇతరులతో వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పనులు ఒక పట్టాన ముందుకు సాగవు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవ కాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా అనుకూలంగా ఉంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివా దం పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవ కాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగు పడుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో మీ పని తీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. ప్రస్తుతానికి ఉద్యోగం మారకపోవడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనేక అవకాశాలు అందుతాయి. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వివాహ ప్రయ త్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధు మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉండ వచ్చు. ఉద్యోగంలో బాధ్యతలను మార్చే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగి పోతాయి. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి భారీగా షాపింగ్ చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశాలు ఉన్నాయి.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు నిరాటంకంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి.కుటుంబ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ప్రస్తుతానికి పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. కొన్ని కీలక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పని తీరు పట్ల అధికారులు సంతృప్తి చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెడతారు. ఇప్పుడు ప్రారంభించే కార్యక్రమాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఆదాయానికి లోటుండదు. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగు తాయి. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవు తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో హోదాతో పాటు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ఉన్నత స్థాయి పరిచ యాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

About rednews

Check Also

కుటుంబ జీవితంలో వారికి కొద్దిగా ఇబ్బందులు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 23, 2024): మేష రాశి వారికి ఆదాయపరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి వారికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *