దిన ఫలాలు (అక్టోబర్ 16, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఆర్థిక విషయాల్లో ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథున రాశి వారికి అవసరానికి తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. రుణ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందజేస్తారు. కీలక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఆర్థిక విషయాల్లో ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): చేపట్టిన వ్యవహారాలు, పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. పిల్లలకు ఉన్నత స్థాయి విద్యావకాశాలు లభిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు తగ్గట్టుగా వ్యవహరించి ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కార మార్గం లభిస్తుంది. ఆదాయపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన గృహోపకరణాలు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): బంధుమిత్రులతో అపార్థాలు, వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందు తుంది. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఇష్టమైన బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారం అవుతాయి. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయం ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇంటా బయటా విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. బంధుమిత్రులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కొద్దిపాటి జాప్యం ఉండ వచ్చు. వ్యాపారాల్లో స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో సమయానుకూల నిర్ణ యాలు తీసుకుని ప్రయోజనాలు పొందుతారు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయానికి తగ్గ వృథా ఖర్చులు ఉంటాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): సర్వత్రా అనుకూల పరిస్థితులుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. బంధుమిత్రుల నుంచి రావాల్సిన సొమ్మును రాబట్టుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆర్థికంగా ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆదాయపరంగా సంతృప్తినిస్తాయి. ఆదాయం బాగా అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): నిరుద్యోగులు ఆశించిన ఆఫర్లు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహవంతంగా సాగుతుంది. చేపట్టిన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వ్యవహారాలను పరిష్కరిం చుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగు తుంది. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నెరవేరుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగులు కొత్త ఆదాయ ప్రయత్నాలను చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సా హంతో కొన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. తల్లితండ్రుల నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదంలో రాజీ చేసుకుంటారు. వ్యాపా రాల్లో కొత్త అవకాశాలు అందుతాయి. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీ సమర్థతకు, ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు అందివస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు రాబడిపరంగా నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఇల్లు కొనే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయం పెరు గుతుంది కానీ, వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. ఇంటా బయటా బాధ్యతల నిర్వహణలో కొద్దిగా శారీరక శ్రమ ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇతరులకు సహాయపడగల స్థితిలో ఉంటారు. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో మీ ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించు తాయి. ప్రయాణాలు అనుకూలంగా సాగిపోతాయి. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి.