దిన ఫలాలు (అక్టోబర్ 18, 2024): మేష రాశి వారు ఈ రోజు జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆదాయం సంతృప్తికరంగా వృద్ధి చెందుతుంది. జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొందరు మిత్రులతో అకారణ విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగంలో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మితి మీరిన ఔదార్యం వల్ల నష్టపోతారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, విలాసాల మీదా, కుటుం బం మీదా ఖర్చులు పెరుగుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యో గంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయంలో ఎక్కువ భాగం ఉచిత సహాయాలకు, దాన ధర్మాలకు వృథా అయిపోతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవు తాయి. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగంలో ప్రతిభకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యో గంలో జీతాలు, హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అయితే, కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది కానీ, పనిభారం బాగా ఎక్కువగా ఉంటుంది. జీత భత్యాలు, లాభాలు, రాబడితో సహా అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. దైవ కార్యాల మీద ఖర్చు పెడతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఆనందంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనేక విధాలుగా డబ్బు కలిసి వస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాలలో విదేశీ అవకాశాలు అందుతాయి. ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా మాటకు విలువ ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొందరిని గుడ్డిగా నమ్మి నష్టపోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో పని భారం బాగా ఎక్కువగా ఉంటుంది. అధికారులు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. అనవసర పరిచయాలు, వ్యసనాలు ఇబ్బంది పెడతాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది.
- ధనుస్పు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఇబ్బందుల్లో పడతారు. సుఖ సంతోషాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఎటువంటి బాధ్యతల నైనా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవ కాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడతారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. ఇతరులకు సహాయం చేసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ప్రముఖు లతో పరిచయాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. కుటుంబ బాధ్యత లను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ప్రయత్నాలు చేయడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. సొంతగా ఇల్లు కొనుక్కునే ప్రయ త్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధి క్యత తప్పకపోవచ్చు. కార్యకలాపాలు క్రమంగా పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రులతో తొందరపాటుతో వ్యవహరించవద్దు.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగు తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా కొద్దిగా నష్టపోవడం జరుగుతుంది.