కుటుంబ జీవితంలో వారికి కొద్దిగా ఇబ్బందులు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 23, 2024): మేష రాశి వారికి ఆదాయపరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగపరంగా తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాగిపోతుంది. ఆదాయపరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ నెరవేరుతాయి. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అయ్యే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఉద్యోగ పరంగా తప్పకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితంలో అనుకూల పరిస్థి తులు నెలకొంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యంగా అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. అనుకోకుండా అనా రోగ్య సమస్యలు చోటు చేసుకోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. ఉద్యోగపరంగా తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. సామాజికంగా కూడా ప్రతిభకు, సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. పిల్లలు పురోగతి సాధి స్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభం ఉంటుంది. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉండే అవ కాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది. స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. శరీరానికి విశ్రాంతి అవసరమనిపిస్తుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాం తంగా గడిచిపోతుంది. గృహ, వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. హోదా పెరగడం, బాధ్యతలు మారడం వంటివి జరుగుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు, పనులు నిదానంగా పూర్తవు తాయి. తోబుట్టువులతో ఆస్తి సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉండకపోవచ్చు. కుటుంబ జీవితంలో కొద్దిగా ఇబ్బందులుండవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు, ఆర్థిక సమస్యలు తీరి పోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండకపోవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలు న్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సంపాదన వృద్ధి చెందుతుంది. సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలోసుఖ సంతోషాలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతికి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి కానీ, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది. ముఖ్యమైన విషయాల్లో తప్పకుండా కార్యసిద్ధి, వ్యవహార జయం కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకంగా సాగిపోతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. మిత్రుల వల్ల డబ్బు నష్టం, వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.

ధనుస్పు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవు తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ఆదాయ వృద్ధితో పాటు, కుటుంబ జీవితంలో అనుకూలతలు బాగా వృద్ధి చెందుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అదనపు ఆదాయ మార్గాల మీద శ్రమ పెరుగుతుంది. ధనాదాయం అనుకూలంగా కొనసాగు తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషా లతో సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. ఉద్యోగంలో పని భారం పెరిగినా ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా సాగిపోతాయి. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు, నిరుద్యో గు లకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో కాస్తంత ఒత్తిడి ఉంటుంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. అనవసర వ్యయం, అనవసర పరిచయాలకు బాగా అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధా సక్తులు బాగా పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.

About rednews

Check Also

వారి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 22, 2024): మేష రాశి వారి ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *