వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 27, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు స్థిరంగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది.

మిథున రాశి వారికి ఆదాయ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు చాలావరకు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సమయానికి పూర్తి చేస్తారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అత్యవసర పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. వ్యాపారాల్లో ఊహించని లాభాలుంటాయి. వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. పిల్లలు తమ చదువుల్లో దూసుకుపోతారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. విదేశాల నుంచి శుభవార్త వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆదాయ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు వసూలవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభా లకు లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన సమాధానం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం పెరిగి కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆదాయ ప్రయ త్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఉంటుంది. నిరుద్యోగులు ప్రయత్నాలు నెరవేరుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, అందులో ఎక్కువ భాగం వృథా ఖర్చులకు సరిపోతుంది. నిరుద్యోగులు ఆశించిన ఆఫర్లు అందుకుంటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి, చికాకులుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆశించిన శుభ వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ఊహించని ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదం ఒకటి తేలికగా పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మంచి మార్పులు చేసి ప్రయో జనం పొందుతారు. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశిం చిన స్పందన లభిస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని ఆర్థిక సంబంధమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా విమర్శలు, ఒత్తిడి తప్పకపోవచ్చు. అలవి కాని లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండకపోవచ్చు. రావలసిన డబ్బును పట్టుదలగా వసూలు చేసుకుంటారు. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి బంధువర్గంలోనే మంచి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులతో దూరం పాటించడం మంచిది. కొద్ది ప్రయత్నంతో చిన్నా చితకా వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యం నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కష్టార్జితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ప్రయా ణాల్లో బాగా ఇబ్బందులు పడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, సంతోషంగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితా లనిస్తాయి. ఆస్తి వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండే అవ కాశం ఉంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులకు కోత పెడతారు. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉండి, నిద్రాహారాలు దూరం అవుతాయి. వృత్తి జీవితం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. వ్యాపారంలో కొద్దిగా మార్పులు, చేర్పులు చేపడతారు. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. కొందరు చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభ వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించవచ్చు. కుటుంబ సభ్యులతో నచ్చిన ప్రాంతాల్ని సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా అను కూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయానికి లోటుండదు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *