యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు

ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.. జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్‌ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్‌ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.

ఈ జాబ్ మేళాలో టెక్నో టాస్క్, వరుణ్‌ మోటార్స్, రిలయన్స్‌ డిజిటల్స్, బిజినెస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్, ముత్తూట్‌ మినీ ప్రైవేట్‌ లిమిటెడ్, ముక్క ఫైనాన్షియల్‌ కన్సల్టింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు అన్నారు. ఈ ఉద్యోగాల్లో నెలకు రూ.10 వేల నుంచి రూ.22 వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను నేరుగా ఎంపిక చేస్తారని.. ఆసక్తిగల వారు వారి విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఎవరికైనా అనుమానాలు ఉన్నా, మరిన్ని వివరాలకు 98488 19682, 96666 54641 నంబర్లకు సంప్రదించాలన్నారు. గుడివాడతో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్న రెండు, మూడు జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *