దేవర ఫస్ట్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్, ఆ సీన్లే హైలెట్

కొరటాల శివ, జూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రం రేపు (సెప్టెంబర్ 27) ఇండియా వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ మిడ్ నైట్ షోలు, ఫ్యాన్స్ షోలు ఫుల్ అయిపోయాయి. ఓవర్సీస్‌లో దేవర షోలు పడిపోయాయి. దీంతో అక్కడి నుంచి టాక్ బయటకు వచ్చింది. దేవర అదిరిపోయిందని ఓవర్సీస్ రిపోర్టులు చెబుతున్నాయి. దేవర ముంగిట నువ్వెంత అనేలా సినిమా ఉందని అక్కడి ఆడియెన్స్ చెబుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో దేవర సందడి తారాస్థాయికి చేరింది. ఇక దేవర టాక్ మాత్రం అదిరిపోయిందని తెలుస్తోంది.

అసలే ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో.. చాలా గ్యాప్‌తో వస్తుండటంతో దేవర మీద అంచనాలు పెరిగాయి. సోలోగా ఎన్టీఆర్ వచ్చి ఆరేళ్తు అవుతుండటంతో అభిమానులు ఆకలి మీదున్నారు. అలాంటి వారికి దేవర టీజర్, ట్రైలర్‌లు మరింత ఆకలిని పెంచాయి. ఇప్పుడు దేవర మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ పెరిగింది. అందుకే అక్కడి ప్రీమియర్లకు విపరీతమైన స్పందన వచ్చింది.

బుకింగ్స్‌తోనే రెండున్నర మిలియన్ల డాలర్లను కొల్లగొట్టింది దేవర. ఇక ఇప్పుడు దేవర యూఎస్ ప్రీమియర్ల టాక్ అదిరిపోయింది. ఇప్పుడే సినిమాను చూశాను.. విజువల్ ఫీస్ట్.. అదిరిపోయింది.. ఎపిక్ స్టోరీ.. అద్భుతమైన పర్ఫామెన్స్‌లున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు అదిరిపోతుందని, దేవర ఎంట్రీకి థియేటర్లు బద్దలవ్వాల్సిందే అని చెబుతున్నారు.

దేవర ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా అందరికీ నచ్చుతుందని అంటున్నారు. జాన్వీ కపూర్ పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా.. ఆమె ప్రస్థావన మాత్రం చివరి వరకు ఉంటుందట. సైఫ్, జూనియర్ ఎన్టీఆర్ నటన అదిరిపోతుందని అంటున్నారు. ఇక అనిరుధ్ ఆర్ఆర్ సినిమాకు మేజర్ అస్సెట్ అని చెబుతున్నారు. కెమెరా వర్క్, సీజీ, వీఎఫ్ఎక్స్ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయని చెబుతున్నారు. కొరటాల ఈ సినిమా హిట్టు కొట్టేసినట్టే అని కామెంట్లు పెడుతున్నారు. మరి పూర్తి రివ్యూ తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మిడ్ నైట్ నుంచే సంబరాలు మొదలయ్యేలా ఉన్నాయి.

About rednews

Check Also

అనంతపురం జిల్లాలో భారీ వానలు.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో భారీ వర్షాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *