Masonry Layout

ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్లు.. ఈసారి ముందుగానే, కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శాఖలవారీగా ప్రక్షాళన మొదలుపెట్టింది. ఈ మేరకు విద్యాశాఖపై మంత్రి లోకేష్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అవసరమైన చోట్ల మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ ఇవ్వాలని భావిస్తున్నారట.. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌ను వచ్చే ఏడాది నుంచి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. యూనిఫామ్ మాత్రమే కాదు.. బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత …

Read More »

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ మెచ్చిన సర్పంచ్ .. ఎవరీ కారుమంచి సంయుక్త?

Pawan kalyan at Swarna Grama Panchayat in Mysooravariapalli:ఏపీలోని సుమారు 13వేలకు పైగా పంచాయతీలలో ఇవాళ (ఆగస్ట్ 23వ తేదీన) గ్రామసభలు జరిగాయి. ఒకేరోజు ఈ స్థాయిలో గ్రామసభల నిర్వహణ దేశంలోనే ఇదే తొలిసారి. ఇక ఈ సంబరంలో పాల్గొనేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అన్నమయ్య జిల్లాకు వెళ్లారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కారుమంచి సంయుక్త మీద పవన్ కళ్యాణ్ …

Read More »

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల కోసం తమిళనాడు భక్తుల అతి తెలివి.. చివరి నంబర్లు మార్చి, ప్లాన్ రివర్స్

తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్లైన్‌లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. దర్శనం కోసం దళారులను ఆశ్రయించి తమ దర్శన టికెట్లు నష్టపోవద్దని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. గురువారం ఉదయం తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించారు. వీరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు …

Read More »

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ కొత్త రైలు మార్గంతో బెనిఫిట్, ఈ రూట్‌లోనే!

ఆంధ్రప్రదేశ్‌లోని విలీన మండలాల సమీపంలో రైలు కూత వినిపించబోతోంది. గోదావరికి అవతలి వైపు కొత్త రైలు మార్గానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఏపీకి కలిసొస్తుంది. కేంద్రం ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి తెలంగాణలోని బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు 200.60 కి.మీ. పొడవుతో కొత్త రైల్వే లైను నిర్మాణానికి ఓకే చెప్పింది. మొత్తం రూ.4,109 కోట్ల వ్యయంతో ఈ లైను నిర్మాణం కాబోతోంది.. ఒడిశా నుంచి ఈ లైను గోదావరి అవతలి వైపున ఉన్న చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా వస్తుంది.. అక్కడి …

Read More »

Bengaluru: నన్ను జైల్లో పెట్టండి కానీ.. భార్యతో ఉండలేను.. వేధింపులతో ఇంటి నుంచి పారిపోయిన టెక్కీ!

భార్య వేధింపులకు తాళలేక ఇళ్లు వదిలి పారిపోయాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. భర్త కనిపించకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడు నొయిడాలో ఉన్నట్టు గుర్తించారు. నచ్చజెప్పి అతడ్ని బెంగళూరుకు తీసుకురాగా.. భార్య నన్ను చిత్రహింసలకు గురిచేస్తోందని వాపోయాడు. అంతేకాదు, జైలుకి వెళ్లమన్నా వెళ్తా కానీ ఆమెతో జీవితం పంచుకోలేనని తెగేసి చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర బెంగళూరులో భార్యతో కలిసి నివాసం ఉంటోన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ …

Read More »

Bandi Sanjay: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. టీపీసీసీ చీఫ్‌గా కేటీఆర్, కేసీఆర్‌కు ఏఐసీసీ, కవితకు రాజ్యసభ ఎంపీ

Bandi Sanjay: కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల్లో.. ఆ రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా కనిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే బీఆర్ఎస్.. బీజేపీలో విలీనం అవుతుందని మొదట కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అంటూ రెండు పార్టీల నేతలు ప్రచారం …

Read More »

AP donation to Wayanad: కేరళకు అండగా ఏపీ.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం

కేరళలోని వయనాడ్‌లో ఇటీవల సంభవించిన విపత్తు.. వందల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారుగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ప్రకృతి ప్రకోపంలో అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిన వారెందరో. అయితే ఈ విపత్తు వేళ కేరళ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలిచింది. వయనాడ్ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా అందించింది. అయితే …

Read More »

40 కోట్ల మంది స్వాతంత్య్రం సాధిస్తే.. 140 కోట్ల మందితో వికసిత్ భారత్ సాధ్యమే.. మోదీ

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలనే లక్ష్యంతో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ‘వికసిత్ భారత్’థీమ్‌తో నిర్వహిస్తున్నారు. అప్పటికి భారతావనికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుంది. అందుకే ఆ సమయానికి భారత్‌ను సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం ఈ థీమ్ని ఎంపికి చేసింది. ఈ ఏడాది వేడుకలకు 6 వేల మంది అతిథులను ఆహ్వానించారు. వీరిలో పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతోపాటు లఖ్‌పతీ దీదీ, డ్రోన్‌ దీదీ వంటి పథకాల లబ్ధిదారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు …

Read More »

కశ్మీర్‌లో ముష్కర మూకల కోసం వేట.. ఆర్మీ కెప్టెన్ వీరమరణం

జమ్మూ కశ్మీర్‌లో ముష్కర మూకల కోసం గాలిస్తుండగా.. ఓ సైనికాధికారి అమరుడయ్యాడు. దోడా జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అస్సార్ అలీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ ఆర్మీ కెప్టెన్‌ వీరమరణం పొందాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతుంది. శివ్‌గఢ్-అస్సార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం రావడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా …

Read More »

మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్యపై స్పందించిన సత్య నాదెళ్ల: ఏమన్నారంటే?

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft Windows)లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో సిస్టంలు షట్‌డౌన్/రీస్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో క్రౌడ్ స్ట్రైక్ అప్‌డేట్ చేయడం వల్లే సాంకేతిక సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ విషయంపై తాజాగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) స్పందించారు. నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్‌డేట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లలో సాంకేతిక …

Read More »